Home /News /trending /

CHILDREN BECOMES WHAT THEY SEE AN INITIATIVE BY NETWORK 18 DIAGEO SS

నెట్‌వర్క్18-డియాజియో సంయుక్తంగా 'రోడ్ టు సేఫ్టీ' క్యాంపైన్

నెట్‌వర్క్18-డియాజియో సంయుక్తంగా 'రోడ్ టు సేఫ్టీ' క్యాంపైన్ 
(image: @DiageoRTS18)

నెట్‌వర్క్18-డియాజియో సంయుక్తంగా 'రోడ్ టు సేఫ్టీ' క్యాంపైన్ (image: @DiageoRTS18)

Network 18-DIAGEO Initiative | రోడ్డు భద్రత అనేది ఇతరుల కోసం కాదు తమను భద్రంగా ఉంచేందుకు చెప్పే అంశం అని అందరూ అర్థం చేసుకోవాలి.

    డ్రైవింగ్ చేసే సమయంలో భద్రత చాలా ముఖ్యమైన అంశం. హెల్మెట్ లేనంతవరకు మీ తల సురక్షితం కాదు. భద్రంగా, సురక్షితంగా ఉండటం మొదటి ప్రాధాన్యత. గమ్యస్థానానికి త్వరగా వెళ్లాలన్న తొందరలో ప్రమాదాలు కొనితెచ్చుకోకూడదు. అందుకే "సడక్ సురక్ష జీవన్ రక్ష" పేరుతో ప్రభుత్వం ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రభుత్వం మాత్రమే కాదు అనేక సంస్థలు కూడా జాగ్రత్తగా వాహనాలను నడపాలన్న సందేశాలను చాటుతున్నాయి. నెట్‌వర్క్18-డియాజియో సంయుక్తంగా 'రోడ్ టు సేఫ్టీ' పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టాయి. 'రోడ్ టు సేఫ్టీ' కార్యక్రమం వెనుక ఉద్దేశం ఏంటంటే మీ పిల్లలకు 'మీరేం చెప్తారో అది పాటించండి' అని గుర్తుచేయడమే. ఎందుకంటే పిల్లలకు అద్భుతమైన గ్రహించే శక్తి ఉంటుంది. మీరేం చెప్తే అది గుర్తుపెట్టుకుంటారు.

    పిల్లల మనస్సు తెల్ల కాగితం లాంటిది, మనం ఏం రాస్తే అదే ఉంటుందని పెద్దలు చెప్పే మాట అక్షరాలా నిజం. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో గ్రహించే శక్తి ఎక్కువ. ఏదైనా వెంటనే నేర్చుకోగలరు. పెద్దవాళ్లు ఎలా చేస్తే అలా చేయడం పిల్లలకు అలవాటు. తల్లిదండ్రులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. వాళ్ల జీవితాలను బాల్యం నుంచే మంచి వైపు నడిపించే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. ఈ అడ్వర్టైజ్‌మెంట్ అదే నిరూపిస్తుంది. ఓ పిల్లవాడు తన తండ్రి నుంచి నేర్చుకుంటున్న తీరు మనకు కనిపిస్తుంది. తండ్రి సీట్ బెల్ట్ పెట్టుకోలేదని కొడుకు కూడా పెట్టుకోడు. "పిల్లలు ఏం చూస్తారో అదే చేస్తారు" అన్న సందేశం మనకు అర్థమవుతుంది. మనమూ అంతే. బయటే చాలా విషయాలు చూసి నేర్చుకుంటాం. ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లో అదే కనిపిస్తుంది.

    పిల్లలు తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్లను చూసే నేర్చుకుంటారు. ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లో తండ్రీకొడుకుల మధ్య బంధం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆ బంధం ఇతరులపై ప్రభావం చూపిస్తుంది. ఈ యాడ్‌‌లో అంతర్లీనంగా బోధన, అభ్యాసన విధానం ఉంటుంది. ఒకర్ని చూసి మరొకరు నేర్చుకోవడం కనిపిస్తుంది. చివరకు అది మీపై, సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అర్థమవుతుంది. అంతా ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనిపించే దృశ్యమే. "పిల్లలు ఏం చూస్తారో అదే చేస్తారు" అన్న సందేశమే. ఓ పిల్లవాడు అమాయకంగా మొదలుపెట్టిన చర్య ఒకరి తర్వాత మరొకరిపై వరుసగా ప్రభావం చూపిస్తుంది. ఈ వీడియో చూశాక మీపైనా అలాంటి ప్రభావం ఎంతోకొంత పడుతుంది. రోడ్డు భద్రత కోసం సందేశాన్ని ఇవ్వడమే ఈ యాడ్ లక్ష్యం.

    రోడ్డు భద్రత అనేది ఇతరుల కోసం కాదు తమను భద్రంగా ఉంచేందుకు చెప్పే అంశం అని అందరూ అర్థం చేసుకోవాలి. సమాజంలో మార్పు ఎలా తీసుకురావొచ్చో ఈ వీడియోలో మనకు కనిపిస్తుంది. అందుకోసమే రోడ్డు భద్రతపై సానుకూల, ప్రభావవంతమైన సందేశాన్ని ఇచ్చేందుకు నెట్‌వర్క్18-డియాజియో సంయుక్తంగా 'రోడ్ టు సేఫ్టీ' కార్యక్రమాన్ని చేపట్టింది. https://www.firstpost.com/diageoroadtosafety/ క్లిక్ చేసి భారతీయ రోడ్లను భద్రంగా మారుస్తామని మీరు కూడా ప్రతిజ్ఞ చేయండి.

    Hyundai Venue: స్మార్ట్ ఫీచర్లతో హుందాయ్ వెన్యూ... కారు ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    IRCTC: రైలు టికెట్ కన్ఫామ్ కావాలా? ఈ 3 టిప్స్ ట్రై చేయండి

    Budget Smartphones: బడ్జెట్ ఫోన్ కావాలా? రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే...

    Lock Aadhaar: ఎస్ఎంఎస్‌తో ఆధార్ లాక్ చేయొచ్చు ఇలా
    First published:

    Tags: Road Safety

    తదుపరి వార్తలు