Video: రోడ్డు దాటుతున్న చిన్నారి.. సరిగ్గా అప్పుడే వేగంగా వచ్చిన కారు... ఆ తర్వాత

రోడ్డు దాటుతున్న చిన్నారి (image credit - instagram)

Road Accident: పెద్దవాళ్లైతే... రోడ్డు దాటేటప్పుడు అటూ ఇటూ చూసుకొని దాటుతారు. పిల్లలకు అంత నాలెడ్జి ఉండదు. కంగారుగా దాటేస్తారు. అలా దాటేసిన ఓ చిన్నారికి ఏమైందో వీడియో చూడండి.

  • Share this:
    Road Accident: మీ పిల్లల్ని బయటకు పంపేటప్పుడు... అన్ని జాగ్రత్తలూ చెప్పండి... ముఖ్యంగా రోడ్డు దాటేటప్పుడు అటూ ఇటూ వాహనాలు వస్తున్నాయేమో గమనించాకే... దాటమని మరీ మరీ చెప్పండి. ఎందుకంటే... ప్రాణం పోవడం అనేది క్షణకాలంలో జరిగిపోతుంది. అందుకు ఈ షాకింగ్ వీడియో బెస్ట్ ఎగ్జాంపుల్. ఇందులో ఓ చిన్నారి... ఏమీ ఆలోచించకుండా... తన దారిన తాను వేగంగా రోడ్డు దాటేసేందుకు ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయంలో.. అటుగా ఓ కారు హైస్పీడ్‌లో రాసాగింది. కారు డ్రైవర్ ఏమాత్రం అలర్టుగా లేకపోయినా... ఆ చిన్నారి పై నుంచి కారు వెళ్లిపోయేదే. కానీ డ్రైవర్ చాలా తెలివైన వ్యక్తి... అప్పటికప్పుడు కారును పక్కకు టర్న్ చేసి... చిన్నారి ప్రాణాలు కాపాడాడు.

    ఈ వీడియోలో తప్పంతా చిన్నారిదే. ఆ పిల్లాడు రోడ్డు దాటేటప్పుడు రోడ్డు ఖాళీగానే ఉంది. కాబట్టి ఏ వాహనదారుడైనా ఖాళీగా ఉన్న రోడ్డుపై వేగంగానే వెళ్తారు. కానీ చిన్నారి చూసుకొని రోడ్డు దాటాలి. సడెన్‌గా వచ్చేయడం వల్ల కారు డ్రైవర్ ఇబ్బంది పడ్డాడు. లక్కీగా ఆ చిన్నారికి ఏమీ కాలేదు.

    ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. ఇన్‌స్టాగ్రామ్‌లో జెట్ లైఫ్ అకౌంట్‌లో ఈ వీడియో పోస్ట్ అయ్యింది. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఇందులో కనిపిస్తోంది.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి..



    ఇందులో కారు డ్రైవర్ చాకచక్యతను మెచ్చుకోవాలి. సడెన్‌గా టర్న్ తిప్పి... పిల్లాడు ముందుకు వెళ్లే ఛాన్స్ లేకుండా ఆపేయడం వల్లే చిన్నారికీ ఏమీ కాలేదు. అంతేకాదు... ఆ డ్రైవర్ మళ్లీ యూటర్న్ తీసుకొని... వెనక్కి వచ్చాడు. చిన్నారికి ఏమైనా అయ్యిందేమో అని చెక్ చేశాడు. అంటే... అతను మంచివాడు కాబట్టే మళ్లీ వెనక్కి వచ్చాడని మనం అనుకోవచ్చు. అదే చెడ్డ వ్యక్తి అయితే... నాకెందుకొచ్చిన గొడవ అని వెనక్కి రాకుండా పోతారు.

    ఇది కూడా చదవండి: Zodiac Signs: ఏ రాశుల వారికి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి?

    కంప్యూటర్లలో తప్పు జరిగితే... బ్యాక్ స్పేస్ ఆప్షన్ ద్వారా సరిచేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాలాన్ని అలా వెనక్కి లాగలేం. ఏదైనా అనుకోని ఘటన జరిగితే... ఆ తర్వాత జీవితాంతం బాధ తప్పదు. అలా జరగకుండా అప్రమత్తంగా ఉంటే... ఎంతో మేలు.
    Published by:Krishna Kumar N
    First published: