• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • CHILD LABOURER TO STARTUP ENTREPRENEUR THIS ODISHA YOUTH STORY IS AN INSPIRATION FOR ALL MK GH

Success story: ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తయారు చేసిన బాల కార్మికుడు....

ఇటీవ‌ల ఇత‌ను కోవిడ్ మ‌హ‌మ్మారి చికిత్స‌లో కీల‌క‌పాత్ర పోషిస్తున్న ఆక్సిజ‌న్ కాన్స్‌ట్రేట‌ర్‌ను త‌యారుచేశాడు. మార్కెట్ ధ‌ర‌ల‌తో పోల్చిన‌పుడు ఇదెంతో చ‌వ‌కైన‌ది. ఈ ఆక్సిజ‌న్ మిష‌న్ ఒక కంప్రెసర్‌ను ఉప‌యోగించుకుని గాలిలోని నైట్రోజ‌న్‌ను తొల‌గించి స్వ‌చ్ఛ‌మైన ఆక్సిజ‌న్ వాయువును గొట్టాల ద్వారా విడుద‌ల చేస్తుంది.

ఇటీవ‌ల ఇత‌ను కోవిడ్ మ‌హ‌మ్మారి చికిత్స‌లో కీల‌క‌పాత్ర పోషిస్తున్న ఆక్సిజ‌న్ కాన్స్‌ట్రేట‌ర్‌ను త‌యారుచేశాడు. మార్కెట్ ధ‌ర‌ల‌తో పోల్చిన‌పుడు ఇదెంతో చ‌వ‌కైన‌ది. ఈ ఆక్సిజ‌న్ మిష‌న్ ఒక కంప్రెసర్‌ను ఉప‌యోగించుకుని గాలిలోని నైట్రోజ‌న్‌ను తొల‌గించి స్వ‌చ్ఛ‌మైన ఆక్సిజ‌న్ వాయువును గొట్టాల ద్వారా విడుద‌ల చేస్తుంది.

  • Share this:
ఆస‌క్తి ఉండాలే గానీ అవ‌రోధాలను అవ‌లీల‌గా అధిగమించ‌వ‌చ్చ‌ని నిరూపిస్తున్నాడు ఒడిశా యువ‌కుడు. ఒకప్పుడు బాల‌కార్మికుడిగా ఇటుక‌బ‌ట్టీల్లో మ‌గ్గిపోయిన ల‌క్ష్మ‌ణ్ అనే యువకుడు.. ఇప్పుడు స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌తో స‌మాజానికి మేలుచేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాడు. ఈ యువ‌కుడి విజ‌య‌గాథ అంద‌రికీ స్ఫూర్తి దాయ‌కం. ల‌క్ష్మ‌ణ్‌ది ఓ నిరుపేద‌ కుటుంబం. అత‌డి కుటుంబం 21 ఏళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్‌కు వలస వెళ్లింది. లక్షణ్ త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఓ ఇటుక‌బ‌ట్టీలో ప‌నిచేస్తుండేవాడు. ఇది గ‌మ‌నించిన ఓ స్వ‌చ్ఛంద సంస్థ ల‌క్ష్మ‌ణ్‌ని ర‌క్షించి ఒడిశాలోని నువాపా జిల్లాలోని ప్రభుత్వ వ‌స‌తి గృహంలో పునరావాసం కల్పించింది. దీంతో అతడు చ‌దువుకోవ‌డానికి ఒక ఆస‌రా దొరికింది.

ఆ తరువాత రాణి ముండా హైస్కూల్లో చేరి మంచి మార్కులు సాధించాడు లక్షణ్. అనంతరం ఖ‌రియార్ ప్ర‌భుత్వ క‌ళాశాల‌లో చేరి బిఎస్సీ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు. ప్రస్తుతం అతడు ప‌దిమందికి ఉప‌యోగ‌ప‌డే ఆవిష్క‌ర‌ణ‌ల‌కు పురుడుపోస్తున్నాడు. ఇటీవ‌ల ఇత‌ను కోవిడ్ మ‌హ‌మ్మారి చికిత్స‌లో కీల‌క‌పాత్ర పోషిస్తున్న ఆక్సిజ‌న్ కాన్స్‌ట్రేట‌ర్‌ను త‌యారుచేశాడు. మార్కెట్ ధ‌ర‌ల‌తో పోల్చిన‌పుడు ఇదెంతో చ‌వ‌కైన‌ది. ఈ ఆక్సిజ‌న్ మిష‌న్ ఒక కంప్రెసర్‌ను ఉప‌యోగించుకుని గాలిలోని నైట్రోజ‌న్‌ను తొల‌గించి స్వ‌చ్ఛ‌మైన ఆక్సిజ‌న్ వాయువును గొట్టాల ద్వారా విడుద‌ల చేస్తుంది.

ఆక్సిజ‌న్ గొట్టాల ద్వారా సాఫీగా సాగ‌డానికి ఒక రెగ్యులేట‌ర్‌ను కూడా ఏర్పాటు చేశాడు. దీనిని ఉప‌యోగించ‌డానికి పెద్ద‌గా క‌రెంట్ ఖ‌ర్చు అవ‌దు. అలాగే మార్కెట్ ధ‌ర‌ల‌లో మూడో వంతు ధ‌ర‌ల‌కే ఇది ల‌భిస్తుంద‌ని చెప్తాడు ల‌క్ష్మ‌ణ్‌. లోక్‌దృష్టి కాలేజ్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో బిఎస్సి ఫైనల్ ఇయర్ విద్యార్థి అయిన లక్ష్మణ్, ప్రయోగశాలలోనే ఎక్కువ సమయం గ‌డుపుతుంటాడు.

కింద‌టేడాది క‌రెన్సీ నోట్లు తాకినా క‌రోనా వ‌స్తుంద‌ని జ‌నం భయ‌ప‌డుత‌న్న వేళ అతను కరెన్సీ నోట్లను శుభ్రపరిచే పరికరాన్ని అభివృద్ధి చేశాడు. ఈ పరికరాన్ని రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లు, పెట్రోల్ స్టేషన్లు, బస్ స్టాండ్లు , షాపింగ్ మాల్స్ వద్ద తేలిక‌గా నోట్ల‌ను శుభ్రం చేయ‌డానికి స‌హాయ‌ప‌డేలా తీర్చిదిద్దాడు. దీనికి ముందు అత‌ను పురుషుల‌ అస‌భ్య‌ప్ర‌వ‌ర్త‌న‌ల నుంచి మహిళలను రక్షించడానికి వైర్‌లెస్ రిమోట్ కంట్రోల్‌కు అనుసంధాన‌మైన బెల్ట్ లాంటి ర‌క్ష‌ణ ప‌రిక‌రాన్ని రూపొందించాడు. ఈ బెల్ట్ ధ‌రించిన మ‌హిళ‌ల‌ను ఎవ‌రైనా అనుచితంగా తాకడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప‌రిక‌రం ద్వారా షాక్ కొడుతుంది.

ఇలాఎన్నో విన్నూత్న ప్ర‌యోగాల‌తో దూసుకుపోతున్న ల‌క్ష్మ‌ణ్ ప్ర‌స్తుతం నిధి-ఇఐఆర్ ఫెలోషిప్‌తో నీటితో నడపగల ‘ఇంటెలిజెంట్ బైక్’ ని త‌యారుచేసే ప‌నిలో ఉన్నాడు. “కెఐఐటి టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ ప్రోగ్రాం కింద నిధి ఎంటర్‌ప్రెన్యూర్-ఇన్-రెసిడెన్స్ ఫెలోషిప్ పొందిన ల‌క్ష్మ‌ణ్ నీటితో న‌డిచే మోటారుసైకిల్‌ను అభివృద్ధి చేస్తున్నాడు. ఇది డైనమో, స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్‌ ద్వారా పనిచేస్తుంది. బైక్ రన్‌కు సహాయపడే DC కరెంట్‌ను AC గా మారుస్తుంది” అని లక్ష్మణ్ తెలిపాడు. అతడు ఖరియార్‌లో ‘డుండి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ను కూడా ఏర్పాటు చేశాడు. ఇది ఒడిశా స్టార్టప్ పాలసీ కింద స్టార్టప్‌గా గుర్తింపు పొందింది. ఎన్నో ఆవిష్క‌ర‌ణ‌ల‌తో సాగిపోతున్న ల‌క్ష్మ‌ణ్ నేటి యువ‌త‌కు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
Published by:Krishna Adithya
First published: