హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

పాక్‌లో ఎయిర్‌ఫోర్స్ బాంబులేస్తున్న వేళ.. భారత్‌లో కళ్లు తెరిచిన బిడ్డ.. పేరు...

పాక్‌లో ఎయిర్‌ఫోర్స్ బాంబులేస్తున్న వేళ.. భారత్‌లో కళ్లు తెరిచిన బిడ్డ.. పేరు...

భారత్ అత్యంత హై జోష్‌లో ఉన్న సమయంలో పుట్టిన ఆ బిడ్డకు కూడా ఓ ప్రత్యేకమైన పేరు పెట్టాలని ఆ బిడ్డ తల్లిదండ్రులు అనుకున్నారు.

  ఫిబ్రవరి 26 తెల్లవారుజామును 3.50 నిమిషాలు భారత వాయుసేన పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంప్ మీద బాంబులు వేస్తోంది. అదే సమయంలో భారత్‌లోని రాజస్థాన్‌లో ఓ తల్లి బిడ్డకు జన్మనిచ్చింది. భారత్ అత్యంత హై జోష్‌లో ఉన్న సమయంలో పుట్టిన ఆ బిడ్డకు కూడా ఓ ప్రత్యేకమైన పేరు పెట్టాలని ఆ బిడ్డ తల్లిదండ్రులు అనుకున్నారు. అందుకు వారు ఎంచుకున్న పేరు ‘మిరాజ్ సింగ్ రాథోడ్’. పాకిస్థాన్ మీద 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు దాడి చేశాయి. మిరాజ్ యుద్ధ విమానాలు సాధించిన ఘనతకు నిదర్శనంగా తమ పిల్లాడి పేరు నిలిచిపోవాలని ఆకాంక్షించిన ఆ తల్లిదండ్రులు ఆ పసిబిడ్డకు మిరాజ్ సింగ్ రాథోడ్ అని పేరు పెట్టాలని నిర్ణయించారు.

  Viral news, Trending News, Mirage 2000, Pulwama attack, India Strikes, Child Mirage Singh, Child Named Mirage Singh, వైరల్ న్యూస్, మిరాజ్ సింగ్, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు, సర్జికల్ స్ట్రైక్, ట్రెండింగ్ న్యూస్, రాజస్థాన్‌లో బాలుడి పేరు మిరాజ్ సింగ్
  ప్రతీకాత్మక చిత్రం

  రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మహావీర్ సింగ్, సోనమ్ సింగ్ అనే భార్యాభర్తలు తమ పిల్లాడికి ఈ పేరు పెట్టారు. ఆ కుటుంబం కూడా ఆర్మీలో సేవలు అందించింది. మహావీర్ సింగ్ కుటుంబానికి చెందిన భూపేంద్ర సింగ్ అనే వ్యక్తి ఎయిర్‌ఫోర్స్‌లో సేవలు అందిస్తున్నాడు. నేషనల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు.

  Viral news, Trending News, Mirage 2000, Pulwama attack, India Strikes, Child Mirage Singh, Child Named Mirage Singh, వైరల్ న్యూస్, మిరాజ్ సింగ్, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు, సర్జికల్ స్ట్రైక్, ట్రెండింగ్ న్యూస్, రాజస్థాన్‌లో బాలుడి పేరు మిరాజ్ సింగ్
  మిరాజ్ 2000 యుద్ధ విమానం (File)

  పాకిస్థాన్ మీద భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్‌ను ప్రజలు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ఢిల్లీలో ఓ ఆటోవాలా.. 26వ తేదీన మొత్తం ఫ్రీ సర్వీసు అందించాడు. కొందరు వ్యాపారులు తమ ఉత్పత్తుల మీద డిస్కౌంట్లు ప్రకటించారు. మరికొందరు స్వీట్ స్టాల్స్ ఓనర్లు ఏకంగా ఫ్రీగా పంచిపెట్టారు.

  First published:

  Tags: Indian Air Force, Pulwama Terror Attack, Rajasthan, Surgical Strike 2, VIRAL NEWS

  ఉత్తమ కథలు