Home /News /trending /

CHICKEN PAKORA TRAGEDY HUSBAND BRUTALLY ATTACKS ON WIFE AND COMMITS SUICIDE IN KARNATAKA PAH

ప్రేమతో చికెన్ పకోడి వండిన భార్య.. అది తిని ఎవరు లేని ప్రదేశానికి వెళ్లిన భర్త.. ట్విస్ట్ ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karnataka: తన భార్యకు చికెన్ పకోడి తినాలని ఉందని చెప్పాడు. భర్త అడిగాడని ఆమె ఎంతో ప్రేమగా వండిపెట్టింది. కానీ అది తిన్నాక.. భర్త చేసిన పనికి ఆమె షాకింగ్ కు గురైంది.

కొంత మంది పెళ్లయ్యాక.. వింతగా ప్రవర్తిస్తుంటారు. పెళ్లాం కూరవండలేదని, పప్పులో ఉప్పు ఎక్కువైందని వింత కారణాలతో గొడవలు పెట్టుకుంటారు. మరికొందరు.. టీ వేడిగా లేదని, కూర రుచిగా లేదని కూడా వాగ్వాదానికి దిగుతుంటారు. కొన్నిసార్లు ఇది హద్దులు దాటి , హత్యలు, ఆత్మహత్యల వంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. బెంగళూరు లో (Bengaluru)  దారుణమైన ఉదంతం జరిగింది. బన్నేరు ఘట్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. సురేష్ (48), శాలిని(42) భార్య భర్తలు. ఇతగాడు.. బొమ్మన హళ్లిలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అయితే.. అతను పనిమీద అలిసి పోయి ఇంటికి వచ్చాడు. వస్తునే...తనకు చికెన్ కబాబ్ తినాలని ఉందని, వండాలని భార్యను కోరాడు. భర్త అడిగాడని ఆమె ప్రేమతో వండిపెట్టింది. అతను దాన్నితిన్నాడు.అయితే.. తిన్నాక టెస్ట్ అసలు బాగ లేదని భార్యతో వాగ్వాదానికి (Harassment) దిగాడు. అంతటితో ఆగకుండా పదునైన కత్తితీసుకుని ఇష్టమోచ్చినట్లు పొడిచాడు. దీంతో ఆమె గట్టిగా అరుపులు పెట్టింది. అప్పుడు.. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే అతను పారిపోయాడు. ఆమెను ఆస్పత్రిలో తరలించారు. చికిత్స అందిస్తున్నారు. ఆమె స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు.

భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతను ఊరి శివారులో అడవిలో దాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి చూశారు. కానీ అప్పటికే అతను భయంతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు (Sucide) పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఒక మహిళ సభ్యసమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించింది.

బీహర్ లో (Bihar)  దారుణమైన ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న నవ్ గాచియాలోని గోపాల్ పూర్ పరిధిలో దారుణమైన ఉదంతం జరిగింది. జూలై 26 న జరిగిన ఈ అమానవీయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పప్పు గుప్తా, ప్రీతి గుప్తా భార్యభర్తలు. అయితే.. వీరితో పాటు.. భర్త సోదరుడు కూడా ఒకే ఇంట్లో ఉండేవారు. ఈ క్రమంలో ప్రీతి గుప్తా, మరిదితో వివాహేతర సంబంధం (Affair)  పెట్టుకుంది. భర్త ఉద్యోగం మీద వెళ్లగానే ఇద్దరు కలసి గడిపేవారు. అయితే.. తమ గుట్టు ఎక్కడ భర్తకు తెలిసిపోతుందో అనుకుంటూ భయపడేవారు. భర్త అడ్డుతొలగించుకుంటూ.. యథేచ్ఛగా తిరగోచ్చని భావించారు.

అందుకు భార్య ప్రీతి గుప్తా మాస్టర్ ప్లాన్ వేసింది. భర్తను చంపాల్సిందిగా ఒక లక్షరూపాయలను సుపారీగా ఇచ్చింది. దీని కోసం అడ్వాన్స్ గా 20 వేలను కూడా ఇచ్చింది. అయితే.. భర్త ఉద్యోగం నుంచి ఇంటికి వస్తుండగా కొంత మంది అటకాయించి , పిస్టల్ తో కాల్చి, కత్తులతో పొడిచి చంపారు. అయితే.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు
Published by:Paresh Inamdar
First published:

Tags: Bengaluru, Crime news, Husban commits suicide, Karnataka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు