• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • CHICKEN CHASES DOG VIDEO GOES VIRAL ON SOCIAL MEDIA WATCH THAT FUNNY VIDEO HERE WITH FULL VOLUME NK

Chicken Chases Dog Video: కోడా మజాకా... కుక్కకు చుక్కలు చూపించిందిగా..

Chicken Chases Dog Video: కోడా మజాకా... కుక్కకు చుక్కలు చూపించిందిగా..

Chicken Chases Dog Video: కోడా మజాకా... కుక్కకు చుక్కలు చూపించిందిగా.. (image credit - twitter)

Chicken Chases Dog Video: కుక్కను చూడగానే చచ్చాన్రో దేవుడో అనుకుంటాయి కోళ్లు. ఇక్కడ రివర్స్. కోడి తనను వదిలేస్తే బాగుండని తెగ ఆయాసపడిపోయింది కుక్క. వీడియో చూడండి.

  • Share this:
    Chicken Chases Dog Video: కొన్ని కార్టూన్లు మనకు బాగా నచ్చుతాయి. టామ్ అండ్ జెర్రీలో... ఎలుక వెనక పిల్లి పరుగెత్తడం... ప్రతిసారీ ఎలుకే గెలుస్తుండటం మనకు నచ్చుతుంది. రియల్ లైఫ్‌లో అలా జరగదు. కోడిని కుక్క చూసిందంటే ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు లాగిద్దామా అని చూస్తూ ఉంటుంది. అలాంటిది... ఇక్కడ కోడే కుక్కను తరిమింది. బాగా కొవ్వు పట్టి ఉన్న ఆ కోడి... లావుగా ఉన్న ఆ కుక్కను తరమడం ఓ జోక్. ఈ ఛేజింగ్‌లో రెండూ అలసిపోతున్నాయి. ఫాస్ట్‌గా పరుగెత్తడం వాటి వల్ల కావట్లేదు. ఐతే... ఎట్టి పరిస్థితుల్లో కోడికి దొరకకూడదని అని కుక్క ఫిక్స్ అవ్వగా... ఎలాగైనా కుక్కను పట్టుకోవాలి అని కోడి ఫిక్సైంది. ఇక వాటి పరుగు పందెం దాడుగు మూతల ఆటలా తయారైంది. అందుకే ఈ వీడియో వైరల్ అయ్యింది.

    సాధారణంగా వైరల్ వీడియోలు కొన్ని సెకండ్లే ఉంటాయి. ఇది ఏకంగా నిమిషం ఉంది. చూసేకొద్దీ ఫన్ జనరేట్ అవుతూనే ఉంది. ఇప్పటికే ఈ వీడియోని 44 లక్షల మంది చూశారు. ఆ లిస్టులో మనమూ ఉంటాం. వీడియోని ఇక్కడ చూడండి.


    ట్విట్టర్ యూజర్ స్ట్రిక్ట్‌లీ క్రిస్టో ట్వీట్ చేసిన ఈ వీడియోని గమనిస్తే... ఓ పార్కులో ఆ కోడి, కుక్క సరదాగా ఛేజ్ చేసుకుంటున్న విషయం మనకు అర్థం అవుతుంది. నిజమే... అవి రెండూ ఫ్రెండ్స్. కాకపోతే... మరీ ఇంత సరదాగా ఎప్పుడూ లేవు. అందుకే ఈ సరదా ఛేజింగ్ వైరల్ అయ్యింది.

    ఛేజింగ్ గేముల్లో ఇదే బెస్ట్ అని స్ట్రిక్ట్‌లీ ఈ వీడియోకి కాప్షన్ ఇవ్వగా... ఇది చాలా బాగుంది అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. లైక్స్, షేర్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఆస్కార్‌లో షార్ట్ ఫిల్మ్ కేటగిరీకి గెలవకపోతే... ఆస్కార్ తప్పే అని ఓ యూజర్ కామెంట్ రాయగా... ఇది రియల్ లైఫ్ కార్టూన్‌లా ఉందని మరొకరు రాశారు. చక్కగా ఆనందం కలిగించే వీడియో అని మరో యూజర్ తెలపగా... ఇలాంటిదే మరో వీడియోని నెటిజన్లు చూపిస్తున్నారు. ఇందులో ఓ గోరింక రకరకాలుగా మాట్లాడుతూ ఆశ్చర్యపరుస్తోంది.



    ఇది కూడా చదవండి: Lemon Mint Drink: నిమ్మ-పుదీనా డ్రింక్... ఎండలకు బ్రేక్... సమ్మర్‌లో పర్ఫెక్ట్ రిలీఫ్

    ప్రస్తుతం ఈ క్లిప్‌ని టిక్‌టాక్‌లో 22 లక్షల మందికి పైగా చూశారు. ఇలా నెటిజన్లు మంచి వీడియోలను వైరల్ చేస్తూ... అందరికీ ఆనందం కలిగిస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు