Biryani Day: 10 పైసలకే చికెన్ బిర్యానీ.. ఈ బంఫర్ ఆఫర్ ఎక్కడో తెలుసా?

ఇంత భారీ ఎత్తున స్పందన వస్తుందని తాము అస్సలు ఊహించలేదని.. చాలా మందికి బిర్యానీ లభించలేదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది పెద్ద ఎత్తున బిర్యానీని సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: October 11, 2020, 10:13 PM IST
Biryani Day: 10 పైసలకే చికెన్ బిర్యానీ.. ఈ బంఫర్ ఆఫర్ ఎక్కడో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చికెన్ బిర్యానీ.. ఈ పేరు చెబితేనే భోజన ప్రియుల నోరూరుతుంది. ఎంతో రుచికరంగా.. ఘుమఘుమలాడే బిర్యానీ కావాలంటే కనీసం రూ.100 పెట్టాలి. మరి అదే బిర్యానీ 10 పైసలకే దొరికితే.. ఇంకేమైనా ఉందా..? అద్భుతమైన ఆఫర్‌ను ఎవరు వదులుకుంటారు.. గంటల తరబడి క్యూలో నిలబడైనా.. సొంతం చేసుకుంటారు. తమిళనాడులోని తిరుచ్చిలో ఇలాంటి ఘటనే జరిగింది. ప్రపంచ బిర్యానీ దినోత్సవం (అక్టోబరు 11) సందర్భంగా తిరుచ్చిలోని K.M.S. Hakkim Biryani రెస్టారెంట్ 10 పైసలకే బిర్యానీ ఆఫర్ ప్రకటించింది. కోవిడ్ ఫ్రంట్ లైన్ వాలంటీర్లకు రూ.1కే ఇస్తామని అనౌన్స్ చేశారు. ఆ ఆఫర్ గురించి తెలిసిన వెంటనే నగర ప్రజలు పెద్ద ఎత్తున క్యూకట్టారు. కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేసి గుంపులు గుంపులుగా పోగయ్యారు.

నగరంలో తొలిసారిగా బిర్యానీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అందుకే.. 10 పైసలకే బిర్యానీ అందిస్తున్నామని కే.ఎం.ఎస్ హకీం హోటల్ నిర్వాహకుడు మైదీన్ తెలిపారు. తిల్లయ్ నగర్ బ్రాంచ్ వద్ద 1500 మంది క్యూకట్టారని.. వారిలో మొదట వచ్చిన 100 మందికి మాత్రమే పది పైసలకు బిర్యానీ అందించినట్లు వెల్లడించారు. ఇక పాలక్కరై బ్రాంచి వద్ద కోవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఒక్క రూపాయికే బిర్యానీ ఇచ్చినట్లు తెలిపారు. ఐతే దీనికి ఇంత భారీ ఎత్తున స్పందన వస్తుందని తాము అస్సలు ఊహించలేదని.. చాలా మందికి బిర్యానీ లభించలేదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది పెద్ద ఎత్తున బిర్యానీని సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు.

కరోనా సమయంలో ఇలాంటి ఆఫర్లు పెట్టి.. జనాలు పోగయ్యేలా చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోకపోవడాన్ని చాలా మంది తప్పుబట్టడుతున్నారు. ఐతే రెండు రోజుల ముందు నుంచే బిర్యానీ దినోత్సవం గురించి హోటల్ నిర్వాహకులు ప్రచారం చేశారని.. రద్దీని నియంత్రించేందుకు నగర పాలక సంస్థ అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు అభిప్రాయపడ్డారు. రద్దీని నియంత్రించలేనప్పుడు ఆ కార్యక్రమానికి అసలు ఎందుకు అనుమతి ఇచ్చారని మండిపడుతున్నారు. ఏదేమైనా 10 పైసలకే బిర్యానీ లభించిన వారు మాత్రం.. లొట్టలేసుకుంటూ లాగించారు. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదని ఉత్సాహంగా ఆరగించారు.
Published by: Shiva Kumar Addula
First published: October 11, 2020, 9:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading