సోషల్ మీడియాలో రోజుకు చాలా వీడియోలు పోస్ట్ చేయబడతాయి. కానీ అందులో కొన్ని మాత్రమే వైరల్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలను, ఫన్నీ వీడియోల(Funny Videos)ను.. చూసేందుకు జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే అలాంటి వీడియోలకు కొద్ది సమయంలో వేలాది వ్యూస్ వస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో.. సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. ఆత్మ విశ్వాసంతో ముందడగు వేసిన బాలుడు.. ఆ తర్వాత అవతల కోడి రియాక్షన్ చూసి భయపడిపోయాడు. తర్వాత అక్కడ నుంచి పారిపోయే క్రమంలోనే చిన్న చెట్టు మధ్య ఇరుక్కుని కింద పడిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
hepgul5 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో(Instagram Account) పోస్ట్ చేయబడిన వీడియోలో.. ఓ బాలుడు ఇంటి తలుపు వద్ద ఉన్న కోడిని.. అతని చేతిలో ఉన్న కర్ర సాయంతో వేధించడం కనిపించింది. కోడిని కొట్టేందుకు యత్నించాడు. కానీ తర్వాతి క్షణంలో ఏం జరుగుతుందో అతను ఊహించలేకపోయాడు. అయితే కొద్దిసేపు ఓపికగా ఉన్న కోడి.. ఒక్కసారిగా బాలుడిపైకి దూసుకొచ్చింది. దీంతో భయపడిపోయిన బాలుడు అక్కడి నుంచి పారిపోవాలని చూశాడు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న ఓ చిన్న చెట్టు అడ్డం తగలడంతో.. అక్కడి నుంచి కిందవైపునకు పడిపోయాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ వీడియో (Video) చూసిన చాలా మంది నెటిజన్లు.. ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చాలా నవ్వు తెప్పించే విధంగా ఉందని అంటున్నారు. కొందరు మాత్రం బాలుడికి కోడి తగిన గుణపాఠం చెప్పిందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 1.3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 6,500 లైక్స్ కూడా వచ్చాయి. అందుకే తమ కంటే చిన్నజీవులను తక్కువగా అంచనా వేయడం సరైనది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలా చేస్తే ఇలాంటి ఘటన ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు పెళ్లి(Marriage) వేడుకల్లో చోటుచేసుకునే పలు ఘటనలు ఇటీవలి కాలంలో వైరల్‌గా మారుతన్న సంగతి తెలిసిందే. పెళ్లిలో జరిగే అలర్లు, డ్యాన్స్‌లు, వింత పనులు.. ఇలాంటి వీడియోలకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. ఇటీవల ఓ పెళ్లి కూతురు బుల్లెట్ బండి పాటకు(Bullet Bandi Song) చేసిన డ్యాన్స్.. తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. పెళ్లి బారాత్‌లో వరుడి ముందు సాయి శ్రీయ(Sai Shriya) అనే వధువు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. సింగర్ మోహన భోగరాజు పాడిన బుల్లెట్ బండి సాంగ్‌లోని పదాలకు తగ్గట్టుగా.. ఆమె వేసిన స్టెప్పులు అద్భుతంగా ఉన్నాయి. వరుడిని తన జీవితంలోకి ఆహ్వానిస్తూ సాయి శ్రీయ చేసిన డ్యాన్స్.. ఆమెను ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీగా మార్చేసింది. కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా, మెయిన్ మీడియాలో కూడా ఆమె గురించి కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమెకు ఒకటి రెండు ఆఫర్లు కూడా వస్తున్నాయి.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.