CHHATTISGARH SCHOOL PRINCIPAL HAS EXTRAMARITAL AFFAIR WITH TEACHER SUSPENDED AFTER VIDEO SURFACES PVN
Viral : స్కూల్ రూమ్ లోనే రోజూ ప్రిన్సిపాల్ రాసలీలు..వీడియో వైరల్..చివరికి
ప్రతీకాత్మక చిత్రం
School principal affair : విద్యాలయం దేవాలయంతో సమానం. మన దేశంలో బడిని గుడితో పోల్చుతారు. అలాంటి పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేశారు. విద్యార్థులకు విద్యా బుద్దులు చెబుతూ.. ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేయాల్సిన ప్రధానోపాధ్యాయుడే దారితప్పడాడు.
School principal affair : విద్యాలయం దేవాలయంతో సమానం. మన దేశంలో బడిని గుడితో పోల్చుతారు. అలాంటి పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేశారు. విద్యార్థులకు విద్యా బుద్దులు చెబుతూ.. ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేయాల్సిన ప్రధానోపాధ్యాయుడే దారితప్పడాడు. తమ స్కూల్లో పనిచేసే తోటి ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం(Extramarital Affair)పెట్టుకున్నాడు. ఇది ఆయన వ్యక్తిగత విషయం కావచ్చు. కానీ వీరిద్దరు తరచూ స్కూల్ లోని ఓ గదిలోనే కలిసేవారు. అక్కడ రాసలీలలు జరుపుతూ గ్రామస్తులకు అడ్డంగా దొరికారు. అనంతరం ప్రిన్సిపాల్ రాసలీలలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రంలోని కంకేర్ జిల్లాలోని ఇంద్రప్రస్థ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాజేష్ పాల్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే స్కూల్ లో పనిచేసే ఓ టీచర్ తో రాజేష్ పాల్ కి వివాహేతర సంబంధం ఉంది. కొన్నాళ్లుగా వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే వీరు తమ కోరికలను తీర్చుకునేందుకు ఏకంగా స్కూల్ లోని స్టోర్ రూమ్ నే అడ్డగా మార్చుకున్నారు. రోజూ ఆ స్టోర్ రూమ్ లో రహస్యంగా మహిళా టీచర్ తో లైంగిక కోరికలు తీర్చుకోవడంతో పాటు, వ్యక్తిగత ఆనందాన్ని పొందేవాడు ప్రిన్సిపాల్(School Principal)రాజేష్.
అయితే పాఠశాలలో ఏదో అక్రమం జరుగుతుందని పసిగట్టిన కొందరు గ్రామస్తులు.. స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రిన్సిపాల్, మహిళా టీచర్ మధ్య లైంగిక సంబంధాన్ని బట్టబయలు చేశారు. వారి రాసలీలలనువీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరోవైపు, ఓ ఆడియో క్లిప్ కూడా వైరల్ అయింది. అందులో ప్రిన్సిపాల్.. గుర్తు తెలియని ఓ వ్యక్తితో వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో లీక్ చేయకుండా ఉండాలని కోరాడు. అతనికి డబ్బులు కూడా ఇస్తానని చెప్పాడు. ఈ విధంగా ప్రిన్సిపాల్ అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటనపై గ్రామస్తులు జిల్లా కలెక్టర్ చందన్ కుమార్‌కు ఫిర్యాదు చేయడంతో ప్రాథమిక విచారణ చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులు లైంగిక దుష్ప్రవర్తను పాల్పడిన ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్ పై ఫిర్యాదు అందిందని.. విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ గురువారం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారని జిల్లా విద్యాశాఖాధికారి టీఆర్ సాహు తెలిపారు. వీరిని చూసి విద్యార్థులు కూడా చెడిపోతారని.. ఇలాంటి వారిని విద్యాశాఖలో లేకుండా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయడం కాదు.. ఏ స్కూల్లో పనిచేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.