హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral video: అమాయకుడిపై మహిళల అఘాయిత్యం.. ఎయిర్ పోర్టులో గుడ్డలూడ దీసి చితక్కొట్టారు..

Viral video: అమాయకుడిపై మహిళల అఘాయిత్యం.. ఎయిర్ పోర్టులో గుడ్డలూడ దీసి చితక్కొట్టారు..

ఆటో ఢ్రైవర్ పై దాడిచేస్తున్న మహిళలు

ఆటో ఢ్రైవర్ పై దాడిచేస్తున్న మహిళలు

Chhattisgarh: వ్యక్తి తనకు రావాల్సిన డబ్బుల కోసం ఎయిర్ పోర్టులోని ట్రావెల్ ఏజెన్సీకి వచ్చాడు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు బాధితుడి పట్ల దురుసుగా ప్రవర్తించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Chhattisgarh, India

కొంత మంది తమదగ్గర పనిచేయించుకుంటారు. డబ్బులు అడగ్గానే అప్పుడు, ఇప్పుడంటూ ఉద్యోగులను వేధిస్తుంటారు. సమయానికి డబ్బులు కూడా ఇవ్వరు. తీరా డబ్బులు ఇవ్వాల్సిందే అని గట్టిగా నిలదీస్తే.. బాధితులను బెదిరించడం, ఎవరితోనైన దాడిచేయించడం వంటివి చేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఛత్తీస్ గఢ్ లోని (Chhattisgarh) రాయ్ పూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దినేష్ అనే వ్యక్తి ఆట్రోడ్రైవగా పనిచేస్తుంటాడు. ఇతను.. గతంలో రాహుల్ ట్రావెల్స్ కంపెనీలో ఆటో నడిపించాడు. అప్పుడు ఇతగాడికి సరిగ్గా జీతం డబ్బులు ఇవ్వలేదు. ఎన్నిసార్లు.. అడిగినా దాటవేస్తు వచ్చాడు. అయితే.. తన డబ్బులు ఇవ్వాలని బాధితుడు రాయ్ పూర్ ఎయిర్ పోర్టులో ఉన్న ట్రావెల్ కంపెనీకి వెళ్లాడు.

అక్కడ ఉద్యోగులకు మేనేజర్ నంబర్ గురించి అడిగాడు. దీంతో వారితో ఇతనికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మహిళలు మూకుమ్మడిగా దినేష్ పై దాడిచేశారు. అతనిపై పిడిగుద్దులు కురిపిస్తూ చితక్కొట్టారు. దీంతో అతని షర్ట్ కూడా చిరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral video)  మారింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh)  అమానవీయకర సంఘటన చోటు చేసుకుంది.

బరేలీలోని ఇజ్జత్ నగర్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానికంగా ఉన్న ప్రేమ్ నగర్ లో ఒక కూరగాయాలు వ్యాపారి తోపుడు బండ్ల మీద కూరగాయలను అందరి ఇంటి దగ్గరకు వెళ్లి అమ్ముతుంటాడు. ఈ క్రమంలో అతగాడు.. రోడ్డుమీద.. ఎవరు చూడటం లేదనుకుని.. కూరగాయల మీద ఉమ్మాడు. అంతే కాకుండా దానిపై మూత్ర విసర్జన కూడా చేశాడు.

ఇదంతా అక్కడ కారులో ఉన్న దుర్గేష్ గుప్త అనే వ్యక్తి రికార్డు చేశాడు. దీంతో అతగాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే కొంత మంది స్థానికులు అతడిని పొట్టుపొట్టు కొట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు షరీఫ్ ఖాన్ ను అరెస్టు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా (viral video) మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Chhattisgarh, Viral Video

ఉత్తమ కథలు