Home /News /trending /

CHHATTISGARH FEMALE TEACHER REACHES SCHOOL DRUNK SLEEPS ON CLASSROOM FLOOR PAH

పూటుగా మద్యం తాగి స్కూల్ కి వచ్చిన లేడీ టీచర్.. క్లాస్ లో అందరి ముందే ఏంచేసిందంటే..

క్లాస్ లో పడుకున్న టీచర్

క్లాస్ లో పడుకున్న టీచర్

Chhattisgarh: మహిళా టీచర్ ఫుల్లుగా తాగి స్కూల్ కు వచ్చింది. అంతటి ఆగకుండా ఆమె.. తూలుతూ.. కింద పడుతు లేస్తు పాఠశాలలో నానా రచ్చ చేసింది.

విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ దారితప్పింది. ఇప్పటి వరకు మనం.. ఉపాధ్యాయులు తాగి పాఠశాలకు రావడం మనకు తెలిసిందే. తాగి పాఠశాలకు వచ్చి, విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, క్లాస్ లో రచ్చ చేయడం, ఇతర ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగడం వంటివి వార్తలలో నిలిచాయి. ఏకంగా ఒక లేడీటీచర్ తాగి క్లాస్ కు రావడం తీవ్ర కలకలంగా మారింది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎన్నో ఆశలతో, పాఠశాలకు పంపిస్తుంటారు.

స్కూల్ లోని టీచర్లు.. తమ పిల్లలకు మంచి చదువు, క్రమశిక్షణ నేర్పిస్తారని భావిస్తుంటారు. కానీ కొందరు ఉపాధ్యాయులు పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చ తీసుకొచ్చే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పటికే అనేక చోట్ల టీచర్ లు, స్టూడెంట్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగికంగా వేధించడం వంటి ఘటనలు వార్తలలో నిలిచాయి. కొన్ని సార్లు.. ఉపాధ్యాయులు తాగి కూడా పాఠశాలకు వచ్చిన సంఘటనలు కూడా వైరల్ గా (viral news) మారాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.



పూర్తి వివరాలు.. ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh)  జష్‌పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. జష్ పూర్ జిల్లాలోని సిటీకి దూరంగా ఉన్న టికైత్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఉదంతం జరిగింది. ఒక లేడీ టీచర్ మద్యం సేవించి (Drunk female Teacher) పాఠశాలకు వచ్చింది. ఆ తర్వాత.. ఆమె మత్తులో నడవ లేక పోయింది. అటు ఇటు తూలుతూ.. క్లాస్ లోనే అందరి ముందే కుర్చీలో నిద్రపోయింది. ఆమెను గమనించిన విద్యార్థులు, టీచర్ ను ఆటపట్టించారు. ప్రైమరీ క్లాస్ లకు బోధించే జగపతి భగత్ అనే టీచర్ తాగి పాఠశాలకు వచ్చింది.

ఆ తర్వాత.. మద్యం మత్తులో కిందపడి పడుకుంది. (sleeps on classroom floor) అప్పుడు.. పాఠశాలను తనిఖీ చేయడానికి విద్యాశాఖ అధికారులు అక్కడికి వచ్చారు. క్లాస్ లో టీచర్ పడుకుని ఉండటంపై ఆరా తీశారు. తొలుత ఆరోగ్యం బాగాలేదని చెప్పాడానికి ప్రయత్నించారు. కానీ విద్యార్థులను గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో అనేక మంది ఉపాధ్యాయులు మద్యం తాగి వచ్చి.. సస్పెండ్ కు గురైన విషయం తెలిసిందే.
Published by:Paresh Inamdar
First published:

Tags: Chhattisgarh, Drinking wine, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు