Home /News /trending /

CHENNAIS 70 YEAR OLD SELLS IDLIS FOR RS 1 5 A PIECE SAYS DOING FOR SATISFACTION GH VB

Trending News: ఈ రోజుల్లో కూడా రూపాయిన్నరకే అరచేయంత ఇడ్లీ.. ఈ బామ్మ ఎవరు, ఎందుకిలా చేస్తోందో తెలుసుకోండి..

తక్కువ ధరకు ఇడ్లీలను విక్రయిస్తున్న వృద్ధురాలు

తక్కువ ధరకు ఇడ్లీలను విక్రయిస్తున్న వృద్ధురాలు

ఈ రోజుల్లో అన్ని ఆహార పదార్థాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ముఖ్యంగా మినుముల ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మంచి క్వాలిటీ గల ఇడ్లీలు తినాలంటే జేబులో కనీసం రూ.30-50 ఉండాల్సిందే. కానీ చెన్నై (chennai)లోని అడంబాక్కం (adambakkam) ప్రాంతంలో రూ.10కే రెండు ప్లేట్ల టేస్టీ ఇడ్లీలు (Idlis) తినచ్చు.

ఇంకా చదవండి ...
ఈ రోజుల్లో అన్ని ఆహార పదార్థాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ముఖ్యంగా మినుముల ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మంచి క్వాలిటీ గల ఇడ్లీలు తినాలంటే జేబులో కనీసం రూ.30-50 ఉండాల్సిందే. కానీ చెన్నై (chennai)లోని అడంబాక్కం (adambakkam) ప్రాంతంలో రూ.10కే రెండు ప్లేట్ల టేస్టీ ఇడ్లీలు (Idlis) తినచ్చు. దీనికి కారణం ఈ ప్రాంతంలో ఒక ఇడ్లీ కేవలం రూ.1.50 ధరకే లభిస్తోంది. ఇదేదో లిమిటెడ్ ఆఫర్ అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే వెరోనికా అనే 70 ఏళ్ల వృద్ధురాలు గత రెండు దశాబ్దాలుగా తక్కువ ధరలకే ఇడ్లీలు అమ్ముతూ పేదవాడి కడుపు నింపుతోంది. ఈ అవ్వ తన కళ్లముందే కనిపించే లాభాన్ని వద్దనుకుంటోంది. పేదవాడికి కడుపు నింపిన సంతృప్తే తనకు కోట్ల ఆస్తి అని చెబుతూ అందరి మనసులను దోచేస్తోంది.

వివరాల్లోకి వెళితే... నికోలస్ అనే 72 ఏళ్ల వ్యక్తి చెన్నైలోని అడంబాక్కం ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అతని భార్య, వెరోనికా (70) రెండు దశాబ్దాలకు పైగా ఇడ్లీ ఇడ్లీలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. ఈ పేద వృద్ధురాలు మెత్తని, తెల్లటి ఇడ్లీలను కేవలం 1.50 రూపాయలకే విక్రయిస్తోంది. రూపాయికి ఏమీరాని ఈరోజుల్లో ఆమె తక్కువ ధరలకే ఇడ్లీలు అమ్మడం ఒక ఎత్తయితే.. వృద్ధాప్యంలో కూడా ఉదయాన్నే నిద్రలేచి, పిండి రుబ్బి రుచికరమైన ఇడ్లీలు తయారు చేయడం మరో ఎత్తు. అంతేకాదు ఈమె ఉదయాన్నే పనికి వెళ్లే వారి ఇళ్లకు నేరుగా వెళ్లి ఎలాంటి రుసుము తీసుకోకుండా డోర్ డెలివరీ చేస్తోంది.

Viral News: ఆ బుడతడు చేసిన పనికి మీరు షాక్ అవ్వాల్సిందే.. ఏకంగా రూ.1.4 లక్షలతో..


ఆహార ప్రియులు ఉదయం వేళ ఆమె ఇంటికి వెళితే కేవలం రూ. 10కే 7 ఇడ్లీలు పొందవచ్చు. వెరోనికా తన రోజువారీ జీవనం కోసం రోజుకు 300 రూపాయల విలువైన ఇడ్లీలను విక్రయిస్తోంది. అలా సంపాదించిన తన రోజువారీ ఆదాయాన్ని మరుసటి రోజు ఇడ్లీ తయారీకే ఆమె ఉపయోగిస్తోంది. అలా రూపాయి కూడా ఆమె లాభం వెనకేసుకోవడం లేదు. ఈ రోజుల్లో రూపాయికేం వస్తుంది, అవ్వా? ఇడ్లీ ధర పెంచి నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు కదా? అని సలహా ఇస్తే... లాభం కోసం కాదని... తృప్తి కోసమే ఇలా చేస్తున్నానని ఆమె నవ్వుతూ సమాధానం ఇస్తుంది. ఆమె భర్త నికోలస్ చెన్నైలోని ఓ బ్యాంక్ ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగం ద్వారా వచ్చే జీతంపై దంపతులిద్దరూ ఆధారపడుతున్నారు.

వెరోనికా భర్త నికోలస్ మాట్లాడుతూ.. 'మొదట్లో ఒక ఇడ్లీ 50 పైసలు, 1 రూపాయికి అమ్మగా, ఇప్పుడు నా భార్య సాంబారు, చట్నీతో కలిపి 1.50 రూపాయలకు విక్రయిస్తోంది. మా ఇడ్లీ దుకాణంపై ఆధారపడిన కుటుంబాలు వందకు పైగా ఉన్నాయి. నాతోపాటు, పెళ్లయిన నా ముగ్గురు కుమార్తెలు కూడా ఇడ్లీ వ్యాపారంలో ఎలాంటి సహాయం చేయరు. నా భార్య ఒక్కరే కృషి చేస్తూ... కష్ట సమయాల్లో కూడా వందలాది కుటుంబాలకు ఆహారం అందించింది.

మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకొని ..ఏం ఘనకార్యం వెలగబెట్టాడో చూడండి

ప్రతిరోజూ ఆమె తన పనిని ప్రారంభిస్తుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి బిజీగా ఉంటుంది. ఇది పూర్తిగా ఆత్మసంతృప్తి కోసం చేస్తుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా వృద్ధాప్య పింఛను పొందలేకపోయాం' అని నికోలస్‌ తెలిపాడు. ఈరోజుల్లో వ్యాపారంలో చాలామంది రూపాయి పెట్టుబడికి నాలుగు రూపాయలు ప్రజల నుంచి కాజేయాలని చూస్తున్నారు. కానీ వెరోనికా లాంటి వారు వ్యాపార దృష్టితో కాకుండా మంచి ఆహారం తక్కువ ధరకే అందిస్తూ పేదల కడుపు నింపుతున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Chennai, Tamilanadu, Trending, Trending news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు