• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • CHENNAI YOUTH PACKED ONION PETROL AND GAS AND GIVEN AS MARRIAGE GIFT TO THEIR FRIEND HSN

స్నేహితుడి పెళ్లికి వెరైటీ బహుమతిని ఇచ్చిన యువకులు.. గిఫ్ట్ బాక్సులో ఏముందో చూసి పెళ్లికి వచ్చిన వాళ్లంతా..

ప్రతీకాత్మక చిత్రం

కొందరు యువకులు తమ స్నేహితుడి పెళ్లికి ఓ బహుమతిని ఇవ్వాలని భావించారు. మామూలు బహుమతిని ఇస్తే తమ స్పెషాలిటీ ఏముంటుందిలే అని భావించి కాస్త విలువైన బహుమతినే ఇవ్వాలని డిసైడయ్యారు. ఆ బహుమతిని చూసి పెళ్లికి వచ్చిన వాళ్లంతా అవాక్కవుతున్నారు.

  • Share this:
    బంధువులు గానీ, స్నేహితులు కానీ పెళ్లికి పిలిస్తే ఓ గిఫ్ట్ తీసుకెళ్లడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఇచ్చే బహుమతుల్లో ట్రెండ్ పాటిస్తున్నారు కానీ, గిఫ్ట్ ఇవ్వడం మాత్రం ఎప్పుడూ జరిగేదే. తమ తాహతుకు తగ్గట్టు ఏదో ఒక చిన్న బహుమతిని నూతన పెళ్లి జంటకు కానుకగా ఇస్తుంటారు. అది కూడా కుదరని పక్షంలో కొంత డబ్బును పెళ్లికుమార్తె తరుపునో, పెళ్లి కొడుకు తరపునో చదివించుకుంటారు. మనం ఇచ్చే గిఫ్టులు ఎప్పుడైనా భవిష్యత్తులో వారి మంచి స్థానంలో కనిపిస్తే ఆనందపడుతుంటారు. అచ్చం అలాగే కొందరు యువకులు తమ స్నేహితుడి పెళ్లికి ఓ బహుమతిని ఇవ్వాలని భావించారు. మామూలు బహుమతిని ఇస్తే తమ స్పెషాలిటీ ఏముంటుందిలే అని భావించి కాస్త విలువైన బహుమతినే ఇవ్వాలని డిసైడయ్యారు.

    బాగా ఆలోచించి ఓ వినూత్న బహుమతిని పెళ్లి మండపంలోనే ఆ కొత్త జంటకు అందించారు. ఆ బహుమతిని చూసి పెళ్లికి వచ్చిన వాళ్లంతా అవాక్కవుతున్నారు. ఇంతకీ వాళ్లు ఇచ్చిన బహుమతి ఏంటంటే..తమిళనాడులోని చెన్నైకి చెందిన కార్తీక్, శరణ్య పెళ్లి వేడుక వంగరంలోని ఓ కల్యాణ మండపంలో గురువారం రాత్రి జరిగింది. ఈ పెళ్లికి వచ్చిన కార్తీక్ స్నేహితులు తమ మిత్రుడికి ఇవ్వబోయే పెళ్లి కానుక గురించి వెరైటీగా ఆలోచించారు. పదిమందిలోనూ తాము ప్రత్యేకంగా ఉండాలని భావించారు.
    ఇది కూడా చదవండి: పెళ్లి మండపం నుంచి వరుడు ఎస్కేప్.. వధువు చేసిన పనికి అంతా షాక్.. పెళ్లి బట్టల్లో ఉండే..

    అందుకే వినూత్నంగా ఆలోచించారు. ప్రస్తుతం ప్రతి రోజూ సామాన్య జనాన్ని భయపెడుతున్న అంశం ఏదన్నదాని గురించి ఆలోచించారు. పెట్రోల్, గ్యాస్ రేట్లు రోజూ విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో వాటినే గిఫ్ట్ గా ఇవ్వాలని తలంచారు. అనుకున్నదే తడవుగా ఓ గ్యాస్ బండను, ఐదు లీటర్ల పెట్రోల్ క్యాన్ ను బహుమతిగా ఇచ్చారు. ఇదే సమయంలో ఉల్లిపాయలతో చేసిన దండను వధూవరులకు ఇచ్చారు. వారు వాటిని పరస్పరం మార్చుకున్నారు. ఆ యువకులు ఇచ్చిన బహుమతులను చూసి పెళ్లికి వచ్చిన వాళ్లంతా అవాక్కయ్యారు. ఉల్లిపాయ దండలను మార్చుకోవడం చూసి అంతా నవ్వాపుకోలేకపోయారు.
    ఇది కూడా చదవండి: పెళ్లి ఏర్పాట్లను చూసి వధువులో ఉత్సాహం.. కారు టాప్ తీసి మరీ డాన్స్.. వరుడి బంధువు మృతి.. అసలేం జరిగిందంటే..
    Published by:Hasaan Kandula
    First published: