అడవికి మృగరాజు సింహమే అయినా పులులకుండే క్రేజే వేరు. దాని పరుగు ముందు ఏ జంతువైనా దిగదుడుపే. సింహాల మాదిరి కాకున్నా.. అవి కూడా గర్జిస్తాయని అందరికీ తెలుసు. అయితే అన్ని జాతులు కాకపోయినా కొన్ని పులుల ఘీంకారం మామూలుగా ఉండదు. ఎంతటి జంతువుకైనా వెన్నులో వణుకుపుట్టాల్సిందే. కానీ ఇక్కడ పులులు అరవడం కాదు కదా.. కనీసం పిల్లుల మాదిరి కూడా గర్జించడం లేదు. ఏంటి.. వాటి గొంతేమైనా బొంగురు పోయిందనుకుంటున్నారా ఏమిటి..? అదేంకాదు.. ఈ పులులు అరవడం లేదు. నమ్మడం లేదా..?
ట్విట్టర్ లో నేచర్ అండ్ ఎనిమల్స్ అనే ప్రొఫైల్ పేరుతో ఉన్న ఒక వ్యక్తి.. ఈ వీడియోను పోస్టు చేశాడు. వీడియోలో పులులు గాండ్రించడం లేదు. గర్జించడం అటుంచి పిల్లుల కంటే మెల్లగా.. ‘మ్యావ్.. మ్యావ్.. ’ అంటున్నాయి. ఈ వీడియోను షేర్ చేస్తూ సదరు వ్యక్తి ఇలా రాసుకొచ్చాడు. ‘ఇది ముఖ్యమైనది.. చిరుతలు గర్జించవు. అవి ఇంట్లో పిల్లుల మాదిరే మ్యావ్.. మ్యావ్ అంటాయి..’అని పోస్ట్ చేశాడు.
Hey, you.
This is important.
Cheetahs don't roar, they meow like housecats. pic.twitter.com/EG0yzQUr4N
— Nature And Animals 🌿 (@animal0lovers) October 29, 2020
ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేయగానే వేలాది మంది నెటిజన్లు దీనికి స్పందించారు. రీట్వీట్లతో ఈ పోస్టును వైరల్ చేశారు. పలువరు నెటిజన్లు స్పందిస్తూ.. ‘వావ్.. దాని (చిరుత) గొంతు భయపెట్టేలా లేదు. అవి చాలా అందంగా కనిపిప్తున్నాయి.’ అని కామెంట్ చేశాడు.
Wow, that voice does not make them look scary at all. They look very cute 😊
— Latifa (@B_Patient_2_Win) October 29, 2020
నిజంగా చిరుత గర్జణ ఎలా ఉంటుంది..?
పులులలో అన్ని జాతులు గట్టిగా గర్జించలేవు. ఎందుకంటే దాని గొంతులో ఉండే ఎముకలు స్థిరమైన నిర్మాణాన్ని కలిగిఉంటాయి. దానికుండే స్వరతంత్రులు విభజించబడి ఉంటాయి. దీంతో చిరుత పులులు నిరంతరం అరవగలవు గానీ గట్టిగా భీకర శబ్దంతో గర్జించలేవని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tiger