• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • CHEETAH CUB PLAYS WITH HIS MOTHER VIDEO GOES VIRAL AND NETIZENS LOVING IT KRS

Viral Video: తల్లితో పులి పిల్ల ఆట.. క్యూట్ వీడియో

Viral Video: తల్లితో పులి పిల్ల ఆట.. క్యూట్ వీడియో

Twitter image

తల్లి భుజాలపైకి ఎక్కి ఓ చిరుతపులి పిల్ల ఆప్యాయంగా ఆడుకోగా.. ఈ వీడియో వైరల్​గా మారింది.

  • Share this:
    తల్లీ పిల్లల ఆప్యాయతలు ఎప్పుడూ అపురూపంగా ఉంటాయి. అవి మనుషులైనే.. ఇతర జీవాలైనా ఆ బంధం ఎంతో గొప్పగా ఉంటుంది. తాజాగా ఓ చిరుత పులి పిల్ల.. సైతం తన తల్లితో ఆడుకుంటూ కనిపించింది. తల్లి భుజాలనెక్కి ఎంతో ప్రేమగా ఆడుకుంది. ఈ షార్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

    తల్లితో చిరుత పిల్ల ఆడుకున్న ఈ అరుదైన వీడియోను ముఖుల్ పంకజ్ అనే యూజర్ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. బేబీ చీతా తల్లితో ఆడుకుంటోంది అని ఆయన క్యాప్షన్ పెట్టారు. చూసేందుకు ఎంతో క్యూట్​గా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.


    ఈ వీడియోకు అధిక సంఖ్యలో వ్యూస్​తో పాటు లైక్​లు, కామెంట్లు అదేస్థాయిలో వస్తున్నాయి. “రియల్ బ్యూటీ ఆఫ్​ లైఫ్​” అని ఓ యూజర్ కామెంట్ చేస్తే.. “ప్రేమమయ క్షణాలు” అని మరో నెటిజన్ రాసుకొచ్చారు.






    క్యూట్ వీడియో. బ్యూటిఫుల్ అంటూ మరికొందరు రాసుకొచ్చారు.
    Published by:Krishna P
    First published:

    అగ్ర కథనాలు