ప్రపంచవ్యాప్తంగా SmartPhones,Internet ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చిన తరువాత Tiktok వంటి వీడియో స్ట్రీమింగ్ యాప్‌లకు ఆధరణ పెరిగింది. ఒక సింగిల్ క్లిక్‌తో ప్రపంచ వ్యాప్తంగా తమకు నచ్చిన వారిని ఫాలో అయ్యే అవకాశం ఇలాంటి యాప్‌లలో ఉంది. తాజాగా టిక్‌టాక్‌లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా అమెరికాకు చెందిన 16ఏళ్ల టీనేజర్ Guinness World Records-2021లో స్థానం దక్కించుకుంది. ఆమె పేరు చార్లీ డి అమేలియో (Charli D’Amelio). ఈ యువతికి ఇంటర్నెట్‌లో ఎంతో క్రేజ్ ఉంది. టిక్‌టాక్ (Female catagory) విభాగంలో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా, మొత్తంమీద టిక్‌టాక్‌లో ఎక్కువమంది ఫాలోఅయ్యే వ్యక్తిగా చార్లీ రికార్డు సాధించింది.
ఏప్రిల్ 30, 2020 నాటికి టిక్‌టాక్‌లో చార్లీకి 5,20,37,851 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ షార్ట్ ఫామ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లో ఆమెకు ఏకంగా 101 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో చార్లి పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నది.
గతంలోనూ రికార్డులు...
చార్లీ గతంలోనూ టిక్‌టాక్ రికార్డులను దక్కించుకుంది. 2020 ఏప్రిల్‌లో టిక్‌టాక్‌లో 50 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న మొదటి వ్యక్తిగా ఆమె గుర్తింపు పొందింది. ఆ తరువాత టిక్‌టాక్‌లో 100 మిలియన్ల మంది అనుచరులను చేరుకున్న మొదటి వ్యక్తిగా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ రికార్డును ఆమె నవంబర్22న సాధించింది. కేవలం ఏడు నెలల్లోనే మరో 50 మిలియన్ల ఫాలోవర్లు పెరగడం విశేషం. టిక్‌టాక్ (మేల్) విభాగంలో ఎక్కువ మంది ఫాలోవర్ల రికార్డ్ హోల్డర్ జాక్ కింగ్ అనే అమెరికన్ పేరుతో ఉంది. ఏప్రిల్ 30, 2020 నాటికి అతడికి టిక్‌టాక్‌లో 4,20,23,513 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 53 మిలియన్లకు చేరుకుంది.
Congrats @charlidamelio, the first @tiktok_us creator to reach 100M followers! We're so proud of everything you've accomplished, what you've contributed to the TikTok community, and how you're continuing to use your platform to give back. https://t.co/yRMbPKftdZ pic.twitter.com/rx5nyHU3Yu
— TikTok Creators (@tiktokcreators) November 22, 2020
అనుకోకుండా చేరింది...
చార్లీ అనుకోకుండా టిక్‌టాక్‌లో చేరింది. కాంపిటీటివ్ డ్యాన్స్‌లో ఆమెకు ప్రావీణ్యం ఉంది. వివిధ రకాల టిక్‌టాక్ డ్యాన్స్‌లు నేర్చుకోవడంలో సహాయం చేయమని తన స్నేహితులు అడిగినప్పుడు అనుకోకుండా చార్లీ టిక్‌టాక్ అకౌంట్ ఓపెన్ చేసింది. ఆ తరువాత డ్యాన్స్ చేస్తూ, సొంతంగా టిక్‌టాక్ కంటెంట్‌ను క్రియేట్ చేయడంపై దృష్టి పెట్టింది. @move_with_joy టిక్‌టాక్ అకౌంట్‌లో చార్లీ కంటెట్‌ను అప్‌లోడ్ చేస్తుంది. ఆమె మొదటిసారి పోస్ట్ చేసిన డ్యూయెట్ వీడియోనే వైరల్ అయింది. ఆ వీడియోను ‘టిక్‌టాక్ ఫర్ యు’ పేజ్ గుర్తించింది. టిక్‌టాక్ ఇండివిడ్యువల్ యూజర్స్ ఫీడ్ నుంచి క్యూరేటెడ్ వీడియోలను ఈ పేజ్ గుర్తిస్తుంది. దీంతో కొద్ది రోజుల్లోనే వేలాది మంది చార్లీని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది.
View this post on Instagram
టిక్‌టాక్‌లో గుర్తింపు వచ్చిన తరువాత కేవలం డ్యాన్స్ వీడియోలకే పరిమితం కాకుండా సైబర్ బుల్లీయింగ్, ఇతర ముఖ్యమైన అంశాలపై కూడా వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తోందామె. చార్లీ క్రేజ్‌ను గుర్తించిన కొన్ని సంస్థలు ఆమెతో ప్రకటనలు చేయించేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఆమె ఇప్పటికే పలు ప్రకటనల్లో నటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Guinness World Record, Social Media, Tiktok