Home /News /trending /

CHANDIGARH POLICE CONSTABLE PRIYANKA CONTROLLING THE TRAFFIC WITH HER BABY IN HER ARMS BA

Viral Video: సార్ మీద కోపం.. చేతిలో పసిబిడ్డ.. ముందు కార్లు.. కానిస్టేబుల్ ఏం చేశారంటే..

చేతిలో బిడ్డతో మహిళా కానిస్టేబుల్

చేతిలో బిడ్డతో మహిళా కానిస్టేబుల్

మొత్తానికి ఈ ఘటనపై ఎవరికి నచ్చినట్టు వారు తమ తమ వైఖరిని చెబుతున్నారు. అయితే, ఒక్క రోజు ఆఫీసర్ మీద నిరసన కోసం ఇలా చేస్తే.. కెరీర్‌లో ఆమెకు చాలా సమస్యలు ఎదురవుతాయని చెప్పే వారు కూడా ఉన్నారు.

    ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారుతోంది. ఓ మహిళా కానిస్టేబుల్ చేతిలో బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తోంది. ఈ వీడియో సామాజి మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చాలా మంది లైక్ చేస్తున్నారు. షేర్ చేస్తున్నారు. దీని గురించి చర్చిస్తున్నారు. ఆ కానిస్టేబుల్ ‌ను కొందరు అభినందిస్తున్నారు. మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఇంతకీ ఈ ఘటన ఛండీగఢ్‌లో జరిగింది. అక్కడ ట్రాఫిక్ పోలీస్ అధికారి ప్రియాంకా చేతిలో బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ పోలీసు అధికారి ప్రియాంకను చాలా మంది అభినందిస్తున్నారు. ఇలాంటి వాళ్లు గ్రేట్ అని పొగుడుతున్నారు. చంటిబిడ్డల తల్లులకు కొంచెం ఉపశమనం కలిగించేలా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

    అయితే, ఇదంతా ఒకవైపు మాత్రమే అని మరికొందరు చెబుతున్నారు. ఆ పోలీసు అధికారి అసలు చేతిలో బిడ్డతో డ్యూటీ చేయడానికి కారణం వేరే ఉందంటున్నారు. ఆమెకు డ్యూటీ వేసిన సమయానికి డ్యూటీకి వెళ్లకపోవడంతో పై అధికారులు తిట్టారని.. వారి మీద కోపంతో నిరసనగా తన బిడ్డను కూడా డ్యూటీకి తీసుకుని వచ్చిందని చెబుతున్నారు.



    ఏదేమైనా ఈ విషయం మీద సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. అవేంటో మీరూ చూడండి.







    మొత్తానికి ఈ ఘటనపై ఎవరికి నచ్చినట్టు వారు తమ తమ వైఖరిని చెబుతున్నారు. అయితే, ఒక్క రోజు ఆఫీసర్ మీద నిరసన కోసం ఇలా చేస్తే.. కెరీర్‌లో ఆమెకు చాలా సమస్యలు ఎదురవుతాయని చెప్పే వారు కూడా ఉన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Chandigarh S34p01, VIRAL NEWS, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు