chandigarh: సాధారణంగా మనలో చాలా మంది తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ కోసం పోటీపడతారు. దీని కోసం ఎక్కువ డబ్బుల చెల్లించడం, వేలంపాటలో ఎంత డబ్బు అయినా.. పెట్టి అనుకున్న నెంబర్ ను సొంతం చేసుకొవడం చేస్తుంటారు.
Man buys Rs 15.4 lakh fancy number for Activa worth Rs 71000: మనలో చాలా మంది కొన్ని నెంబర్లు అంటే లక్కీగా ఉంటాయిని నమ్ముతారు. అలాంటి నంబర్ లు తమ వాహానాలకు ఉంటే అన్ని విధాల కలిసొస్తుందని భావిస్తారు. ఇక కొందరైతే..దీని కోసం వేలం పాటలు, అధిక చెల్లించి ఆ నంబర్ ను తమ సొంతం చేసుకుంటారు. ఆర్టీఎ అధికారులు వేలంపాటను నిర్వహిస్తారు. అధిక సొమ్మును ఎవరైతే చెల్లిస్తే... వారికి ఆ నెంబర్ ను కేటాయిస్తారు. అయితే, చండీగఢ్ కు చెందిన ఒక వ్యక్తి ఈ విధంగా చేసి ప్రస్తుతం వార్తలలో నిలిచాడు.
పూర్తి వివరాలు.. చండీగఢ్ లో అధికారులు వేలం పాటను నిర్వహించారు. దీనిలో వారు.. CH01- CJ-0001 ఫ్యాన్సీ నెంబర్ కోసం వేలం నిర్వహించారు. దీని కోసం అతను వేలంపాటలో పాల్గొన్నాడు. ఏకంగా దీని కోసం 15.44 లక్షలు వెచ్చించాడు. అంటే హోండా యాక్టివా ధర 71,000. ఇక నెంబర్ కోసం అతను.. 15.44 లక్షలు వెచ్చించాడు. అది ఆ హోండా ధరకు.. 21 నుంచి 1 కంటే ఎక్కువ నిష్పత్తిలో ఉంది. అంటే చారానా కోడికి బారానా మసాల అన్నట్లు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఇదేం వింత రా బాంబు అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
తెలంగాణ(Telangana)లో హరితహాతం ఓ యజ్ఞంలా సాగిపోతోంది.
రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేయాలని కాలుష్య రహిత రాష్ట్రంగా మార్చేందుకు గ్రీన్ ఛాలెంజ్ (Green Challenge)కార్యక్రమం దోహదపడుతోంది. ఇలాంటి వినూత్న కార్యక్రమాల మధ్యలోనే మరో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి(Excise Minister )శ్రీనివాస్‌గౌడ్ (Srinivas Goud). మహబూబ్‌నగర్ Mahabubnagarజిల్లాలో చరిత్రకు సాక్ష్యంగా వందల ఏళ్లుగా స్వచ్ఛమైన గాలిని అందిస్తూ ప్రకృతి ఆస్తిగా భావించే భారీ వృక్షాలను రీ ట్రాన్స్ లొకేషన్ (Re trans location)పేరుతో తిరిగి నాటించారు. ఈ అద్భుతమైన కార్యక్రమం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు(KCR Urban Eco Park)లో నాటారు.
భారీ చెట్లకు పునర్జన్మ..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఉన్న వందల ఏళ్లుగా ఉన్న నాలుగు భారీ వృక్షాలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త , టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ సహకారంతో భారీ యంత్రాలతో పెద్ద వృక్షాలను రీ ట్రాన్స్ లొకేషన్ ద్వారా జాగ్రత్తగా తరలించి..కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్‌లో నాటించారు.
చెరిగిపోని వందేళ్ల వృక్ష చరిత్ర..
మహబూబ్‌నగర్‌లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో అధునాతన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈక్రమంలోనే అక్కడ ఉన్న వంద సంవత్సరాలకుపైగా ఉన్న నాలుగు భారీ వృక్షాలకు ఎలాంటి నష్టం జరగకుండా వాటిని జాగ్రత్తగా మరోచోట నాటడం వల్ల స్థానికులు, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన గాలిని ఇస్తూ వందల ఏళ్లుగా చరిత్రకు చిహ్నాలుగా నిలిచిన చెట్లను కాపాడేందుకు ప్రభుత్వం ఈ విధంగా చొరవచూపడం అభినందనీయమన్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.