​Chandigarh Gym: జిమ్​ సెంటర్​ వింత నిబంధనలు.. అండర్ వేర్​పై స్టాంప్, స్మెల్ టెస్ట్.. అబ్బో ఇంకా..

జిమ్ సెంటర్ నిబంధనల నోటీస్

కరోనా తరువాత వ్యాయామాలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో కొత్త జిమ్‌లు పుట్టుకొస్తున్నాయి. వైరస్ భయాల నేపథ్యంలో కొత్త రూల్స్‌ సైతం పెడుతున్నాయి. అయితే చండీగఢ్‌లోని లేక్ క్లబ్‌ అనే జిమ్​.. తమ మెంబర్స్​కు కొన్ని విచిత్రమైన రూల్స్​​ పెట్టింది. ఇప్పుడు ఈ రూల్స్​​కు సంబంధించిన నోటీసు సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Share this:
కరోనా తరువాత వ్యాయామాలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో కొత్త జిమ్‌లు పుట్టుకొస్తున్నాయి. వైరస్ భయాల నేపథ్యంలో కొత్త రూల్స్‌ సైతం పెడుతున్నాయి. అయితే చండీగఢ్‌లోని లేక్ క్లబ్‌ అనే జిమ్​.. తమ మెంబర్స్​కు కొన్ని విచిత్రమైన రూల్స్​​ పెట్టింది. ఇప్పుడు ఈ రూల్స్​​కు సంబంధించిన నోటీసు సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది. క్లబ్​కు వచ్చే వారి అండర్​వేర్​పై స్టాంప్ ఉండాలని, వారు తప్పనిసరిగా స్మెల్​ టెస్ట్ చేయించుకోవాలని నోటీసు జారీ చేసింది. ఈ విచిత్రమైన నిబంధనలకు సంబంధించిన నోటీసును జర్నలిస్ట్ అర్ష్‌దీప్ సంధు ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ నోటీసును చదివిన నెటిజన్లు క్లబ్​ యాజమాన్యాన్ని ఏకిపారేస్తున్నారు. దీంతో, దిద్దుబాటు చర్యలకు దిగిన క్లబ్​ యాజమాన్యం ఇది 'షరారత్' (ఫన్నీ) కోసం పెట్టిన నోటీస్​ అని సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. చండీగఢ్ లేక్ క్లబ్ జిమ్ జారీ చేసిన నోటీసులో నాలుగు పాయింట్స్​ ఉన్నాయి.

నోటీసులో పేర్కొన్న నిబంధనలివే..

జిమ్​కు వచ్చే వారు సరైన దుస్తులు ధరించాలి. జిమ్​ సూట్లు మాత్రమే ధరించాలి. క్లబ్ యాజమాన్యం స్టాంపింగ్​​ వేసిన దుస్తులను మాత్రమే జిమ్​కు వచ్చినప్పుడు ధరించాల్సి ఉంటుంది.

జిమ్​కు వచ్చే సభ్యులు సరైన బూట్లను ధరించాలి. సాక్స్​లు రోజుకోసారి తప్పనిసరిగా ఉతకాలి. వారు లోపలికి ఎంటరయ్యే సమయంలో స్మెల్ టెస్ట్ నిర్వహిస్తాం. ఒకవేళ, అపరిశుభ్రమైన బూట్లు, వాసన వచ్చే సాక్స్​లు ధరిస్తే జరిమానా విధిస్తాం.

జిమ్ పరికరాలతో శబ్దం రాకుండా వర్కవుట్స్​ చేయాలి. వర్కవుట్స్​ చేసేటప్పుడు అరవకూడదు. కేవలం పంజాబీ భాషలోనే మాట్లాడాలి. ఇతర భాషలు మాట్లాడే వారికి అనుమతి లేదు.

జిమ్​కు షార్ట్స్​ వేసుకొని వచ్చే వారు తమ కాళ్లను షేవ్​ చేసుకొని రావాలి. మహిళలు తమ కాళ్లకు పట్టీలు ఉంటే.. వాటిని ఇంట్లోనే పెట్టి రావాలి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

ఈ నిబంధలను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. జిమ్​ సెంటర్లో ఇన్ని నిబంధనలా? అంటూ నిర్వాహకులను విమర్శిస్తున్నారు. మరికొందరైతే స్మెల్​ టెస్ట్​ ఎలా చేస్తారు? దీని కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారా? అంటూ ఫన్నీగా కామెంట్స్​ చేస్తున్నారు. ఏదేమైనా, ఈ నోటీసుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్లబ్​ యాజమాన్యం వెంటనే దీన్ని తొలగించింది.
Published by:Sambasiva Reddy
First published: