Driving Licence: డ్రైవింగ్ లైసెన్సు లేనివారికి శుభవార్త.. ఇక చదువు లేకున్నా..

Driving Licence | యువతకు ఉపాధికావకాశాలు మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులు కాకపోయినా ఇకపై లైసెన్సు పొందవచ్చని తాజాగా ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 19, 2019, 8:53 AM IST
Driving Licence: డ్రైవింగ్ లైసెన్సు లేనివారికి శుభవార్త.. ఇక చదువు లేకున్నా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గొప్ప గొప్పగా డ్రైవింగ్ చేయడం వచ్చినా చదువు లేదన్న కారణంతో ఇప్పటి వరకు చాలా మంది డ్రైవింగ్ లైసెన్సు పొందలేకపోయారు. కమర్షియల్ రవాణా లైసెన్సు పొందాలంటే కనీసం 8వ తరగతి చదవాలన్న నిబంధ ఉండేది. దీనివల్ల ఎంతోమంది లైసెన్సు పొందక ఉపాధి కోల్పోయారు. ఈ సమస్య కేంద్రం దృష్టికి రావడంతో వారికి శుభవార్త చెప్పింది. యువతకు ఉపాధికావకాశాలు మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులు కాకపోయినా ఇకపై లైసెన్సు పొందవచ్చని తాజాగా ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. కాకపోతే మోటారు వాహనాల చట్టం ప్రకారం తగు నైపుణ్య శిక్షణ విధిగా పొందాల్సిందేనని, ట్రాఫిక్‌కు సంబంధించిన సంకేతాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు మోటారు వాహనాల చట్టం 1989లోని 8వ నిబంధనకు సవరణ చేయనున్నట్లు తెలిపింది.

కాగా, ముసాయిదా నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది. రవాణా, లాజిస్టిక్స్‌ రంగంలో దాదాపు 22 లక్షల మంది డ్రైవర్లు అవసరం ఉన్న నేపథ్యంలో నిరక్షరాస్యులైన యువతకు తాజా నిర్ణయం ఎంతగానో ఉపయోగ పడే అవకాశం ఉంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 19, 2019, 8:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading