తెలంగాణకు కేంద్రం శుభవార్త.. చిరకాల కోరిక తీరినట్లే..

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోంది. రాష్ట్రంలో పసుపు హబ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ హబ్‌ను నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

news18-telugu
Updated: January 15, 2020, 4:10 PM IST
తెలంగాణకు కేంద్రం శుభవార్త.. చిరకాల కోరిక తీరినట్లే..
తెలంగాణ మ్యాప్
  • Share this:
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోంది. రాష్ట్రంలో పసుపు హబ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ హబ్‌ను నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్‌ను కూడా కేంద్రం చేర్చనుంది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. వాస్తవానికి నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌ను నెరవేర్చుతామని హామీ ఇవ్వడంతో బీజేపీ అభ్యర్థి కూడా అక్కడ గెలుపొందారు. ఈ నేపథ్యంలో బోర్డుకు బదులు హబ్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది.

కాగా, దేశంలోనే అత్యధికంగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఆర్మూర్, బాల్కొండ, మెట్‌పల్లి ప్రాంతాల్లో ఎక్కువగా పసుపు పండుతుంది. నిజానికి 11వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రతి రాష్ట్రంలో ఒక పసుపు కేంద్రం ఉండాలి. ఉమ్మడి ఏపీలో రాష్ట్రానికి మంజూరైన పార్కును గుంటూరు జిల్లాలో నిర్మించారు. తెలంగాణకు మాత్రం పసుపు కేంద్రాన్ని కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు పసుపు హబ్‌ను ఏర్పాటు చేస్తుండటం సానుకూలాంశమే. ఈ నిర్ణయం వల్ల నిజామాబాద్ ప్రాంత రైతుల చిరకాల కోరిక నెరవేరినట్లే అవుతుంది.

First published: January 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు