హర్యానా గురుగ్రామ్‌లో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. అక్కడి బసాయ్ చౌక్ ఏరియాలో బాలాజీ ఆస్పత్రి ఉంది. అక్కడ ఇద్దరు పెద్దవాళ్లకు ట్రీట్‌మెంట్ చేయంచడానికి ఓ కుటుంబ సభ్యులు వచ్చారు. ఆస్పత్రిలో డాక్టర్లు చక్కగా పలకరించి, అన్ని విషయాలూ చెప్పి ట్రీట్‌మెంట్ చెయ్యాలా వద్దా అని అడిగారు. అందుకు కుటుంబ సభ్యులు సరే ట్రీట్‌మెంట్ చెయ్యండి అని అన్నారు. డాక్టర్లు సరే అన్నారు. సహజంగానే ఆ ఆస్పత్రిలో కొద్దిగా రద్దీ ఉంటుంది. ఆస్పత్రి పక్కనే ఓ మందుల షాపు ఉంది. అక్కడే చాలా వెహికిల్స్ పార్క్ చేస్తారు ప్రజలు. ఇలాంటి సమయంలో... ఆస్పత్రిలో ఉన్న కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటూ వాళ్లలో వాళ్లే గొడవకు దిగారు. రాన్రానూ ఆ గొడవ బాగా పెరిగిపోయింది. దాంతో... ఆ కుటుంబ సభ్యులు రెండుగా విడిపోయారు. బాగా తిట్టుకొని... కొట్టుకునే దాకా వెళ్లారు.
ఇంతలో ఆ సభ్యులలోని ఓ వ్యక్తి... ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లి... అక్కడ పార్క్ చేసిన తన ట్రక్కును వేగంగా తెచ్చి... ఆస్పత్రి ఢీ కొట్టాడు. ఇలా ఒకసారి కాదు... 7-8 సార్లు ఢీ కొట్టాడు. ఆ దెబ్బకు ఆస్పత్రి గోడలు బద్ధలయ్యాయి. మందుల షాపు తుక్కు తుక్కైంది. ఆస్పత్రి సిబ్బంది తలో దిక్కుకూ పరుగులు పెట్టారు. ట్రక్కుతో ఢీకొట్టేటప్పుడు... ముందుగా ఉన్న వాహనాల్ని కూడా ఇష్టమొచ్చినట్లు ఢీకొట్టాడు ఆ వ్యక్తి. దాంతో 10-15 వాహనాలు దెబ్బతిన్నట్లు తెలిసింది. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా తీవ్ర ఆలజడి, కంగారు, టెన్షన్, ఆదుర్తా అన్నీ వచ్చేశాయి. ఈ దృశ్యాలు 4 సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
#WATCH Gurugram: CCTV footage shows a man ramming his pick-up truck inside Balaji Hospital premises at Basai Chowk after a tussle between members of the same family over the treatment of 2 elderly patients. Case registered, no arrest made yet
ఈ ఘటన తర్వాత ప్రాణాలతో బయటపడిన డాక్టర్లలో ఒకరైన డైరెక్టర్ డాక్టర్ బల్వాన్ సింగ్ పోలీసులకు కాల్ చేశారు. అప్పటికే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హడావుడిగా అక్కడికి వచ్చారు. కేసు రాశారు. ట్రక్కుతో ఢీ కొట్టిన వ్యక్తి వాహనంతో పారిపోయాడు. అందువల్ల పోలీసులు కేసు రాసినా... ఇంకా అతన్ని అరెస్టు చెయ్యలేదు. ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి దారుణం ఏదీ అక్కడ జరగలేదు. అందువల్ల స్థానికులు ఇది ఉగ్రవాదుల పనేమో అనుకున్నారు. తీరా ఇదంతా ఓ కుటుంబ సభ్యుల ఇంటర్నల్ గొడవ అని తెలిశాక కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనా ఇలాంటి వాళ్లను అరెస్టు చేసి... లా అండ్ ఆర్డర్ కఠినంగా అమలు చెయ్యాలని దీన్ని కళ్లారా చూసిన వాళ్లు కోరుతున్నారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.