CBI vs CBI : ఆలోక్ వర్మ నియామకం నుంచి తొలగింపు వరకు...

Alok Verma Sacked: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సీబీఐ చీఫ్‌గా మరోసారి పగ్గాలు చేపట్టిన ఆలోక్ వర్మను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ తొలగించింది. ఆయన స్థానంలో మళ్లీ ఎం.నాగేశ్వరరావుకు పగ్గాలు అప్పగించింది.

news18-telugu
Updated: January 10, 2019, 10:44 PM IST
CBI vs CBI : ఆలోక్ వర్మ నియామకం నుంచి తొలగింపు వరకు...
ఆలోక్ వర్మ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: January 10, 2019, 10:44 PM IST
సీబీఐ చీఫ్‌గా ఆలోక్ వర్మను తొలగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ, లోక్‌భసలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గేలతో కూడిన కమిటీ 2-1 తేడాతో ఆలోక్ వర్మను మళ్లీ సీబీఐ చీఫ్‌గా తొలగించింది. ప్రధాని నరేంద్ర మోదీ, జస్టిస్ ఏకే సిక్రీ ఆయన్ను తొలగించడానికి అనుకూలంగా నిలిచారు. మల్లికార్జున ఖర్గే మాత్రం ఆలోక్ వర్మ తొలగింపును వ్యతిరేకించారు. అయితే, మెజారిటీ ఓటింగ్ ప్రకారం ఆలోక్ వర్మ మీద వేటు పడింది. ఆయన స్థానంలో మళ్లీ సీబీఐ చీఫ్‌గా నాగేశ్వరరావును నియమించింది కమిటీ.

సీబీఐ వర్సెస్ సీబీఐ వివాదంలో ముఖ్య ఘట్టాలు

2018 అక్టోబర్ 23న సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఇద్దరినీ లీవ్ మీద పంపిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన ఎం. నాగేశ్వరరావును తాత్కాలిక సీబీఐ చీఫ్‌గా నియమించింది.

2018 అక్టోబర్ 24. తనను లాంగ్ లీవ్ మీద పంపించడాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.



2018 అక్టోబర్ 26. ఆలోక్ వర్మ తొలగింపు మీద విచారణ జరపాలంటూ చీఫ్ విజిలెన్స్ కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

2018 నవంబర్ 12. సీబీఐ వివాదంపై దర్యాప్తు జరిపిన సీవీసీ తమ ప్రాధమిక నివేదకను సుప్రీంకోర్టుకు అందజేసింది.
Loading....
2018 డిసెంబర్ 5. ఆలోక్ వర్మ, రాకేష్ ఆస్థానా పిల్లుల్లా కొట్లాడుకుంటూ సీబీఐ పరువు తీస్తున్నారంటూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టులో అన్నారు.

2018 డిసెంబర్ 6. ఆలోక్ వర్మతో పాటు ఆయనను లాంగ్ లీవ్‌లో పంపించడం మీద మరో ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్ల మీద తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.

2019 జనవరి 8. ఆలోక్ వర్మకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. అయితే, దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తో కూడిన హైపవర్ కమిటీని నియమించింది. ఆ కమిటీ వారంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

2019 జనవరి 9. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తన స్థానంలో సీనియర్ జడ్జి జస్టిస్ ఏకే సిక్రీని నియమించారు.

2019 జనవరి 10. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీలో 2-1 మెజారిటీతో ఆలోక్ వర్మను సీబీఐ చీఫ్‌గా మరోసారి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫఎన్స్, హోమ్ గార్డ్స్‌కు డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎం.నాగేశ్వరరావును మళ్లీ సీబీఐ చీఫ్‌గా నియమించింది. ఆలోక్ వర్మను తొలగించాలన్న ప్రతిపాదనను మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించారు.

 
First published: January 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు