Home /News /trending /

CAUGHT ON CAMERA SHOCKING MOMENT FAST FOOD RESTAURANT MANAGER THROWS BOILING WATER ON CUSTOMERS PAH

Shocking: కస్టమర్ ముఖం మీద కాగుతున్న నీళ్లను విసిరిన ఫాస్ట్ ఫుడ్ మేనేజర్.. వీడియో వైరల్..

వేడినీళ్లతో దాడి

వేడినీళ్లతో దాడి

Texas:హోటల్ లో కస్టమర్ కు ఒక ఆర్డర్ బదులు మరోక ఆర్డర్ డెలివరీ చేశారు. దీంతో కస్టమర్ వెళ్లి, సిబ్బందితో ఆర్డర్ విషయంలో గొడవకు దిగాడు.

కొన్నిసార్లు మనం ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా హోటల్స్ కు వెళ్లి తింటుంటాం. అప్పుడు మనం నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ను ఆర్డర్ చేసి మరీ తింటుంటాం. కొన్నిసార్లు హోటళ్లలో కస్టమర్ లకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. కావాలని ఆర్డర్ లేట్ గా ఇవ్వడం, ఫుడ్ క్వాలిటీగా లేకపోవడం, చల్లని పదార్థాలు ఇవ్వడం చేస్తుంటారు. మరికొన్ని సార్లు.. బిల్లులు ఎక్కువగా కూడా వేస్తుంటారు. ఇలాంటి సందర్భాలలో కస్టమర్ లకు, హోటల్ సిబ్బందికి మధ్య గొడవలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు.. ఇది పరస్పరం దాడుల వరకు కూడా వెళ్తుంటుంది. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. టెక్సాస్ లో (Texas)  షాకింగ్ ఘటన జరిగింది. డల్లాస్ లోని టాకోబెల్ అవుట్ లెట్ లో జరిగిన ఉదంతం ప్రస్తుతం వైరల్ గా మారింది. బ్రిటనీ డేవిస్.. తన ఫ్యామిలీతో కలిసి సదరు ఫ్యామిలీ ఫుడ్ కోసం వచ్చింది. అప్పుడు వారు పెట్టిన ఆర్డర్ లో పొరపాటు జరిగింది. దీంతో వారు హోటల్ నిర్వాహకులను నిలదీశారు. దీంతో కొంచెం వాగ్వాదం చోటు చేసుకుంది. ఆసమయంలో అక్కడే ఉన్న మెనేజర్ కంట్రోల్ తప్పాడు. ఈ క్రమంలో.. ఫుడ్ ప్రిపేర్ చేసే గదిలోకి వెళ్లాడు.



వేడి నీళ్లను జగ్ లో ముంచి తీసుకున్నాడు. ఆ తర్వాత.. కౌంటర్ దగ్గర ఉన్న కస్టమర్ దగ్గరకు వెళ్లి అతని ముఖంపై పోశాడు. దీంతో అక్కడ ఉన్న బ్రిటనీ డేవిస్ మరోక కస్టమర్ లో భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటన జూన్ 17 న జరిగింది. వెంటనే బాధితులు అక్కడి నుంచి పారిపోయారు. ఆస్పత్రిలో చేరారు. బాధితుల శరీర భాగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయి. బాధితులు..వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. జూలై 13 న వీరు కోర్టులో దావా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. ఈ విజువల్స్ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అవి కాస్త వైరల్(viral video) అవుతున్నాయి.
Published by:Paresh Inamdar
First published:

Tags: America, Viral Video

తదుపరి వార్తలు