కారులో వచ్చి... కుండీ ఎత్తుకుపోయాడు... వైరల్ వీడియో

సాధారణంగా వైరల్ వీడియోలు చాలా చిన్నగా ఉంటాయి. ఇది మాత్రం పెద్దగా ఉంది. అయినప్పటికీ నెటిజన్లు దీన్ని పూర్తిగా చూసి... కామెంట్స్ చేస్తున్నారు.

news18-telugu
Updated: July 25, 2020, 8:19 AM IST
కారులో వచ్చి... కుండీ ఎత్తుకుపోయాడు... వైరల్ వీడియో
కారులో వచ్చి... కుండీ ఎత్తుకుపోయాడు... వైరల్ వీడియో (credit - twitter)
  • Share this:
ఇలాంటి దృశ్యాలు మనకు రెగ్యులర్‌గా కనిపించవు. ఏ పర్సో, చైనో చోరీ చేశారంటే అది రొటీనేగా అనుకోవచ్చు. ఉత్తరప్రదేశ్... లక్నోలో మాత్రం ఓ వ్యక్తి కారులో వచ్చి... కుండీని ఎత్తుకుపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలే... ఓ ఇంటి గేటు దాటాక కారును ఆపిన వ్యక్తి... ప్రహరీ గోడపై ఓ పెద్ద కుండీ, మొక్కను చూశాడు. దాన్ని ఎత్తుకుపోవాలని ప్లాన్ వేశాడు. చుట్టూ చూశాడు. ఎవరూ లేరులే అనుకున్నాడు. అతి కష్టమ్మీద ఆ కుండీని గోడ నుంచి కిందకు దింపాడు. అది ఎంత బరువు ఉందంటే... దాన్ని మొయ్యలేక... అతనూ కింద పడ్డాడు. అలా పడుతూ, లేస్తూ... మొత్తానికి ఆ కుండీని కారు డిక్కీలోకి ఎక్కించాడు. మొక్కను బలవంతంగా అందులోకి కుక్కాడు. అప్పటికి ఇంటి యజమానికి డౌట్ వచ్చింది. ఇంట్లోంచీ బయటకు వచ్చి చూశాడు. కుండీ కనిపించలేదు. అయ్యో అనుకుంటూ గేటు తీసేలోపే... ఆ టక్కరి దొంగ కారును నడుపుకుంటూ పారిపోయాడు.


లక్నోలోని ఇందిరా నగర్‌లో ఈ చోరీ జరిగింది. ఇందుకు సంబంధించి 1.5 నిమిషాల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బుధవారం నుంచి ఇప్పటికే దాన్ని 17 లక్షల మంది చూశారు. 217 మంది లైక చేశారు. 114 మంది కామెంట్లు రాశారు.

కామెంట్లలో కొన్ని నవ్వు తెప్పిస్తున్నాయి. అతన్ని యూపీ పర్యావరణ విభాగానికి బ్రాండ్ అంబాసిడర్ చెయ్యాలని, అవార్డ్ ఇవ్వాలని ఓ యూజర్ కోరారు. ఇంట్లో జిమ్ చేయడానికే దాన్ని ఎత్తుకుపోయి ఉంటాడని మరో యూజర్ ఫన్నీ కామెంట్ చేశారు. అలాంటి మరిన్ని కామెంట్స్ మీరే చదవండి.

ఈ ఏడాది ప్రారంభంలో ఇలాంటిదే ఓ ఘటన ఢిల్లీలో జరిగింది. ఓ ముసలాయన ఫ్లైఓవర్‌కి ఏర్పాటు చేసిన నిలువెత్తు గార్డెన్‌లో ఓ కుండీని తీసి... దాన్లో మొక్, మట్టిని కింద పారేసి... కుండీని పట్టుకుపోయాడు. అప్పట్లో నెటిజన్లు ఆ వ్యక్తిని తిట్టిపోశారు.
Published by: Krishna Kumar N
First published: July 25, 2020, 8:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading