తమిళనాడులోని (Tamil nadu) సేలం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన మే 17 వ తేదిన, మంగళవారం జరిగింది. కాగా, ఎడప్పాడి నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు, తిరుచెంగోడ్ నుంచి వస్తున్న మరో బస్సును బలంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
#WATCH | Tamil Nadu: Two private buses collided head-on with each other in Salem district; several reported to be injured. Further details awaited.
ఎదురుగా వస్తున్న బస్సుపూర్తిగా రాంగ్ రూట్ లోను, వేగంగా రావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఒక బస్సులోని డ్రైవర్ తో సహా ప్రయాణికులు ఎగిరి కిందపడ్డారు. బస్సులోని అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రయాణికులకు తమ సీట్ల నుంచి ఎగిరి కిందపడ్డారు. వెంటనే గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా గతంలో తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎక్లాస్‌పూర్‌లో ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సు, కారు లోయలోకి దూసుకెళ్లాయి. బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో (Peddapalli District) విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎక్లాస్‌పూర్‌లో ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సు, కారు లోయలోకి దూసుకెళ్లాయి. బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు.
పరకాల డిపోకు చెందిన బస్సు బెల్లంపల్లి నుంచి హన్మకొండకు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
బస్సులోని 16 మంది ప్రయాణికులు గాయపడినట్లు తెలిసింది. అయితే.. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం లేదు. కారు నడిపిన డ్రైవర్ పేరు వినీత్‌గా తెలిసింది. కారులో అతను ఒక్కడే ఉన్నట్లు సమాచారం.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.