హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: వామ్మో.. ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న ఇన్నోవా.. ఎక్కడంటే..

OMG: వామ్మో.. ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న ఇన్నోవా.. ఎక్కడంటే..

గాల్లోకి ఎగిరిన మహిళ

గాల్లోకి ఎగిరిన మహిళ

Kerala: రాంగ్ రూట్ లో ఇన్నోవా వేగంగా వచ్చింది. ఇంతలో స్కూటీ మీద ఇద్దరు దంపతులు తమ మార్గం గుండా వెళ్తున్నారు. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India

కొందరు రోడ్ల మీద ఇష్టమోచ్చినట్లు వెహికిల్స్ నడిపిస్తుంటారు. అసలు ట్రాఫిక్ రూల్స్ ను పాటించరు. మరికొందరు తాగి వాహనాలను నడిపిస్తుంటారు. అంతే కాకుండా.. ట్రిబుల్ రైడింగ్ లు చేస్తుంటారు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోరు. కారు నడిపించేటప్పుడు.. బెల్ట్ కూడా పెట్టుకొరు. తమ వాహనాల్లో ఉండాల్సిన సంఖ్యకంటే.. చాలా మందిని కుక్కేస్తుంటారు. రాంగ్ రూట్ లలో ప్రయాణిస్తుంటారు. ట్రాఫిక్ కు సంబంధించిన ఏ రూల్ ను పాటించారు. దీంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు.. కేరళలో (Kerala) షాకింగ్ ఘటన జరిగింది. మలప్పురంలోని కుట్టిపురం-తిరూర్ రహదారిపై ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. అబ్దుల్ ఖాదర్, తన భార్య రుకియాతో కలసి స్కూటీమీద ప్రయాణిస్తున్నాడు. అప్పుడు ఎదురుగా ఒక ఇన్నోవా వేగంగా రాంగ్ రూట్ లో వచ్చింది. దీన్ని ఖాదర్ గమనించలేదు. అది స్పీడ్ గా వచ్చి, వీరి టూవీలర్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో వీరిద్దరు గాల్లో బంతిలాగా ఎగిరికిందపడ్డారు. అబ్దుల్ ఖాదర్ కు అక్కడ డివైడర్ తలకు బలంగా తాకడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు.అతని భార్య రుకియాను స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో ఇన్నోవా మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఖాదర్ వాహనాన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఖాదర్ అక్కడికక్కడే మృతి చెందాడు. యూఏఈలో పనిచేస్తున్న అబ్దుల్ ఖాదర్ కొద్దిరోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చాడు. ఖాదర్, అతని భార్య రుకియా తవనూరులో బంధువుల వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం సాయంత్రం కుట్టిపురం-తిరూర్ రహదారిపై చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్  అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.


ఇదిలా ఉండగా దొంగ, పోలీసులకు ఒక రేంజ్ లో చుక్కలు చూపించాడు.


పూర్తి వివరాలు.. ఒక దొంగను పోలీసులు జీప్ లో ఛేజింగ్ చేస్తున్నారు. అతను స్కూటీపై ధూమ్ స్టైల్ లో చక్మా ఇచ్చాడు. అంతే కాకుండా.. పోలీసులకు దొరక్కుండా స్కూటీ మీద కట్స్ కొడుతూ ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు అతగాడు ఒక వంపు మార్గం రాగానే దానిలోపలికి పొనిచ్చాడు. అప్పుడు.. దిమ్మ తిరిగే ఘటన జరిగింది. స్కూటీ మీద ప్రయాణిస్తున్న దొంగ.. మరో మార్గంలోనికి పొనిచ్చాడు. అప్పుడు.. అతనికి ఎదురుగా ఒక సుమో వాహనం ఆగి ఉంది.


అతను వేగంగా వెళ్లి.. వెహికిల్ వెనుక నుంచి యూటర్న్ చేసుకుని వచ్చిన మార్గం గుండా తిరిగి వెళ్లిపోయాడు. పాపం.. పోలీసులు స్కూటీ అంత వేగంగా తమ వాహనం టర్న్ చేయలేక అక్కడే ఉండిపోయారు. అంతే కాకుండా.. పోలీసులు వెహికిల్ దిగి.. అతగాడి కోసం వెనుకవైపుకు వచ్చి మరీ చూశారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు (Netizens) ఇదేం తెలివిరా నాయన అంటూ కామెంట్ లు పెడుతున్నారు. మరికొందరు వీడిది మాములు బుర్రకాదంటూ నవ్వుతూ ఎమోజీలను పెడుతున్నారు.Published by:Paresh Inamdar
First published:

Tags: Kerala, Road accident, VIRAL NEWS

ఉత్తమ కథలు