• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • CAT WALKING INTO HOSPITAL FOR MEDICAL TREATMENT TO HER SICK KITTEN HERE IS AMAZING VIDEO NETIZENS EMOTIONAL REACTIONS SK GH

Viral Video: పిల్లి పిల్లకు అనారోగ్యం.. హాస్పిటల్‌కు తీసుకెళ్లిన తల్లి.. అమ్మ ప్రేమంటే ఇదే

Viral Video: పిల్లి పిల్లకు అనారోగ్యం.. హాస్పిటల్‌కు తీసుకెళ్లిన తల్లి.. అమ్మ ప్రేమంటే ఇదే

పిల్లికూనను ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి పిల్లి

అనారోగ్యం పాలైన పిల్లి పిల్లను తన తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. పిల్లి కూనను నోట కరచుకొని నేరుగా ఆస్పత్రికి వెళ్లింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Share this:
తల్లి ప్రేమకు మనుషులు, జంతువులనే తేడా ఉండదు. అన్ని జీవజాతుల్లోనూ తల్లులు తమ పిల్లలపై ఎనలేని ప్రేమ చూపిస్తాయి. వాటికి ఏ చిన్న ఇబ్బందులు ఎదురైనా తట్టుకోలేవు. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక పిల్లి పిల్లకు చికిత్స కోసం.. దాని తల్లి పడిన శ్రమ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఎలాగైనా తన పిల్లి కూనకు వైద్యం అందేలా చేసేందుకు తల్లి పిల్లి తాపత్రయ పడిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. టర్కీలోని కరబాగ్లార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అప్పుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని రోజుల వయసున్న చిన్న కూనకు వైద్య సహాయం కోరుతూ.. దాన్ని తల్లి హాస్పిటల్‌కు వెళ్లింది. ఈ సమయంలో అది తన పిల్లను నోటితో పట్టుకొని హాస్పిటల్‌కు తీసుకెళ్లడం విశేషం.

పిల్లి పిల్ల కంటికి ఇన్‌ఫెక్షన్ వచ్చినట్టు వైద్యులు గుర్తించారు. హాస్పిటల్ సిబ్బంది వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన ఒక మహిళా వెటర్నీరీ వైద్యురాలు దానికి చికిత్స అందించారు. దీనికి సంబంధించిన వీడియోను గల్ఫ్ టుడే వార్తాసంస్థ షేర్ చేసింది. ఈ రెండు నిమిషాల వీడియోలో.. పిల్లి దాని పిల్లను నోట కరుచుకొని హాస్పిటల్‌కు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అక్కడ ఉన్న ప్రజలు దానికి దారి ఇస్తూ వీడియో తీశారు. ఆ తరువాత పిల్లి పిల్ల కంటికి ఇన్‌ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. వెటర్నరీ వైద్యులు దాని కంటి చుక్కలు వేసి చికిత్స అందించారు.

ఒకరోజు ఉదయం పిల్లి కూనను హాస్పిటల్‌కు తీసుకెళ్లిన తల్లి పిల్లి.. సాయం కోసం చాలాసేపు అరిచిందని గల్ఫ్ టుడే వార్తాసంస్థ తెలిపింది. అక్కడే ఆరోగ్యంగా ఉన్న మరో పిల్లి పిల్ల కనిపించింది. వీటిని వారు ఒక డబ్బాలో పెట్టి, ఆహారం అందించారు. ఒక పిల్లి కూనకు కంటి సమస్య ఉండటంతో స్థానిక వెటర్నరీ హాస్పిటల్‌కు సమాచారం అందించారు. అక్కడి వైద్యులు దానికి చికిత్స చేశారు. అప్పటికి దాని కన్ను ఒకటి పూర్తిగా మూసుకుపోయి ఉంది. చికిత్స అనంతరం అది కోలుకుంటోందని స్థానికులు తెలిపారు. ఆ పిల్లి స్థానికంగా నివసిస్తోందని వైద్యశాల సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం దానికి, పిల్లి పిల్లలకు ఆహారం అందిస్తున్నామని చెప్పారు.

పిల్లి పిల్లను దాని తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారడంతో నెటిజన్లు ఎమోషనల్ పోస్ట్‌‌లు పెడుతున్నారు. తల్లి ప్రేమకు ఇదే నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. మనుషుల్లోనైనా.. జంతవుల్లో అయినా.. తల్లి ప్రేమకు ఏదీ సాటిరాదని కామెంట్స్ పెడుతున్నారు. అసలు అది ఆస్పత్రన్న విషయం ఆ పిల్లికి ఎలా తెలుసని.. నిజంగా చాలా గ్రేట్ అని కొనియాడుతున్నారు. తల్లి ప్రేమకు ఇంతకు మించిన మంచి ఉదాహరణ ఉండదని అభిప్రాయపడుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: