స్విట్చ్ బోర్డులో తల దూర్చిన పిల్లి... కరెంటు షాక్ కొట్టాక...

ఎవరైనా అయోమయం ఫేస్ పెడితే... "ఏమైంది... కరెంటు షాక్ కొట్టిన కాకిలా అలా ఉన్నావ్"... అంటాం. ఆ పిల్లిని చూసిన వాళ్లంతా అలాగే ఉందంటూ తెగ నవ్వుతున్నారు. నిజమే... దానికి కరెంటు షాక్ కొట్టింది మరి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 9, 2019, 9:48 AM IST
స్విట్చ్ బోర్డులో తల దూర్చిన పిల్లి... కరెంటు షాక్ కొట్టాక...
కరెంట్ షాక్ కొట్టిన పిల్లి (Image : Twitter - owurakuwaa)
Krishna Kumar N | news18-telugu
Updated: August 9, 2019, 9:48 AM IST
కరెంటు ప్లగ్ బోర్డులో ఏదో తేడా ఉండటంతో... దాన్ని సరిచేసే పనిలో పడింది ఆ ఇంటి ఓనర్ ఔరాకువా. ఓ పరికరం కావాల్సి వచ్చి... దాని కోసం వేరే గదిలోకి వెళ్లింది. ఇంతలో... ఆమె పెంచుకుంటున్న పిల్లి... ప్లగ్ బోర్డ్ దగ్గరకు వచ్చింది. ఆ బోర్డు లోపల చీకటిగా ఉండటంతో... అక్కడ ఏదో ఉండి ఉండొచ్చని అనుకుంది. లోపల ఏ ఎలకో దాక్కొని ఉండొచ్చని భావించి... బోర్డులో తలపెట్టింది. అంతే... ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టింది. దెబ్బకు వెనక్కి ఎగిరిపడిన పిల్లికి తలకు దెబ్బ తగలడమే కాదు... జుట్టంతా చెదిరిపోయి... కరెంటు షాక్ కొట్టిన కాకిలా అయిపోయింది. పిల్లి అరుపు విని పరిగెత్తుకొచ్చిన ఔరాకువా... దాన్ని చూసి షాకైంది. ఎలా ఉండే పిల్లి, ఎలా అయిపోయిందో అనుకుంటూ... దాన్ని దగ్గరకు తీసుకొని ఓదార్చింది. ఐతే... ఔరాకువా కూతురు... పిల్లిని కొన్ని ఫొటోలు తీసింది. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


అత్యుత్సాహంతో ఆ పిల్లి చేసిన పని వల్ల దాని ప్రాణం పోయేదే అని ఔరాకువా కామెంట్ పెట్టింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఆ పిల్లి... షాక్ కొట్టాక... అల్బర్ట్ ఐన్‌స్టీన్‌లా ఉందని ఒకరంటే... అది ప్రమాదకర అనుభవం అని మరొకరు అన్నారు. ఇంకా ఎవరెవరు ఏమన్నారో మీరే చూడండి.First published: August 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...