Viral Video: హైస్పీడ్ రైల్లో పిల్లి ఫ్రీగా తిరిగేస్తుంది.. అందుకని ఏం చేశారంటే

ఓ పిల్లి ‘టికెట్ లేకుండా’ రైల్లో ప్రయాణం చేస్తోంది. దాన్ని ఓ పోలీస్ ఆఫీసర్ చాలా జాగ్రత్తగా పట్టుకుని వెళ్లి ట్రైన్ లో నుంచి దించేసి బయట ప్లాట్ ఫాం మీద వదిలేశాడు.

news18-telugu
Updated: October 15, 2020, 6:24 PM IST
Viral Video: హైస్పీడ్ రైల్లో పిల్లి ఫ్రీగా తిరిగేస్తుంది.. అందుకని ఏం చేశారంటే
హైస్పీడ్ రైల్లో పిల్లి
  • Share this:
ఓ మంచి సరదా అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పిల్లి ‘టికెట్ లేకుండా’ రైల్లో ప్రయాణం చేస్తోంది. దాన్ని ఓ పోలీస్ ఆఫీసర్ చాలా జాగ్రత్తగా పట్టుకుని వెళ్లి ట్రైన్ లో నుంచి దించేసి బయట ప్లాట్ ఫాం మీద వదిలేశాడు. దీన్ని చూసి నెటిజన్లు నవ్వుల్లో మునిగితేలుతున్నారు. ఇంతకీ ఈ వీడియోను లిన్ మావో అనే యువతి తన ఫేస్ బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. తైవాన్ నుంచి ఈ వీడియో అప్ లోడ్ అయింది. ఓ హై స్పీడ్ ట్రైన్‌లో ఫ్రీగా ప్రయాణం చేస్తున్న పిల్లి కనిపించింది. ఆ పిల్లిని చక్కగా సూటు బూటు వేసుకున్న ఓ రైల్వే ఆఫీసర్ చాలా చక్కగా జాగ్రత్తగా పట్టుకున్నాడు. దాన్ని మెల్లగా నడిపించుకుంటూ రైల్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు. డైలీ మెయిల్ వెబ్ సైట్ కథనం ప్రకారం ఈ ఘటన మంగోలియాలో జరిగింది. ఉత్తర చైనాలోని స్వయం ప్రతిపత్తి గలిగిన ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు.

ఈ పిల్లిని పెంచుకునే వారు వదిలేసిందో, మర్చిపోయిందో కాదు. ఏదో రోడ్డు మీద తిరిగే పిల్లి. పొరపాటున రైలు ఎక్కేసింది. ఆ రైల్వే ఆఫీసర్ చూసేవరకు ఆ పిల్లి అలా అలా హై స్పీడ్ రైల్లో చక్కర్లు కొట్టేసింది. కానీ, అతడి కంట పడిన తర్వాత చక్కగా అతడే తీసుకుని వెళ్లి ప్లాట్ ఫాం మీద వదిలేశాడు.



ఈ సరదా వీడియో కొన్ని లక్షల వ్యూస్ సాధించింది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. జంతువులకు సంబంధించిన వీడియోలను చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటివి నెటిజన్లను చాలా బాగా ఆకర్షిస్తాయి. ఆ జంతువుల్లో ఉండే అమాయకత్వం, అవి చేసే సరదా పనులు వారిని ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. చాలా మంది చైనీస్ యూజర్లు ఈ ఫన్నీ పిల్లిని చూసి సరదా సరదా కామెంట్లు పెడుతున్నారు. అందులో ఓ యూజర్ ‘ఈసారి ప్రయాణించేటప్పుడు నీ టికెట్ నువ్వే కొనుక్కోవాలి.’ అని కామెంట్ చేశాడు. మరో యూజర్ మాత్రం ‘అయ్యో ఇప్పుడు ఆఫీసుకి నడుచుకుంటూ వెళ్లాలే’ అని బాధ పడి ఉంటుందంటూ కామెంట్ చేశాడు.

మరో వైరల్ వీడియోలో కుక్క ఏం చేసిందంటే..
కుక్కపై విపరీతమైన అభిమానం ఉన్న ఓ యువతికి ఆ కుక్కే షాక్ ఇచ్చింది. అసలేమైందంటే... ఆ యువతి... తన ఎంగేజ్‌మెంట్ డైమండ్ రింగ్‌ను వీడియో ద్వారా అందరికీ చూపించాలని అనుకుంది. చేతికి ఉన్న రింగును డైరెక్టుగా చూపిస్తే సరిపోయేది కానీ అలా చెయ్యలేదు. పక్కనే ఉన్న తన గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్క మూతిపై ఆ రింగును ఉంచింది. కదలకుండా ఉండు (స్టే) అని ఆర్డర్ వేసింది. ఆ కుక్క ఆదేశాన్ని పాటించింది. రింగును ఉంచగానే... ఆశ్చర్యపోతూ... కదలకుండా ఉండిపోయింది. పోనీలే రింగ్ అందరకీ బాగా కనిపిస్తుంది అనుకుంది ఆమె. తీరా చూస్తే... ఆ కుక్క... ఒక్క క్షణంలో ఆ రింగును మింగేసింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 15, 2020, 6:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading