CAT ATTACKS PILOT IN COCKPIT FORCES SUDAN FLIGHT EMERGENCY LANDING SK GH
Cat in Flight: విమానంలో పిల్లి బీభత్సం.. గాల్లో ఉండగా పైలట్‌పై దాడి.. ఆ తర్వాత ఏం జరిగింది?
ప్రతీకాత్మక చిత్రం
కాక్ పిట్లో ఏర్పడిన ఈ గందరగోళానికి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. పైలట్‌కు మరో దారి లేక ఖార్టూమ్‌కు తిరిగి రావడం తప్పనిసరి అయ్యింది.
ఓ పిల్లి విమానంలోకి చొరబడి రచ్చ రచ్చ చేసింది. కాక్‌పిట్‌లో పైలట్‌పై దాడి చేసి బీభత్సం సృష్టించింది. ఆ పిల్లి దెబ్బకు విమానాన్ని గాల్లోనే యూటర్న్ చేసి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సూడాన్ (Sudan)లో ఈ ఘటన జరిగింది. ఖతార్ రాజధాని అయిన దోహాకు వెళ్లవలసిన ఈ విమానం, షెడ్యూల్ ప్రకారమే బయలుదేరింది. కానీ పిల్లి చేసిన హడావిడికి సుడానీస్ రాజధాని నగరమైన ఖార్టూమ్‌లోనే మరలా దిగాల్సి వచ్చింది.ఈ సంఘటన బుధవారం జరిగింది.
సుడాన్ టార్కో విమానం ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. బయలు దేరిందే గానీ గమ్యానికి చేరుకోలేదు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పిల్లి పైలట్ పై దాడి చేయడం వల్ల అరగంట సేపు విమానం గాలిలోనే ఉండాల్సి వచ్చింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, స్టొవవే ఫిలైన్ (Stowaway Feline) జాతికి చెందిన ఈ పిల్లి విమానం బయలుదేరే ముందు ఎలా జొరబడిందో గానీ కాక్ పిట్ (Cockpit)లోకి ప్రవేశించింది. మొత్తానికి ఆ తర్వాత కాక్‌పిట్‌లో దీన్ని గమనించి, బయటకు పంపేయడానికి ప్రయత్నించినా ఫలితం లేదు. అది కెప్టెన్‌పై కూడా దాడి చేసింది.
కాక్ పిట్లో ఏర్పడిన ఈ గందరగోళానికి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. పైలట్‌కు మరో దారి లేక ఖార్టూమ్‌కు తిరిగి రావడం తప్పనిసరి అయ్యింది. అయితే ఇందులోని ప్రయాణికులంతా సురక్షింతంగానే ఉన్నారు. ఇంతకీ ఈ విమానంలోకి పిల్లి ఎలా వచ్చి, చేరిందో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. అయితే విమానం లోపల క్లీన్ చేసేటప్పుడో, లేదంటే ఇంజనీరింగ్ చెక్ చేసేటప్పుడో ఈ పిల్లి ఎవ్వరి కంటా పడకుండా ఆన్ బోర్డ్లోకి ప్రవేశించి ఉండొచ్చని పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయి.
అయితే ఈ విమానం ప్రయాణానికి ముందు రోజు రాత్రి అదే విమానాశ్రయంలో ఒక హ్యాంగర్ దగ్గర హాల్ట్‌లో ఉంది. ఇలా ఆగి ఉన్న సమయంలో ఈ పిల్లి విమానంలోకి వెళ్లి ఉంటుందనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా విమానంలో పిల్లి సృష్టించిన బీభత్సానికి పైలట్లతో పాటు ప్రయాణికులు, అధికారులు బెంబేలెత్తిపోయారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.