Home /News /trending /

CASTE DISCRIMINATION SHOULD END CONGRESS MLA EATS FOOD CHEWED BY DALIT MAN PVN

Viral Video : దళితుడి నోట్లోని ఆహారాన్ని తీసి తిన్న ఎమ్మెల్యే

దళిత వ్యక్తి నోట్లోని ఆహారాన్ని తిన్న ఎమ్మెల్యే

దళిత వ్యక్తి నోట్లోని ఆహారాన్ని తిన్న ఎమ్మెల్యే

 Congress MLA eats food chewed by Dalit man  :దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా కుల వివక్ష అనేది ఇంకా ఏదో ఒకరకంగా దేశంలో కొనసాగుతూనే ఉంది. గ్రామీణ ప్రాంతాలు.. మారుమూల ఏజెన్సీ ఏరియాల్లో అంతగా చదువురాని వారు కుల వివక్షకు గురవుతున్నారను కుంటే పొరపాటే.

ఇంకా చదవండి ...
Congress MLA eats food chewed by Dalit man  :దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా కుల వివక్ష అనేది ఇంకా ఏదో ఒకరకంగా దేశంలో కొనసాగుతూనే ఉంది. గ్రామీణ ప్రాంతాలు.. మారుమూల ఏజెన్సీ ఏరియాల్లో అంతగా చదువురాని వారు కుల వివక్షకు గురవుతున్నారను కుంటే పొరపాటే. ఎంతో చదువుకుని, పెద్ద సంస్థల్లో పనిచేస్తున్న వారికి కూడా కుల వివక్ష ఎదురవుతోంది. ఇది వెనుకబడిన వర్గాల పాలిట శాపంగా మారుతోంది. సప్త సముద్రాలు దాటి అమెరికా చేరుకున్నా, అక్కడా కులవివక్ష ఎదుర్కొంటున్నారు కొందరు. అయితే కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ వింత ప్రయత్నం చేశారు. అందరూ ఒక్కటేనని చాటిచెప్పే ప్రయత్నంలో భాగంగా ఎమ్మెల్యే జమీర్ ... దళితుడి నోటిలో ఆహారాన్ని తిని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు.

చామరాజపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో స్వామి నారాయణ్ అనే దళిత వ్యక్తికి స్వయంగా అన్నం తినిపించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేకు స్వామి నారాయ‌ణ్‌ తిరిగి అన్నం తినిపించబోతుండగా.. ఆయన అడ్డుకున్నారు. చేతిలో ఉన్న అన్నం ముద్ద వ‌ద్ద‌ని, నోట్లో ఉన్న ఆహారాన్ని తీసి తనకు తినిపించాలని స్వామి నారాయ‌ణ్‌ ని ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ కోరారు. ఆయన చెప్పినట్టుగానే స్వామి నారాయణ్ తన నోట్లో దీంతో సగం నమిలిన ఆహారాన్ని తీసి ఎమ్మెల్యేకి తినిపించారు. దీంతో అక్క‌డున్న వారంతా చ‌ప్ప‌ట్లు కొడుతూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.


ALSO READ Accident : లారీ బోల్తా..8మంది వలస కూలీలు దుర్మరణం

అంబేద్కర్ జయంతి మరియు ఈద్‌లను కలిసి జరుపుకోవడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. వర్గాల మధ్య అంతరాలను సృష్టించేందుకు అనేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అందుకే నేను అలాంటి పని చేశానని జమీర్ ఖాన్ అన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జమీర్ అహ్మద్ ఖాన్ గత ప్రభుత్వంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Caste deportation, Congress mla, Karnataka, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు