చెప్పుల ప్రమోషన్ కోసం..దుర్గమ్మలా గెటప్.. మరో వివాదంలో పాప్ సింగర్

రీబాక్ కంపెనీకి చెందిన స్నీకర్స్ (Sneakers) ను ప్రమోట్ చేయడంలో భాగంగా ఇలాంటి గెటప్ లో కనిపించిన కార్డి, తన చేతుల్లో చెప్పులు పట్టుకుని పోజులిచ్చారు.

news18-telugu
Updated: November 13, 2020, 11:35 AM IST
చెప్పుల ప్రమోషన్ కోసం..దుర్గమ్మలా గెటప్.. మరో వివాదంలో పాప్ సింగర్
కార్డి బీ (Cardi B)
  • Share this:
అమెరికన్ ర్యాపర్ (American rapper) కార్డి బీ (Cardi B) తాను చేసిన పనికి తీరిగ్గా క్షమాపణ చెప్పారు. ఓ కవర్ స్టోరీ షూట్ కోసం కార్డి దుర్గమ్మ అవతారంలో (Durgamma getup) మేకప్ చేసుకుని, ఫొటోలకు పోజులిచ్చారు. 28 ఏళ్ల ర్యాపర్ ఓ చెప్పుల కంపెనీ మ్యాగజైన్ కోసం ఇలా కనిపించడం భారతీయుల మనోభావాలను దెబ్బతీసిందనే విమర్శలకు దారితీసింది. రీబాక్ కంపెనీకి చెందిన స్నీకర్స్ (Sneakers) ను ప్రమోట్ చేయడంలో భాగంగా ఇలాంటి గెటప్ లో కనిపించిన కార్డి, తన చేతుల్లో చెప్పులు పట్టుకుని పోజులిచ్చారు. కార్డి చేసిన పనిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు రాగా ఓ దశలో ట్రోలింగ్ భరించలేని ర్యాపర్ చివరికి దిగిరాక తప్పలేదు. భారతీయ దేవీ దేవతలను ఇలా అవమానించడం తగదని సోషల్ మీడియాలో ఇండియన్ యూజర్స్ (Indian users) కార్డికి గట్టిగా క్లాస్ పీకారు. దీంతో ఆమె ఇన్ స్టాగ్రాంలో భారతీయ అభిమానులకు సారీ చెప్పక తప్పలేదు.

వీడియో మెసేజ్

ఈమేరకు వీడియో మెసేజ్ రిలీజ్ చేసిన సింగర్.. “ ఓ దేవతను పోలినట్టు నేను కనిపించబోతున్నట్టు ..ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు క్రియేటివ్స్ టీమ్ నాకు చెప్పింది. ఇందులో భాగంగా నేను ఓ శక్తి స్వరూపిణిగా, మహిళా శక్తికి, స్వేచ్ఛకు గుర్తుగా ఉండేలా ఈ అవతారం ఉంటుందని నాకు వివరించారు.. ఈ విషయాలను నేను పూర్తిగా సమర్థిస్తా అందుకే ఇలా కనిపించేందుకు నేను కూడా ఆసక్తి చూపి అంగీకరించా ” అంటూ వివరించారు. ఎవరి సంస్కృతి, సంప్రదాయాలు, మనోభావాలను కించపరచడం తన ఉద్దేశం కాదని కార్డి తన వీడియో మెసేజ్ లో వివరించే ప్రయత్నం చేశారు. కాగా “నేను చేస్తున్న అంశంపై మరింత లోతుగా పరిశోధన, అధ్యయనం చేసి ఉంటే బాగుండేది, ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం జరిగిపోయిన దాన్ని నేను మార్చలేను కానీ.. భవిష్యత్తులో మాత్రం పరిశీలించి మాత్రమే ఇలాంటివి చేస్తా”నని చెప్పడం కొసమెరుపు.

కేరాఫ్ కాంట్రవర్సీస్
అమెరికన్ పాప్ సింగర్ (pop singer) కార్డి బి కాంట్రవర్సీలకు (controversies) కేరాఫ్ అడ్రస్. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే కార్డి.. ఈ సారి భారతీయుల మనోభావాలు కించపరిచేలా మరో కాంట్రవర్సీని సృష్టించారు. చెప్పులు చేతబట్టుకున్న దుర్గా మాత గెటప్ లో ఉన్న తన ఫొటో షేర్ చేసి, తద్వారా తన స్నీకర్ కలెక్షన్‌ను ప్రమోట్ చేసుకున్న కార్డి ఫొటో క్షణాల్లో వైరల్ అయింది. ఎనిమిది చేతులతో కనిపిస్తూనే చేతిలో షూస్ పట్టుకుని ఫొటోకు పోజిచ్చారు. గతంలో పలువురు పాప్ స్టార్స్ భారతీయ సంప్రదాయలను నవ్వులపాలు చేసే పనులు చేయగా, తాజాగా కార్డి కూడా ఆ జాబితాలో చేరారు.

అమ్మవారి పేరుతో వేషాలా?
ఈ ఫొటోపై ఇండియన్స్ మండిపడుతున్నారు. అమ్మవారికి అంకితం అంటూ ఇలాంటి పిచ్చిపనులు మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. దుర్గమ్మ గురించి తెలిసే ఇలా చేశావా? అని ఫైర్ అవుతున్నారు. నీ బ్రాండ్ ప్రమోట్ చేసుకునేందుకు భారతీయులను కించపరుస్తావా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్గాదేవి ఎప్పుడూ ఇలాంటి శరీరంతో కనిపించలేదని, ఆలయంలోకి చెప్పులతో వెళ్లడమే మేము తప్పుగా భావిస్తామని.. అలాంటిది కార్డి బి తనను తాను దుర్గామాతగా అభివర్ణించుకుంటూ చేతిలో షూ పట్టుకుని ఉందని మండిపడుతున్నారు. దుర్గామాత ఎప్పుడూ సౌందర్యంగా కనిపించలేదని, ఇది నివాళి కాదు అగౌరవపరచడమే అవుతుందని నెటిజన్లు గడ్డిపెడుతున్నారు.

డ్రగ్స్-దోపిడీలు
డ్రగ్స్ (drugs) , దోపిడీలతో తన ఇమేజ్ ను నిర్మించుకున్న కార్డికి వివాదాలతో సహజీవనం చేయడం బాగా తెలుసు. చాలామంది వ్యక్తులకు మత్తుమందు ఇచ్చి తాను వారిని నిలువు దోపిడీ చేసినట్టు బాహాటంగానే ప్రకటించిన ఈ పాప్ సింగర్ పబ్లిసిటీ (publicity) కోసం ఏమైనా చేసేందుకు తెగిస్తారని పేరుగాంచారు. గ్రామీ అవార్డు అందుకున్న కార్డి గతంలో స్ట్రిప్పర్(stripper) గా పనిచేసినట్టు, తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డవారిని అడ్డంగా దోచుకున్నట్టు గర్వంగా చెప్పుకోవడం విశేషం. మూడేళ్ల క్రితం ఇలాంటి ఎన్నో సంచలన విషయాలను వెల్లడిస్తూ, తాను నిషేధిత డ్రగ్స్ కూడా అమ్మినట్టు వెల్లడించి షాక్ ఇచ్చారు. బతుకు తెరువు కోసం ఎన్నో మోసాలకు పాల్పడినట్టు ఇదంతా తాను పాప్యులర్ కాకముందు చేసిన పనులని, తాను వాటిని సమర్థించుకోవడం లేదని కూడా ఆమె చెప్పుకురావడం అప్పట్లో సెన్సేషన్ గా మారింది. 'ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ' (invasion of privacy) అనే తన తొలి ఆల్బంతోనే గ్రామీ అవార్డు (Grammy award) సొంతం చేసుకున్న తొలి సోలో వుమెన్ ర్యాపర్ (woman rapper) గా ఆమె రికార్డు సృష్టించారు.
Published by: Sumanth Kanukula
First published: November 13, 2020, 11:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading