పెట్రోల్ బంక్‌‌లో కారు చోరీకి వచ్చిన దొంగలు.. అలా జరగడంతో పరుగులు పెట్టారు.. Video చూస్తే వావ్ అనాల్సిందే..

(Image-Twitter)

కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. అందుకు రకరకాల కారణాలు ఉంటాయి. తాజాగా ఓ పెట్రోల్ బంక్‌లో చోటుచేసుకున్న ఘటన వైరల్‌గా మారింది. అందులో ఉన్న విశేషమేమిటో మీరు చూసేయండి..

 • Share this:
  దొంగలు ఎప్పుడు ఎలా నుంచి వస్తారో తెలియదు. అందుకే బయట ఉన్న సమయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఖరీదైన వస్తువులు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అయితే కొన్నిసార్లు దొంగలు చాలా తెలివిగా దోపిడికి ప్లాన్ చేస్తుంటారు.. కానీ సమయస్పూర్తితో వ్యవహరిస్తే వారిని పారిపోయేలా చేయడం పెద్ద పనేం కాదు. ఇలాంటి ఘటన ఓ పెట్రోల్ బంక్ వద్ద చోటుచేసుకుంది. చోరీకి వచ్చిన దొంగలను.. సింపుల్ ట్రిక్‌తో అక్కడున్న వ్యక్తి పరుగులు పెట్టేలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  ఆ వీడియోలో ఓ పెట్రోల్ బంక్‌లో ఓ వ్యక్తి కారులో ఇంధనం నింపుతున్నాడు. అప్పుడే అక్కడికి ఓ పెద్ద వాహనంలో కొందరు వ్యక్తులు వచ్చారు. వారు వాహనాన్ని ఆపి వెంటనే కిందకు దిగి కారును దొంగిలించేందుకు యత్నించారు. వారు ముఖాలకు గుడ్డలు కూడా కట్టుకుని ఉన్నారు. అయితే కారులో ఇంధనం నింపుతున్న వ్యక్తి.. ఏ మాత్రం భయపడకుండా.. జస్ట్ సింపుల్‌గా తన చేతిలో ఉన్న పెట్రోల్ పైపును వారివైపుకు తిప్పాడు.

  దీంతో పెట్రోల్ మీద పడటంతో భయపడిపోయిన దొంగులు.. తిరిగి అదే వాహనంలోకి ఎక్కి అక్కడి నుంచి పారిపోయారు. @RexChapman ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 5.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన చాలా మంది నవ్వుకుంటున్నారు. పెట్రోల్ నింపుతున్న వ్యక్తి సమయస్పూర్తిని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా దొంగలపట్ల అప్రమత్తంగా ఉండటమే కాకుండా.. వారు ఎదురైనప్పుడు కాసింత తెలివిగా వ్యవహరించాలని ఈ వీడియో చూసినవారు అంటున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: