ఆ పేరు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే: ధోని.. అభిమానులకు రుణపడి ఉంటా..

తాను ఆటోగ్రాఫ్‌ చేసిన టెన్నిస్ బంతుల్ని ధోనీనే స్వయంగా బ్యాడ్మింటన్‌ బ్యాట్‌తో ప్రేక్షకుల్లోకి కొట్టడం విశేషం. ఈ సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సీఎస్‌కే పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది.

news18-telugu
Updated: May 2, 2019, 5:50 PM IST
ఆ పేరు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే: ధోని.. అభిమానులకు రుణపడి ఉంటా..
మహేంద్ర సింగ్ ధోని (ఫైల్)
  • Share this:
మహేంద్ర సింగ్ ధోని.. భారత క్రికెట్‌కు ‘కూల్’ నాయకుడు. ఎన్నో చరిత్రాత్మక విజయాలు అందించి తనదైన ముద్ర వేసిన లీడర్.. ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. భద్రతా కంచెలు దూకి దాటుకొని వచ్చి కెప్టెన్ కూల్ కాళ్లకు నమస్కరించి.. మా జీవితాల్లో ఇదో అత్యద్భుత ఘట్టం అని ఫీలైపోయే వారెందరో. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకొని వచ్చిన ప్రతీ ఒక్కరితో కచ్చితంగా కరచాలనం చేస్తాడు. అంతేనా.. గ్రౌండ్‌లో వారికి దొరక్కుండా పరుగెడుతూ ఆటపట్టిస్తాడు. అందుకే అభిమానులకు ‘ధోని’ ఒక దేవుడు. టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి అండగా ఉంటూ, బౌలర్లకు సలహాలు ఇస్తూ, వికెట్ల వెనుక ప్రత్యర్థిని కట్టడి చేస్తూ.. గొప్ప మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్న ధోనికి ఎన్నో నిక్ నేమ్‌లు ఉన్నాయి. మహి, ఎమ్ఎస్‌డీ, ధోని, ఎంఎస్.. ఇలా చాలా పేర్లే ఉన్నాయి. ఇప్పుడు ఆ పేర్ల జాబితాలో మరో పేరు వచ్చి చేరింది. అదే.. ‘తాలా’.

ప్రస్తుత ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజయవంతంగా ప్లేఆఫ్స్‌కు చేర్చి.. అన్ని సార్లు చెన్నై టీంను ప్లేఆఫ్స్‌కు చేర్చిన నాయకుడిగా చరిత్ర సృష్టించారు. అయితే, ధోనిని సీఎస్‌కే అభిమానులు ‘తాలా’ అని ముద్దుగా పిలుచుకుంటారు. తాలా అంటే తమిళంలో నాయకుడు అని అర్థం. ఎంతో అభిమానం, ప్రేమ, గౌరవంతో పిలుస్తున్నందున ఆ పేరు అంటే ఎప్పటికీ తనకు ప్రత్యేకమేనని అంటున్నాడు ధోని.

బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లోనే 44 పరుగులు చేసిన ధోనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత జట్టు విజయం గురించి మాట్లాడుతూ ఎమోషనల్‌ స్పీచ్‌ ఇచ్చారు. ‘తాలా నాకు చాలా ప్రత్యేకమైన నిక్‌ నేమ్‌. తమిళనాడులో ఎక్కడికి వెళ్లినా నన్ను ధోని అని కాకుండా ‘తాలా’ అని పిలుస్తారు. సీఎస్‌కే ఫ్యాన్స్‌ నన్ను ఆ పేరుతో పిలవడం నా అదృష్టం. నా ముద్దుపేర్లలో ‘తాలా’ వెరీ స్పెషల్‌. సీఎస్‌కే ఫ్యాన్స్‌ నాకు, మా టీమ్‌కు ఎప్పుడూ మద్దతిచ్చారు. వారిని మరిచిపోను’ అని ధోని అన్నారు.

కాగా, తాను ఆటోగ్రాఫ్‌ చేసిన టెన్నిస్ బంతుల్ని ధోనీనే స్వయంగా బ్యాడ్మింటన్‌ బ్యాట్‌తో ప్రేక్షకుల్లోకి కొట్టడం విశేషం. ఈ సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సీఎస్‌కే పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో తన చివరి లీగ్ మ్యాచ్‌ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆడనుంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 2, 2019, 5:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading