తాళి కట్టిన భర్త మెడలో కుక్క గొలుసు కట్టి.. వీధుల్లో తిప్పిన అభినవ సతీమణి..

తన భర్తను కుక్క కంటే హీనంగా.. కొంచెం కూడా మానవత్వం అనేదే లేకుండా చేసిందో భార్య. కట్టుకున్న మొగుడు అని కూడా చూడకుండా.. భర్త మెడకు గొలుసు కట్టి.. అతడిని మెకాళ్లు, చేతుల మీద నడిపించి.. కొంతదూరం పాటు పుర వీధుల్లో తిప్పిందా అభినవ సతీమణి.

 • News18
 • Last Updated :
 • Share this:
  ఇది పురుషాధిక్య సమాజమని... భర్తల చేతిలో భార్యలు నలిగిపోతున్నారని.. మహిళలు అడుగడుగునా అణచివేయబడుతున్నారని టీవీ షోలలో.. పత్రికలలో మహిళా సంఘాల నాయకులు వాదిస్తుంటారు. అందులో నిజానిజాల సంగతి కాసేపు పక్కనపెడితే.. ఈ ఫోటో చూడండి.. పైన రాసిందంతా తిరిగి రాసి చదువుకోవాలేమో..! తన భర్తను కుక్క కంటే హీనంగా.. కొంచెం కూడా మానవత్వం అనేదే లేకుండా చేసిందో భార్య. కట్టుకున్న మొగుడు అని కూడా చూడకుండా.. భర్త మెడకు గొలుసు కట్టి.. అతడిని మెకాళ్లు, చేతుల మీద నడిపించి.. కొంతదూరం పాటు పుర వీధుల్లో తిప్పిందా అభినవ సతీమణి. ఆమె ఎందుకలా చేసిందది..? భర్త మెడలో కుక్క గొలుసు వేయడానికి గల కారణాలేంటి..?

  కెనడాలోని క్యూబెక్ లో చోటు చేసుకుందీ ఘటన. క్యూబెక్ పట్టణానికి చెందిన ఒక మహిళ.. తన భర్త మెడకు కుక్క గొలుసు కట్టి.. వీధుల్లో అతడితో షికారుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు మళ్లీ లాక్డౌన్ వైపునకు వెళ్లాయి. రాత్రి పూట కట్టుదిట్టమైన కర్ఫ్యూ విధిస్తున్నారు. కెనడాలో కూడా రాత్రి 8 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

  రాత్రి పూట 8 దాటిన తర్వాత గుంపులుగా వెళ్లడానికి వీల్లేదు. ఒక్క వ్యక్తి మాత్రమే ప్రయాణించాలి. ఒకవేళ వస్తే వారి పెంపుడు కుక్కతో రావొచ్చు. ఈ సడలింపునే ఆ భార్య ఆయుధంగా చేసుకుంది. భర్తను పెంపుడు కుక్కగా చేసుకుంది. అతడి మెడకు కుక్క గొలుసు కట్టి రాత్రి పూట వీధుల్లోకి షికారుకు వచ్చింది. ఆమెతో పాటు బయల్దేరిన ఆ భర్త.. రెండు చేతులు కిందకు పెట్టి, మెకాళ్లపై నడుస్తూ..నానా అవస్థలు పడ్డాడు. వాళ్ల షికారు కొద్దిదూరం గడిచాక.. అక్కడికి పోలీసులు వచ్చారు. ఆ దృశ్యాన్ని చూసి వారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. విషయం ఏంటని ఆరా తీయగా ఆ భార్య చావు కబురు చల్లగా చెప్పింది. ఇదంతా విన్న పోలీసులు.. భార్యాభర్తలకు చెరో రూ. 1,500 జరిమానా విధించి ఇంటికి పంపారు. అదండీ కథ...!!
  Published by:Srinivas Munigala
  First published: