హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

జూమ్ మీటింగ్‌లో నగ్నంగా కనిపించిన ఎంపీ.. అందరూ షాక్.. ఫొటో ఎలా లీక్ అయింది?

జూమ్ మీటింగ్‌లో నగ్నంగా కనిపించిన ఎంపీ.. అందరూ షాక్.. ఫొటో ఎలా లీక్ అయింది?

 ఎంపీ నగ్నంగా ఉన్న ఫొటో బయటకు రావడంపై దుమారం రేగుతోంది. ఉన్నదంతా ఎంపీలే.. మరి ఆ స్క్రీన్ షాట్ తీసి మీడియాకు ఎవరు పంపించారో అర్ధం కావడం లేదు. హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుల్లో ఒకరు ఈ పని చేసినట్లు అనుమానిస్తున్నారు.

ఎంపీ నగ్నంగా ఉన్న ఫొటో బయటకు రావడంపై దుమారం రేగుతోంది. ఉన్నదంతా ఎంపీలే.. మరి ఆ స్క్రీన్ షాట్ తీసి మీడియాకు ఎవరు పంపించారో అర్ధం కావడం లేదు. హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుల్లో ఒకరు ఈ పని చేసినట్లు అనుమానిస్తున్నారు.

ఎంపీ నగ్నంగా ఉన్న ఫొటో బయటకు రావడంపై దుమారం రేగుతోంది. ఉన్నదంతా ఎంపీలే.. మరి ఆ స్క్రీన్ షాట్ తీసి మీడియాకు ఎవరు పంపించారో అర్ధం కావడం లేదు. హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుల్లో ఒకరు ఈ పని చేసినట్లు అనుమానిస్తున్నారు.

  కరోనా కాలంలో లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. రాజకీయ నేతలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యమైన సమావేశాలు ఉంటే వీడియో కాన్ఫరెన్స్‌లోనే మాట్లాడుతున్నారు. జూమ్, గూగుల్ మీట్ ద్వారా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. ఐతే ఈ క్రమంలో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. మీటింగ్ మధ్యలో పిల్లలు రావడం, భార్య రొమాన్స్ చేయడం, నగ్నంగా కనిపించడం వంటి.. ఘటనలు చాలా వరకు బయటకు వచ్చాయి. తాజాగా కెనడాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఎంపీలంతా జూమ్ మీటింగ్‌లో మాట్లాడుతున్న సమయంలో ఓ ఎంపీ నగ్నంగా కనిపించాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  విలియమ్ ఆమోస్  హౌస్ ఆఫ్ కామన్స్‌లో క్యూబెక్ డిస్ట్రిక్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బుధవారం హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుల వర్చువల్ సమావేశం జరిగింది. అందరూ జూమ్ కాల్ ద్వారా కనెక్ట్ అయ్యారు. ఆ సమయంలో విలియమ్ ఆమోస్ నగ్నంగా కనిపించారు. తన డెస్క్ వెనకాల కెనడా, క్యూబెక్ జెండాల మధ్యలో ఆయన ఉన్నారు. ఆ దృశ్యాలను చూసి సహచర ఎంపీలు షాక్ తిన్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ విలియమ్ ఆమోస్.. వెంటనే కెమెరా ఆఫ్ చేశారు. ఆ తర్వాత దుస్తులు ధరించి తిరిగి సమావేశంలో పాల్గొన్నారు. జరిగిన ఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

  ''అది దురదృష్టవశాత్తు జరిగిన పొరపాటు. జాగింగ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకుంటున్న సమయంలో అనుకోకుండా కెమెరా స్విచ్ ఆన్ అయింది. హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నా. ఈ తప్పు నా వల్లే జరిగింది. మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటా. '' అని విలియమ్ ఆమోస్ పేర్కొన్నారు.

  ఐతే ఎంపీ నగ్నంగా ఉన్న ఫొటో బయటకు రావడంపై దుమారం రేగుతోంది. ఉన్నదంతా ఎంపీలే.. మరి ఆ స్క్రీన్ షాట్ తీసి మీడియాకు ఎవరు పంపించారో అర్ధం కావడం లేదు. హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుల్లో ఒకరు ఈ పని చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీల నేతలు మాత్రం ఎంపీ తీరుపై మండిపడుతున్నారు. సమావేశం సమయంలో జాకెట్, టై, షర్ట్, ప్యాంట్ ధరించాలన్న స్పృహ లేకుంటే ఎలా.. అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదైమైనా జూమ్ మీటింగ్‌లో ఎంపీ నగ్నంగా కనిపించిన ఘటన కెనాడాలో హాట్ టాపిక్‌గా మారింది.

  ఇటీవల సౌతాఫ్రికాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. జూమ్ మీటింగ్‌లో ఉన్న సమయంలో ఓ ప్రజాప్రతినిధి భార్య నగ్నంగా నడుచుకుంటూ వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. జూమ్‌లో నేషనల్ హౌస్ ఆఫ్ ట్రెడిషనల్ లీడర్స్ అంతా కరోనా గురించి చర్చించుకుంటున్న సమయంలో..  జోలైల్ ఎండీవు భార్య సడెన్‌గా ప్రత్యక్షమయ్యారు. ఆయన వెనకాల నుంచి ఆమె నగ్నంగా నడుచుకుంటూ వచ్చారు. ఆ దృశ్యాన్ని చూసి నేతలంతా షాక్ తిన్నారు. పక్కను నవ్వారు. జోలైల్ ఎండీవుకు ఏం చేయాలో అర్ధం కాలేదు. పరువు తీసింది అన్నట్టుగా.. ముఖానికి చేతులు అడ్డంపెట్టుకున్నారు. కరోనా తర్వాత ఇలాంటి చాలానే జరుగుతున్నాయి.

  First published:

  Tags: Canada

  ఉత్తమ కథలు