హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video : ఏం డెడికేషన్..లైవ్ లో అడ్డొచ్చిన ఈగను మింగేసిన టీవీ యాంకర్

Viral Video : ఏం డెడికేషన్..లైవ్ లో అడ్డొచ్చిన ఈగను మింగేసిన టీవీ యాంకర్

ఈగను మింగిన టీవీ యాంకర్

ఈగను మింగిన టీవీ యాంకర్

Anchor Swallow Fly On Live TV : టీవీ యాంకర్(TV Anchor) ఉద్యోగం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు .ప్రత్యక్ష ప్రసారాల కోసం ఎంతో సన్నద్ధతతో ఉండాలి. విషయాలపై అవగాహన ఉండాలి. సందర్భానుగుణంగా స్పందించే తత్వం ఉండాలి. లైవ్‌ టెలివిజన్‌(Live TV) లో లక్షల మంది ప్రజలు చూస్తుంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Anchor Swallow Fly On Live TV : టీవీ యాంకర్(TV Anchor) ఉద్యోగం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు .ప్రత్యక్ష ప్రసారాల కోసం ఎంతో సన్నద్ధతతో ఉండాలి. విషయాలపై అవగాహన ఉండాలి. సందర్భానుగుణంగా స్పందించే తత్వం ఉండాలి. లైవ్‌ టెలివిజన్‌(Live TV) లో లక్షల మంది ప్రజలు చూస్తుంటారు. కొన్నిసార్లు యాంకర్లు తడబడతారు. తాము లైవ్‌లో ఉన్నామనే సంగతి మర్చిపోతారు. అయితే తాజాగా ఓ యాంకర్‌ లైవ్‌ లో వార్తలు చదువుతుండగా ఆమెకు ఒక అసాధారణమైన సంఘటన ఎదురైంది. దాన్ని ఆమె ఏమాత్రం తడబడకుండా చాకచక్యంగా ఎదుక్కొని బులిటెన్‌ కంప్లీట్‌ చేసింది. కానీ లైవ్‌లో ఆ యాంకర్ కి ఎదురైన ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి నోటిలోకి ఈగ లేదా చిన్న కీటకం ప్రవేశించడం చాలా సాధారణం. ఇది మనలో చాలా మందికి జరిగే ఉంటుంది. అయితే తమాషా ఏమిటంటే ఈ సంఘటన టీవీలో ప్రత్యక్ష ప్రసారం కావడం. ఇటీవల కెనడా(Canada)కు చెందిన గ్లోబల్ న్యూస్ యాంకర్ ఫరా నాజర్(Farah Nasser) లైవ్ బులిటెన్ చదువుతోంది. పాకిస్తాన్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాలకు అక్కడి ప్రజలు ఎంత అవస్త పడుతున్నారో.. వరదలు ఎలా ముంచెత్తుతున్నాయో ఫరా నాసర్ లైవ్ లో వివరిస్తున్నారు" పాకిస్తాన్ ఇంతకు ముందెన్నడూ ఇలాంటి రుతుపవనాలను చూడలేదు. అక్కడ 8 వారాలుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు"అని ఫరా వార్తలు చదువుతుండగా అకస్మాత్తుగా ఒక ఈగ గుయ్ గుయ్ మంటూ ఎగురుతూ వచ్చి ఆమె నోటిలోకి ప్రవేశించింది. ఆ సమయంలో బ్రేక్ తీసుకోవడానికి కుదరదు. దీంతో ఫరా నాజర్ ఏకంగా ఆ ఈగను మింగేసింది(Female Anchor Swallowed a Fly On Air Video). న్యూస్ చెప్పడం మాత్రం ఆపలేదు. ఈగను మింగి గొంతు సవరించుకుని ఫరా మళ్ళీ వార్తలు చదవడం ప్రారంభించింది.


OMG : అమెరికాలో విమానం క్రాష్ ల్యాండ్

దీనికి సంబంధించిన వీడియోని ఫరా నాజర్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. "ఈ రోజుల్లో మనమందరం నవ్వాల్సిన అవసరం ఉన్నందున నేను ఈ వీడియోను భాగస్వామ్యం చేస్తున్నాను.ఈ రోజు గాలిలో నేను ఈగను మింగాను"అని పేర్కొంటూ ఆ వీడియోని ఫరా నాజర్ షేర్ చేయగా అది కాస్తా తెగ వైరల్ అవుతోంది. ఫరా డెడికేషన్ నెటిజన్లకు విపరీతంగా నచ్చింది. వర్క్ పట్ల ఆమెకు ఉన్న డెడికేషన్ సూపర్ అంటూ కొనియాడుతున్నారు.

First published:

Tags: Canada, Viral Video

ఉత్తమ కథలు