ఎడారిలో 100 కిలో మీటర్లు నడిచి.. పాతయాజమాని దగ్గరకు వచ్చిన ఒంటె..

దాదాపు వారం పది రోజుల వరకు పాత యాజమానికి ఒంటెను అమ్మిన విషయం నుంచి తేరుకోలేకపోయాడు. మెల్లగా ఆ బాధ నుంచి తేరుకుని తన పనిలో తాను నిమగ్నమైపోయారు.

news18-telugu
Updated: July 24, 2020, 3:19 PM IST
ఎడారిలో 100 కిలో మీటర్లు నడిచి.. పాతయాజమాని దగ్గరకు వచ్చిన ఒంటె..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జంతువులు.. వీటిని పట్టణ ప్రాంతాల్లోనైతే కుక్కనో.. పిల్లినో పెంచుకుంటారు. గ్రామీణ ప్రాంతంలో జంతువులనేవి వారి జీవితాల్లో భాగమైపోతాయి. ప్రత్యేకంగా ఆ జంతువులను వారేం పెంచుకోరు. మాములుగా వ్యవసాయ పనులకో.. వ్యక్తిగత పనులకో వాటిని వినియోగించేందుకు పెంచుతుంటారు. అలా ఆ జంతువులు కాస్త ఇంటిలో సభ్యుడిగా కలిసిపోతాయి. వాటితో ఇంటి కుటుంబ సభ్యులకు ఎనలేని బంధం ఏర్పడింది. సాధారణంగా ఇలాంటివి కుక్క విషయంలో చదివి ఉంటాం. కానీ ఇప్పడు చదివేది మాత్రం ఒంటె గురించి. అవును. ఓ యాజమాని ఒంటెను ఏళ్ల తరబడి ప్రేమగా పెంచుకున్నాడు. ఆ ఒంటె యాజమానికి పనుల్లో సాయపడుతూ వస్తోంది. అయితే కాలం గడిచింది.. ఒంటె ముసలిదైపోయింది. ఆ యజమానికి అది భారంగా మారింది. దీంతో అతడు ఒంటెను అమ్మాలని నిశ్చయించాడు. వేరొకరికి ఒంటెను అమ్మేశాడు.

ఒంటెను కొనుగోలు చేసిన కొత్త యాజమాన్ని దాన్ని తన ఇంటికి పట్టుకెళ్లిపోయాడు. పాత యాజమాని ఒంటెను అమ్మిన విషయం కూడా మర్చిపోయే స్థితికి వచ్చాడు. కానీ ఆ ఒంటె మాత్రం తన పాత యాజమానిని మర్చిపోలేకపోయింది. అంతే దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఏడురోజుల పాటు ఏడారిలో నడిచి పాత యాజమాని దగ్గరకు చేరింది. ఈ ఘటన చైనాలో జరగ్గా.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర చైనా ప్రాంతానికి చెందిన ఓ ఇద్దరు దంపతులు ఉన్నారు. వారు ఓ ఒంటెను ప్రేమగా పెంచుకోవడం.. తమ పనులకు వాడుకోవడం చేస్తున్నారు.

అయితే కాలం గడిచి.. ఆ ఒంటె కాస్త ముసలిదైపోయింది. దీంతో అది ఆ దంపతులకు ఎందుకు ఉపయోగపడకపోనూ.. దాని పోషణ వారికి భారంగా మారింది. దీంతో ఆ దంపతులు ఒంటెను అమ్మాలని నిశ్చయించుకున్నారు. 2019, అక్టోబరులో ఓ రోజు ఆ ఒంటెను తీసుకుని పశువుల సంతకు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి ఆ ఒంటెను కొనుగోలు చేశాడు. అనంతరం కొత్త యాజమాని ఒంటెను తీసుకుని దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోని తన ప్రాంతానికి తీసుకెళ్లాడు. పాత యాజమానికి ప్రేమగా పెంచుకోవడం.. అది ఇన్నాళ్లు తనకు సేవ చేసి పెట్టినందుకు అమ్మడం ఇష్టం లేదు.

కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మేశాడు. దాదాపు వారం పది రోజుల వరకు పాత యాజమానికి ఒంటెను అమ్మిన విషయం నుంచి తేరుకోలేకపోయాడు. మెల్లగా ఆ బాధ నుంచి తేరుకుని తన పనిలో తాను నిమగ్నమైపోయారు. అయితే కొత్త యాజమాని దగ్గరకు వెళ్లిన ఒంటె.. పాత యాజమానిపైనే బెంగ పెట్టుకుంది. తిండి సైతం సరిగా తినేదికాదు. మనుషుల్లాగే కళ్ల వెంట నీరు కారుస్తూ దిగాలుగా ఉండేది. సరిగ్గా ఒంటెను అమ్మిన 8 నెలల తర్వాత పాత యాజమానికి వెతుక్కుంటూ బయలుదేరింది. ఏడారిలో ఏడు రోజుల పాటు 100 కిలోమీటర్లు ప్రయాణించి పాత యాజమాని దంపతులను చేరుకుంది.

ఒళ్లంతా గాయాలతో ఉన్న ఆ ఒంటెను చూసిన దంపతులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అయితే కొత్త యాజమాని తాను కొనుగోలు చేసిన ఒంటె కన్పించకపోయేసరికి.. దాని కోసం వెతకగా పాత యాజమాని దగ్గరకు చేరుకుందని తెలిసింది. దీంతో కొత్త యాజమాని నేరుగా తనకు ఒంటె అమ్మిన పాత యాజమాని దగ్గరకు వెళ్లాడు. అయితే ఈ ఒంటెకు తమపై ఉన్న ప్రేమను మేం వదులుకోలేమని, బదులుగా వేరో ఆడ ఒంటెను ఇస్తామని చెప్పారు. దానికి కొత్త యాజమాని అంగీకరించడంతో కథ సుఖాంతమయ్యింది. ఎప్పటిలాగానే ఒంటె పాత యజమాని దగ్గరే సంతోషంగా ఉండసాగింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
Published by: Narsimha Badhini
First published: July 24, 2020, 3:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading