Viral Video : తనతో సెల్ఫీ తీసుకుందామనుకున్న మహిళకు తిక్క కుదిర్చిన ఒంటె..

Photo Credit : YouTube

Viral Video : చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. మనల్ని మనమే మర్చిపోతాం. ఇక సెల్ఫీలు, సెల్ఫీ వీడియోలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్ ఎక్కడిపడితే అక్కడ తీసేసి.. వీడియోలు తీసేయడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది.

  • Share this:
    చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. మనల్ని మనమే మర్చిపోతాం. ఇక సెల్ఫీలు, సెల్ఫీ వీడియోలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్ ఎక్కడిపడితే అక్కడ తీసేసి.. వీడియోలు తీసేయడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇక చాలా మందికి జంతువుల ఫోటోలు, వీడియోలు తీయడం సరదా. వాటికి ఇబ్బంది లేకపోతే ఫర్వాలేదు. కానీ వాటిని చిరాకుకు గురి చేసి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటేనే అసలు సమస్య. ఇక జంతువుల ప్రైవసీకి భంగం కలిగించేలా ప్రవర్తించకూడదు. ఇప్పుడు ఈ సోదంతా ఏంటి అనుకుంటున్నారా.. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఎక్కడబడితే అక్కడ,, అదేపనిగా సెల్ఫీలు తీసుకుందామనుకునేవారికి ఓ ఒంటె మంచి గుణపాఠమే నేర్పింది. సెల్ఫీ మోజు ఓ మహిళ జుట్టుకు ఎసరు తెచ్చింది. జంతువులతో ఇలాటి సరదాలు తగవని ఆ ఒంటె చెప్పకనే చెప్పిందని ఇది చూసినవాళ్లంతా అంటున్నారు. ఎక్కడో తెలియదు గానీ.. ఓ మహిళ ఓ జూకు వెళ్లి అక్కడ ఎన్ క్లోజర్ లో ఉన్న ఒంటెను చూసి ముచ్చట పడింది. అదేమో అవతల ఉంది.. తాను బయటే నిలబడి దానితో సెల్ఫీ తీసుకోవడానికి ఆ ఎన్ క్లోజర్ కి మరీ దగ్గరగా వెళ్ళింది.

    తన మొబైల్ లో ఆ ఒంటె కనబడేట్టు సెల్ఫీ తీసుకుంటుండగా అది కామ్ గా తన ముఖాన్ని ముందుకు చాచి ఆమె జుట్టును నోటితో అందుకుంది. (బహుశా ఫుడ్ఆ అనుకుందో ఏమో..లేదా సెల్ఫీ తీసుకుంటున్నందుకు ఆగ్రహించిందేమో..) ఆమె వదిలించుకోబోగా అది ఒక్కసారిగా జుట్టును పట్టుకుని లాగడంతో అసలే కురచ జుట్టేమో చాలావరకు దాని నోట్లోకి వెళ్ళింది. అంతే ! గడ్డినో, ఆకులనో నమిలినట్టు ఆ ఒంటె ఆ జుట్టును నమిలేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. షాక్ తిన్న ఆ మహిళ ఒక్కసారిగా దానికి దూరంగా పరుగెత్తినంత పని చేసింది.

    ఇలా జంతువులతో సెల్ఫీ తీసుకుంటే డేంజరే సుమా అని అంటున్నారు. ఏనుగుతో సెల్ఫీ తీసుకుందామనుకోని ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనల్ని మనం చాలా చూశాం. సెల్ఫీ కన్నా ప్రాణాలు ముఖ్యమన్నా విషయాన్ని గుర్తించుకుంటే మంచిదంటున్నారు నెటిజన్లు.
    Published by:Sridhar Reddy
    First published: