Home /News /trending /

Woman Marries Cow: ఆవును పెళ్లి చేసుకున్న వృద్ధురాలు.. నా భర్త పునర్జన్మ ఎత్తాడు.. మళ్లీ ఒక్కటయ్యాం..

Woman Marries Cow: ఆవును పెళ్లి చేసుకున్న వృద్ధురాలు.. నా భర్త పునర్జన్మ ఎత్తాడు.. మళ్లీ ఒక్కటయ్యాం..

ఆవును పెళ్లి చేసుకున్న కంబోడియా మహిళ

ఆవును పెళ్లి చేసుకున్న కంబోడియా మహిళ

Woman marries Cow: ఆవును పెళ్లి చేసుకున్న ఆ మహిళ.. కుటుంబ సభ్యుడిలా దానికి కూడా ఇంట్లో స్థానం కల్పించింది. ఆవుతో పాటే ఆమె నిద్రపోతుంది. పడుకునేందుకు దిండు కూడా ఇస్తుంది

  ఇద్దరు మనుషులు పెళ్లి చేసుకోవడం కామన్. కానీ మనిషి, జంతువు వివాహం చేసుకోడం వెరైటీ. ఇటివల ఇలాంటి విచిత్ర పెళ్లిళ్లు ఎక్కువగా వార్తల్లో కెక్కుతున్నాయి. కొన్ని రోజుల క్రితం లండన్‌కు చెందిన  ఓ మహిళ తన భర్తకు విడాలకులిచ్చి పెంపుడు కుక్కను పెళ్లి చేసుకుంది. తన మాజీ భర్త కంటే ఈ కుక్కతోనే ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు తెలిపి షాకిచ్చింది. తాజా అలాంటి మరో వివాహం వెలుగులోకి వచ్చింది.  74 ఏళ్ల వృద్ధురాలు ఓ ఆవును పెళ్లి చేసుకుంది. లేటు వయసులో తన పెంపుడు గోవుతో కలిసి పెళ్లి పీటలెక్కింది. గ్రామస్తుల సమక్షంలో వీరి వివాహ వేడుక వైభవంగా జరిగిది. కంబోడియాలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.

  ది సన్ వెబ్‌సైట్ కథనం ప్రకారం.. కంబోడియాలోని క్రతి ప్రావిన్స్‌కు చెందిన ఖిమ్ హాంగ్ అనే 74 వృద్ధురాలుకు ఇద్దరు పిల్లలు.  కొన్నేళ్ల క్రితమే అనారోగ్యంతో ఆమె భర్త మరణించాడు.  ఆ తర్వాత పశువులను పోషిస్తూ.. వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగిస్తోంది. ఐత ఇటీవల ఆ మహిళ తన పెంపుడు ఆవును పెళ్లి చేసుకోవడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. తమ ఇంట్లో ఆవుదూడ పుట్టినప్పటి నుంచి.. దానిని ఎంతో ప్రేమగా చూసుకునేది ఖిమ్ హాంగ్. దానితోనే ఎక్కువ సమయం గడిపేది.  అలా ఆ ఆవుదూడ కూడా ఆమెకు దగ్గరయింది. ఖిమ్ హాంగ్ దగ్గరికి రాగానే చేతిని, నుదిటిని తన నాలుకతో నాకేది. అలా చూస్తుండగానే ఆవు పెద్దదయింది. ఐతే  అనూహ్యంగా తన పెంపుడు ఆవును పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చింది ఖిమ్ హాంగ్.

  అతడు అంబులెన్స్ లను ఎలా ఉపయోగించాడో చూడండి.. వామ్మో.. ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా..

  తన భర్త చూపించినట్లుగానే ఆవు కూడా తనపై ఎంతో ప్రేమ చూపిస్తోందని ఖిమ్ హాంగ్ తెలిపింది. ఆవు చూపిస్తున్న ప్రేమను చూస్తే, అది జంతువులా కనిపించడం లేదని.. సాక్షాత్తు తన భర్తే వచ్చినట్లు అనిపిస్తోందని పేర్కొంది. మరణించిన తన భర్త.. ఆవు రూపంలో మళ్లీ జన్మించాడని, అందుకే తనను ఇంత ప్రేమగా చూసుకుంటానని చెప్పింది. అందరికీ అది ఆవులా కనిపించవచ్చు గానీ.. తనకు మాత్రం తన భర్త కనిపిస్తున్నాడని తెలిపింది. అందుకే ఆవు రూపంలో ఉన్న తన భర్తను మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు పేర్కొంది. ఐతే ఆవును ఆ వృద్ధురాలు పెళ్లి చేసుకుందనడానికి వీడియో గానీ.. ఫొటో ఆధారాలు గానీ లేవు. కానీ స్థానికులు మాత్రం వారిద్దరు వివాహం చేసుకున్నారని, తమ సమక్షంలోనే ఆ కార్యక్రమం జరిగిందని చెబుతున్నారు.

  మాకు పెళ్లి కావాలి.. కాని పిల్లలు మాత్రం వద్దు’.. సహజీవనం ఇంకా మంచిది.. సర్వేలో షాకింగ్..

  ఆవును పెళ్లి చేసుకున్న ఆ మహిళ.. ఒక కుటుంబ సభ్యుడిలా దానికి కూడా ఇంట్లో స్థానం కల్పించింది. ఆవుతో పాటే ఆమె నిద్రపోతుంది. పడుకునేందుకు దిండు కూడా ఇస్తుంది. ఖిమ్ హాంగ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆవే మీ తండ్రి అని చెప్పడంతో.. వారు కూడా అదే నమ్ముతారు. ఆవును కన్నతండ్రిలా చూసుకుంటారు. ఒకవేళ తాను చనిపోతే ఆవును ఆవుగా చూడవద్దని.. ఎప్పటిలాగే తండ్రిగా చూసుకోవాలని తన పిల్లలకు బుద్ధులు చెప్పింది ఖిమ్ హాంగ్. దానిని ఎప్పటికీ ఎవరికీ అమ్మకూడదని తెలిపింది. ఒకవేళ ఆవు మరణిస్త.. మనిషికి జరిపినట్లుగానే అంత్యక్రియలు జరిపించాలని ఇప్పటి నుంచే చెబుతోంది. ఈ మహిళ స్టోరీ విన్న వారంతా.. ఇదేం విచిత్రమని ముక్కున వేలేసుకుంటున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Combodia, International, International news, VIRAL NEWS

  తదుపరి వార్తలు