• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • CALL WHEN YOU REACH MANDIR SOMEONE PLACED AN ORDER WITH ADDRESS BN

ఆన్‌లైన్ డెలివరీ కోసం ఇచ్చిన అడ్రస్ చూస్తే.. షాకవ్వాల్సిందే..

ఆన్‌లైన్ డెలివరీ కోసం ఇచ్చిన అడ్రస్ చూస్తే.. షాకవ్వాల్సిందే..

ఆన్‌లైన్ డెలివరీ కోసం ఇచ్చిన అడ్రస్

ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో షాపింగ్ చేశాడు. అందుకు సంబంధించిన వస్తువు డెలీవరీ కోసం 448 చాత్ మాతా మందిర్ దగ్గరికి వచ్చి ఫోన్ చేయండి అంటూ అడ్రస్‌లో పేర్కొన్నారు.

  • Share this:
    ప్రస్తుతం షాపింగ్ అంతా దాదాపుగా ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. ఈ-కామర్స్ దాదాపు అన్నిరకాల షాపింగ్స్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో అధికశాతం మంది వినియోగదారులు ఆన్‌లైన్‌లోనే షాపింగ్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే కొంతమంది వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేసేందుకు ఇచ్చిన అడ్రస్‌లు వింతగా ఉంటున్నాయి. వాటిని చూసి తెగ నవ్వుకునే పరిస్థితి ఉంది. తాజాగా రాజస్థాన్‌లో ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో షాపింగ్ చేశాడు. అందుకు సంబంధించిన వస్తువు డెలీవరీ కోసం 448 చాత్ మాతా మందిర్ దగ్గరికి వచ్చి ఫోన్ చేయండి అంటూ అడ్రస్‌లో పేర్కొన్నారు. వినేందుకు విచిత్రంగా ఉన్నా.. ఇది నిజమే. అందుకు సంబంధిచిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆన్‌లైన్ డెలివరీ కోసం ఇచ్చిన అడ్రస్ ఫొటోలను మంకేష్ పండిట్ రావు అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేశారు.



    దీంతో ట్వీట్‌‌పై నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ ఈ-కామర్స్‌గా అభివర్ణించారు. కొంతమంది నెటిజన్లు ఈ ప్రయోగం మనం కూడా ట్రై చేయాలనగా, మరికొంతమంది వస్తువును ఆర్డర్ చేసిన వ్యక్తం అందుకున్నారా? లేదా అన్న ప్రశ్నలు వేశారు. ఇంకొంత మంది నెటిజన్లు ఆర్డర్ చేసిన వ్యక్తి గురించి ఆరా తీశారు. అయితే ఈ ఆర్డర్ ఎవరు పెట్టారనేది స్పష్టంగా తెలియదు.
    Published by:Narsimha Badhini
    First published:

    అగ్ర కథనాలు