HOME »NEWS »TRENDING »cake cutting with talwar in maharashtra kolhapur video goes viral sk

Viral Video: తల్వార్‌తో కేక్ కటింగ్.. ఇలా కూడా చేస్తారా? వీడియో వైరల్..

Viral Video: తల్వార్‌తో  కేక్ కటింగ్.. ఇలా కూడా చేస్తారా? వీడియో వైరల్..
తల్వార్‌తో కేక్ కటింగ్

''హ్యాపీ బర్త్ డే టూ యూ'' అంటూ మిత్రులు హుషారుగా గీతాలాపన చేస్తుంటే.. అంతే ఉత్సాహంతో తల్వార్‌తో కేక్ కటింగ్ చేశాడు. ముక్కలు ముక్కలుగా కోసి మిత్రులకు తినిపించాడు.

  • Share this:
    బర్త్ డే అంటే కేక్ కటింగ్ తప్పనిసరి. కొవ్వొత్తులు ఊది..కేకును కోసిన తర్వాతే..అసలైన పుట్టిన రోజు వేడుక మొదలవుతుంది. సాధారణంగా బంధుమిత్రుల మధ్య చిన్న ప్లాస్టిక్ చాకుతో కేక్‌ను కట్ చేస్తారు. కానీ ఇక్కడో యువకుడు మాత్రం పేద్ద తల్వార్‌తో కేక్‌ను నరికేశాడు. అదేనండీ.. కట్ చేశాడు. ''హ్యాపీ బర్త్ డే టూ యూ'' అంటూ మిత్రులు హుషారుగా గీతాలాపన చేస్తుంటే.. అంతే ఉత్సాహంతో తల్వార్‌తో కేక్ కటింగ్ చేశాడు. ముక్కలు ముక్కలుగా కోసి మిత్రులకు తినిపించాడు. కేక్‌ను తల్వార్‌తో కోయడమేంటని అనుకుంటున్నారా? అవును ఇది నిజం. ఓ యువకుడు అత్యుత్సహంతో ఈ పనిచేసి అడ్డంగా బుక్కయ్యాడు.

    మహారాష్ట్రలోని కొల్హాపూర్‌‌లో ఈ ఘటన జరిగింది. కేక్ కటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. పబ్లిక్‌గా తల్వార్‌తో హల్ చల్ చేయడమేంటని నెటిజన్లు మండిపడ్డారు. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:December 23, 2020, 12:00 IST