news18-telugu
Updated: January 13, 2021, 12:58 PM IST
Twitter image
ఆరేళ్ల పిల్లాడు రెండు చెక్క కర్రలతో ఓ మార్బుల్‌పై డ్రమ్స్ లా అద్భుతంగా వాయించాడు. మంచి రిథమిక్‌గా మ్యూజిక్ సృష్టించాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లందరూ ఆ అబ్బాయిని ప్రశంసించారు. అతడికి ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలా గొప్పగా ఎదుగుతాడని అభిప్రాయపడ్డారు.
ఆ అద్భుతం సృష్టించిన ఆరేళ్ల అబ్బాయి పేరు అభిషేక్. కేరళ పరాసెరీలో ఉంటున్నారు. మళయాళీ పాట మణిచిట్రథజు అనే పాటకు సంబంధించిన మ్యూజిక్స్‌ను డ్రమ్స్ లేకుండానే రెండు కర్రల సాయంతో మార్బుల్స్‌పై అతడు వాయించాడు. దీంతో అతడి ప్రతిభకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఫిదా అయిపోయారు.
ఈ వీడియో చూసిన సినీ యాక్టర్ జయరామ్ కంచేలా… అభిషేక్‌కు చెండా అనే సంప్రదాయ సంగీత వాయిద్యాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. టాలెంట్‌ను కొనసాగించేలా ఆ చిన్నారిని ప్రోత్సహించారు. విజేశ్ మణి అనే దర్శకుడు ఆ అబ్బాయి వాళ్ల ఇంట్లో ఆ వాయిద్యాన్ని అందించారు.
అలాగే యాక్టర్ ఉన్ని ముకుందన్ కూడా అభిషేక్ టాలెంట్‌కు ఆకర్షితులయ్యారు. ఆ పిల్లాడిని ఎంకరేజ్ చేసేందుకు డ్రమ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే ఫేమ్ డ్రమ్మర్ అవ్వాలన్న అభిషేక్ కల నిజమయ్యేలా ఉంది.
Published by:
Krishna P
First published:
January 13, 2021, 12:48 PM IST