Home /News /trending /

BYJU’S Young Genius: డ్యాన్స్ లో దుమ్ములేపుతున్న 12 ఏళ్ల చిన్నారి.. గిన్నిస్ రికార్డ్ తో పాటు అనేక పురస్కారాలు..

BYJU’S Young Genius: డ్యాన్స్ లో దుమ్ములేపుతున్న 12 ఏళ్ల చిన్నారి.. గిన్నిస్ రికార్డ్ తో పాటు అనేక పురస్కారాలు..

వర్షిణి(photo: youtube)

వర్షిణి(photo: youtube)

కళకు వయస్సుతో సంబంధం లేదు.. నేర్చుకోవాలన్న ఆసక్తి, తపన, పట్టుదల ఉంటే సాధించివచ్చని నిరూపించింది ఈ 12 ఏళ్ల చిన్నారి. అనేక అవార్డులు సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది.

    కళకు వయస్సుతో సంబంధం లేదు.. నేర్చుకోవాలన్న ఆసక్తి, తపన, పట్టుదల ఉంటే సాధించివచ్చని నిరూపించింది ఈ 12 ఏళ్ల చిన్నారి. అనేక అవార్డులు సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను ఆమె ఎనిమిదేళ్ల వయస్సులోనే సాధించింది. ఆమె నృత్యం చేస్తుంటే ప్రంపంచాన్ని మైమరిచిపోకతప్పదని నిరూపిస్తోంది ఆ చిన్నారి. ఈ చిన్నారి వర్షిణిది కర్ణాటక రాష్ట్రంలోని బల్లారి ప్రాంతం. చిన్ననాటి నుంచే ఆమె డ్యాన్సర్ కావాలనే కోరిక ఉండేది. దీంతో టీవీ షోలు అధికంగా చేసేది. అనంతరం క్రమంగా డ్యాన్స్ నేర్చుకోవడం ప్రారంభించింది. అనంతరం చిన్న చిన్న ప్రదర్శణలు అచ్చేది. అనంతరం ఆమె డ్యాన్స్ లో ఫేమస్ అయ్యింది. కొద్ది ఏళ్లలోనే ఆమె ప్రతిభ వరల్డ్ రికార్డ్స్ స్థాయికి చేరింది. 2016లో ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆ చిన్నారి పేరు చేరింది.

    ఆ తర్వాత ఆ చిన్నారికి కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర పురస్కార్ అవార్డు అందించి సత్కరించింది. 2018 లో తిరుపతిలో కల్పశ్రీ అవార్డుతో సత్కారం పొందింది చిన్నారి వర్షణి. ఈ చిన్నారిలోని ప్రతిభను ఆమె కుటుంబం గుర్తించడంతోనే వర్షిణి ఈ రోజు అందరూ గర్వించే ఈ స్థాయికి చేరింది. పిల్లల్లోని ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహిస్తేనే ఇలాంటి అద్భుతాలు సాధ్యమవుతాయనడానికి నిదర్శనం ఈ ఘటన.

    వర్షిణికి కేవలం డ్యాన్స్‌పై మాత్రమే కాదు, పాటలు పాడడం, మ్యూజిక్, పెయింటింగ్, చదువుపైనా కూడా ఆసక్తి ఉంది. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని వర్షిణి చెబుతోంది. చిన్న తనంలోనే ఇన్ని అద్భుతాలు సాధించిన వర్షిణి ఐఏఎస్ ను సాధించడం అసాధ్యమా చెప్పండి. ఆ లక్ష్యాన్ని కూడా ఆమె సులువుగా చేరుకోవాలని ఆశిద్దాం.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: BYJUS, Guinness World Record, Karnataka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు