BYJU'S Young Genius: వయస్సు చిన్నది.. ప్రతిభ పెద్దది.. వీళ్లు మామూలోళ్లు కాదు..

స్టీవెన్ శామ్యూల్, అనుబ్రత సర్కార్ | Image credit: CNN News18

BYJU'S Young Genius 3వ ఎపిసోడ్ ఆధ్యాంతం ఉత్సాహంగా సాగింది. ఈ ఎపిసోడ్ లో చిన్నతనంలోనే అత్యంత ప్రతిభ చూపుతూ వివిధ రంగాల్లో రాణిస్తున్న అనుబ్రతా సర్కార్ మరియు స్టీవెన్ శామ్యూల్ పాల్గొన్నారు.

 • Share this:
  BYJU'S Young Genius 3వ ఎపిసోడ్ ఆధ్యాంతం ఉత్సాహంగా సాగింది. ఈ ఎపిసోడ్ లో చిన్నతనంలోనే అత్యంత ప్రతిభ చూపుతూ వివిధ రంగాల్లో రాణిస్తున్న అనుబ్రతా సర్కార్ మరియు స్టీవెన్ శామ్యూల్ పాల్గొన్నారు. వీరి విషయాలకు వస్తే.. పదేళ్ల అనుబ్రత వండర్ కిడ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ గా పేరు పొందాడు. 14 ఏళ్ల స్టీవెన్ అత్యంత వేగవంతమైన డ్రమ్మర్ గా పేరు గాంచాడు. తన కంపోజిషన్స్ కు Grammy అవార్డు పొందడమే లక్ష్యంగా తాను సాధన చేస్తున్నట్లు ఈ డ్రమ్స్ ప్లేయర్ స్టీవెన్ తెలిపాడు. అతను మూడేళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచే డ్రమ్స్ వాయిస్తున్నట్లు అతడు తెలిపాడు. మొదటి సారి ఐదేళ్ల వయస్సులో ఉన్నప్పడు లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చానన్నాడు. ప్రముఖ డ్రమ్స్ ప్లేయర్ శివమణితో కలిసి ప్రదర్శనలో పాల్గొన్నట్లు వివరించాడు. శివమణి అనేక ప్రాంతాలకు తనను తీసుకెళ్లినట్లు.. అతనే తనకు ఆదర్శమని చెప్పుకొచ్చాడు. రోజు తాను నాలుగు గంటలు ప్రాక్టీస్ చేస్తానని వివరించాడు. కేవలం మ్యూజిక్ మాత్రమే కాకుండా అతను క్రికెట్ కు సైతం అభిమానినని వివరించాడు. మాజీ కెప్టన్ ధోనికి విరాభిమానినని చెప్పాడు.

  ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనుబ్రత సర్కార్ విషయానికి వస్తే.. అతడు ఇప్పటికే 9 యాప్ లను తయారు చేసి రికార్డ్ సృష్టించాడు. మరో యాప్ ను తయారు చేసి విడుదలకు సిద్ధం చేశాడు. అతను తయారు చేసిన యాప్ లలో QRT Code Scanner, Brick-o-met, చాట్ యాప్ ‘‘Meet’’, Weather in Celsius, Police Alert తదితర ప్రముఖ యాప్ లు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ లోని అలిపురద్వార్ కు చెందిన ఈ బుడతడు ఆసక్తి కలిగిన వారికి కోడింగ్ పై అవగాహన కల్పించేందుకు ఓ యూ ట్యూబ్ చానల్ సైతం నిర్వహిస్తుండడం విశేషం. యూ ట్యూబ్ లో చూసే తాను కోడ్ రాయడం నేర్చుకున్నట్లు అతను వివరించాడు. అతను రూపొందించిన తాజా యాప్ ‘‘పోలీస్ అలర్ట్’’ అత్యవసర సమయాల్లో వినియోగదారులు పోలీస్ ను సంప్రదించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఇద్దరు చిన్నారులకు బైజూస్ ట్రోఫీని అందించారు.


  పిల్లల్లో దాగున్న ప్రతిభను వెలికితీయడంతో పాటు ఇతరుల్లో స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా న్యూస్ 18 నెట్‌వర్క్ (News18), బైజుస్ (Byjus) సంస్థలు 'యంగ్ జీనియస్ (Young Genius) కార్యక్రమాన్ని చేపట్టాయి. గత ఏడాది నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా యంగ్ జీనియస్ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. అప్పటి నుంచీ దరఖాస్తులను స్వీకరించారు. అందులో నుంచి 21 మంది బాలలను ఫైనల్ చేశారు. వారి అసాధారణమైన ప్రతిభాపాఠవాలను బుల్లితెరపై ప్రసారం చేయబోతోంది న్యూస్ 18. 'యంగ్ జీనియస్' ప్రోగ్రాం లాంచింగ్ డేట్‌ను న్యూస్ 18, బైజుస్ సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. ఈ కార్యక్రమం జనవరి 16 నుంచి... న్యూస్ 18కు చెందిన 18 ఛానెళ్లలో ప్రసారం అవుతున్నాయి. వారానికి ఒకరోజు ప్రసారమయ్యే ఈ షోలో మొత్తం 11 ఎపిసోడ్‌లు ఉంటాయి. మార్చి 27 వరకు ప్రసారమవుతుంది.
  Published by:Nikhil Kumar S
  First published: