బైబై ఇండియా... ఓన్లీ భారత్... సోషల్ మీడియాలో కొత్త ఉద్యమం....

బైబై ఇండియా... ఓన్లీ భారత్... దేశవ్యాప్తంగా కొత్త ఉద్యమం.... (credit - twitter)

#ByeByeIndiaOnlyBharat : భారత దేశం పేరు... భారత్ అని ఉండాలనే డిమాండ్ ఎందుకొచ్చింది? ఇండియా అని పిలిస్తే వచ్చే సమస్యేంటి?

 • Share this:
  నెటిజన్లు చాలా తెలివైనవారు. వాళ్లు సైలెంట్‌గా ఉన్నారంటే... ఏదో నిశ్శబ్ద వివ్లవం ప్రారంభిస్తున్నారని అర్థం. తాజాగా అదే జరిగింది. ఇప్పుడు బైబై ఇండియా ఓన్లీ భారత్ అనే కొత్త ఉద్యమం సోషల్ మీడియా సాక్షిగా ఊపందుకుంది. మామూలుగా ఉద్యమాలంటే... ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాలనో లేక ఇంకెవరినైనా టార్గెట్ చేస్తూ... నినాదాలు చేస్తారు కదా. ఈ ఉద్యమం అలాంటిది కాదు. ఇది సోషల్ మీడియాలోనే కనిపిస్తోంది. కానీ చాలా లోతుగా ఉంది. ఇప్పటివరకూ భారత్‌ను ఇండియా అని పిలిచినా పెద్దగా పట్టించుకోని నెటిజన్లు ఇప్పుడు మాత్రం ఇండియా అనే పేరే ఉండకూడదంటున్నారు. ఇకపై భారత దేశాన్ని భారత్ అనే పిలవాలనీ, ఇండియా అని ఎట్టిపరిస్థితుల్లో పిలవవద్దని కోరుతున్నారు.


  ఈ సందర్భంగా మనం ఓ చిన్న విషయం చెప్పుకుందాం. భారత్‌ను పూర్వం జంబూ ద్వీపం అనేవారు. భరత ఖండం అనేవారు. అప్పట్లో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇలా చాలా దేశాలు ఇండియాలో భాగంగా ఉండేవి. అంత పెద్దగా ఉండే దేశం మనది. అందుకే దాన్ని ఖండంగా బావించేవారు. ఆ తర్వాత బ్రిటిషర్లు వచ్చాక... సింధూ నదిని ఇండస్ అని పిలిచారు. అలాగే... హిందూ మహాసముద్రం పేరు ఆధారంగా... మన దేశాన్ని హిందుస్థాన్ అని పలకడం రాక.... ఇండియా అనేశారు. అలా ఆ పేరును వాళ్లు ఫేమస్ చేసుకున్నారు. కాలక్రమంలో మన దేశానికి అటు ఇండియా, ఇటు భారత్ అనే రెండు పేర్లూ క్లిక్ అయిపోయాయి. ఐతే... ప్రస్తుతం ప్రపంచ దేశాలకు భారత్ కంటే... ఇండియా అంటేనే ఎక్కువగా ఐడియా ఉంటోంది. ఎందుకంటే భారతీయులు అనే పదం కంటే... ఇండియన్స్ అనే పదం ఎక్కువగా ప్రచారంలోకి వెళ్లడమే.  సరే... ఇప్పుడీ ఉద్యమం ఎందుకు వచ్చిదంటే... ఇండియా అనే పేరును భారత్‌ లేదా హిందుస్తాన్‌గా మార్చాలంటూ సుప్రీంకోర్టులో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. దానిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. దేశం పేరును భారత్ అని మార్చితే... ప్రజల్లో ఆత్మగౌరవం, జాతీయతా భావం పెరుగుతుందని పిటిషనర్ తెలిపారు. అంతేకాదు భారత్ అనే పేరును చేర్చడం వల్ల స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని గుర్తు చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది అని పిటిషన్‌లో తెలిపారు. ఈ పిటిషన్‌ను సమర్థిస్తూ... నెటిజన్లు బైబై ఇండియా ఓన్లీ భారత్ అనే నినాదం అందుకున్నారు. అది ఓ సైలెంట్ రివల్యూషన్‌గా మారింది. మరి సుప్రీంకోర్టు ఏం చెబుతుందో.

  Published by:Krishna Kumar N
  First published: