స్మార్ట్ ఫోన్ కొంటే కేజీ ఉల్లి ఫ్రీ... ప్లాన్ వర్కవుట్ అయిందిగా...

తన షాపులో మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే వారికి ఓ కేజీ ఉల్లిపాయలు ఫ్రీగా ఇస్తానని ప్రకటించాడు. దీంతో ఫోన్ కొనాలనుకునే వారు ఉల్లి కూడా ఫ్రీగా వస్తుందిగా అని ఆ షాపులోనే కొంటున్నారు.

news18-telugu
Updated: December 7, 2019, 10:05 PM IST
స్మార్ట్ ఫోన్ కొంటే కేజీ ఉల్లి ఫ్రీ... ప్లాన్ వర్కవుట్ అయిందిగా...
స్మార్ట్ ఫోన్ కొంటే కేజీ ఉల్లి ఫ్రీ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ్
  • Share this:
దేశంలో ఉల్లి ధరలు బాగా పెరిగిపోతున్నాయి. కేజీ రూ.120 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉల్లిధరలను కంట్రోల్ చేసేందుకు నానా తంటాలుపడుతున్నాయి. విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉల్లిధరలను ఆధారంగా చేసుకుని తన బిజినెస్ పెంచుకునేందుకు ఓ ప్లాన్ వేశాడు యువకుడు. అది విజయవంతం కావడం విశేషం.

తమిళనాడులోని తంజావూరు జిల్లా పత్తుకొట్టే అనే ఊళ్లో శవరణకుమార్ అనే వ్యక్తి ఎస్టీఆర్ మొబైల్స్ నడుపుతున్నాడు. తన షాపులో మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే వారికి ఓ కేజీ ఉల్లిపాయలు ఫ్రీగా ఇస్తానని ప్రకటించాడు. ఆ విషయాన్ని ఫ్లెక్సీల మీద ప్రింట్ చేయించి.. తన షాపు ముందు పెట్టాడు. దీంతో ఇదేదో బాగుందంటూ జనం కూడా అటువైపు నడుస్తున్నారు. ఏడేళ్ల నుంచి శరవణకుమార్ ఈ షాపు నడుపుతున్నాడు. గతంలో రోజుకు రెండు, మూడు సెల్ ఫోన్లు అమ్మేవాడు. అయితే, ఈ ఉల్లిపాయల ఆఫర్ ప్రకటించిన దగ్గరి నుంచి రోజుకు ఎనిమిది ఫోన్లకు తక్కువకాకుండా విక్రయిస్తున్నాడు.

తమిళనాడులో కేజీ ఉల్లి రూ.140 నుంచి రూ.160 వరకు పలుకుతోంది. అందులో కొంచెం పెద్దగా ఉండేవి తక్కువ ధర, కొంచెం మధ్యస్తంగా ఉండేవి ఎక్కువ రేటు పలుకుతున్నాయి. ఓ పది కేజీల ఉల్లిపాయలను కొని.. వాటిని కేజీల చొప్పున కవర్లలో కట్టి పెడుతున్నాడు. సెల్ ఫోన్ కొనుగోలు చేసిన వారికి అందులో పెద్ద పెద్ద ఉల్లిపాయలు కావాలంటే అవి తీసుకోవచ్చు. లేదా మధ్యస్తంగా ఉండేవి కావాలంటే వాటిని తీసుకెళ్లవచ్చు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 7, 2019, 10:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading