హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral video : కదిలే ఏసీ కల్యాణ మండపం .. వీడియో చూసి ఫిదా అయిన ఆనంద్‌ మహీంద్రా

Viral video : కదిలే ఏసీ కల్యాణ మండపం .. వీడియో చూసి ఫిదా అయిన ఆనంద్‌ మహీంద్రా

Mobile AC function hall

Mobile AC function hall

Viral video:కంటైనర్‌ని కదిలే ఏసీ ఫంక్షన్‌ హాలుగా మార్చారు కొందరు ఔత్సాహికులు. ఎలా పట్టుకున్నారో తెలియదు కాని ఆనంద్ మహీంద్ర ఆ వీడియోని తన ట్వీట్టర్‌ ద్వారా షేర్ చేశారు. ఏమని కితాబిచ్చారో తెలుసా బిజినెస్‌ థైకూన్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఆయన కళ్లు ఎప్పుడూ కొత్తదనాన్ని వెదుకుతాయి. ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు గాంచిన బిజినెస్‌మెన్‌గా బిజీగా ఉంటూనే సోషల్ మీడియా(Social media)లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. మహేంద్ర గ్రూప్‌ చైర్మన్ ఆనంద్‌ మహీంద్ర(Anandra Mahindra)షేర్ చేసిన ఓ వీడియో(Video) ఇప్పుడు అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కదిలే వాహనాన్ని ఫంక్షన్‌ హాలుగా మార్చారు కొందరు ఔత్సాహికులు. ఎలా పట్టుకున్నారో తెలియదు కాని ఆనంద్ మహీంద్ర ఆ వీడియోని తన ట్వీట్టర్‌(Twitter) ద్వారా షేర్ చేశారు. ఒక్క గొప్ప ఐడియాతో కదిలే ఫంక్షన్‌ హాలు( Mobile AC function hall)ను సృష్టించిన వ్యక్తిని తాను కలవాలనుకుంటున్నానని పేర్కొనడంపై అందరూ మహేంద్ర ట్వీట్‌కి రిప్లై ఇస్తున్నారు. ఆయన హుందాతనాన్ని అభినందిస్తున్నారు.

పెళ్లిలో వింత కండీషన్.. ఆధార్ కార్డ్ ఉంటేనే దావత్ కు పర్మిషన్.. వీడియో వైరల్..

కదిలే కల్యాణ మండపం..

వినూత్న ఆలోచన, పనిలో కొత్తదనం చూపిస్తే గుర్తింపు దానంతటకి అదే వస్తుందని ఓ వ్యక్తి నిరూపించాడు. ఆ ఆలోచన ఏకంగా ప్రపంచంలోనే ఫేమస్ బిజినెస్‌మెన్‌గా గుర్తింపు పొందిన మహేంద్ర గ్రూప్‌ చైర్మెన్‌ దృష్టిని ఆకర్షిస్తుందని ఎవరూ ఊహించలేదు. బిజినెస్ థైకూన్ ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్ ఖాతాలో ఓ వినూత్నమైన వీడియోని పోస్ట్ చేశారు. అది ఏమిటంటే కదిలే ఏసీ ఫంక్షన్ హాలు. ఓ కంటైనర్‌ని ఫంక్షన్‌గాలుగా మార్చారు. ఇందులో 200మంది కూర్చొని దర్జాగా పెళ్లి తంతు చూసే విధంగా డిజైన్ చేశాడు క్రియేటర్. స్టైలీష్ ఇంటీరియర్, లోపల డెకరేషన్ మార్చుకునేందుకు వీలుగా సృష్టించారు.

లగ్జరీ ఏసీ ఫంక్షన్ హాలు..

అంతే కాదు ఈ కంటైనర్‌ని ఒకచోటి నుంచి మరో చోటికి లారీపై తరలించేందుకు అనుకూలంగా తయారు చేశారు. 40అడుగుల పొడవున్న ఈ కంటైనర్‌ని ఫోల్డ్‌ చేసే విధంగా స్ట్రాంగ్ మెటీరియల్‌తో రూపొందించారు. ఇక ఈ ఫంక్షన్ హాలు ఫోల్డింగ్‌ని తెరిస్తే మరో 30అడుగుల వరకు విస్తీర్ణం పెరిగేలా తయారు చేశారు.చూడటానికే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఈ మొబైల్ ఫంక్షన్‌ హాలు ఆనంద్‌ మహీంద్రను తెగ ఆకట్టుకుంది. అంతే కాదు ఈ వీడియోని తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేస్తూ ఇంతటి గొప్ప ఆలోచనతో మొబైల్ ఫంక్షన్‌ హాలు రూపొందించిన వ్యక్తిని తాను కలవాలనుకుంటున్నాని ట్వీట్ చేశారు. ఆతనితో తన మనోభావాలు, దీన్ని తయారు చేయడానికి తీసుకున్న జాగ్రత్తలను తెలుసుకోవాలని ఉందని కామెంట్ చేశారు.

ఔట్‌ డోర్ వెడ్డింగ్‌కి ఇదే బెటర్ ..

సాధారణ కల్యాణ మండపాల తరహాలోనే 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏసీ హాలు, భోజన సదుపాయాలతో దీన్ని రూపొందించారు. ఈ పోర్టబుల్ మ్యారేజ్ హాల్ వీడియో ఖర్చు పరంగా కూడా ఎంతో తక్కువగా ఉంటోందని శుభకార్యాలు నిర్వహించుకున్న వాళ్లు చెబుతున్నారు. ఈ మొబైల్ ఫంక్షన్‌ హాలు వర్షాకాలంలో జరిగే ఔట్ డోర్ వెడ్డింగ్ వెన్యూలతో పోలిస్తే ఎంతో బెటర్ అని సూచిస్తున్నారు తయారు చేసిన రూపకర్తలు. ధరేకార్ ఈవెంట్స్‌ పేరుతో ఈ దీన్ని అందరికి అందుబాటులో ఉంచుతున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Anand mahindra, Trending news, Viral Video

ఉత్తమ కథలు