హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Anand Mahindra :పైసా ఖర్చు లేకుండా ట్రెడ్‌మిల్ తయారి .. వీడియోని వైరల్ చేసిన ఆనంద్ మహీంద్ర

Anand Mahindra :పైసా ఖర్చు లేకుండా ట్రెడ్‌మిల్ తయారి .. వీడియోని వైరల్ చేసిన ఆనంద్ మహీంద్ర

VIRAL VIDEO(Photo:Twitter)

VIRAL VIDEO(Photo:Twitter)

Anand Mahindra : బిజినెస్‌మెన్ ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. గొప్ప వాళ్లకు ఎప్పుడూ గొప్ప విషయాలే కంట పడతాయన్నట్లుగా ఆనంద్ మహీంద్ర ట్వీట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో ఏముందో చూడండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఆయనో బడా వ్యాపారవేత్త. దేశంలోనే క్షణం తీరికలేని బిజినెస్‌మెన్. ఆటో మొబైల్‌ రంగంలో మహీంద్ర అనే సంస్థకు చైర్మెన్‌గా ఉన్న ఆనంద్‌ మహీంద్ర (Anandra Mahindra)నిత్యం వ్యాపార అభివృద్ధితో పాటు కొత్తగా ఆలోచించడం, వినూత్న ప్రయోగాలు చేస్తూ మరుగునపడిపోతున్న వారిని బాహ్య ప్రపంచానికి తెలియజేసే బాధ్యతను తీసుకున్నారు. ఇది ప్రత్యేకించి ఆయన చేస్తున్న పని కాకపోయినప్పటికి...అలాంటి సెలబ్రిటీ  సోషల్ మీడియా(Social media)లో షేర్ చేసే వీడియోలు, వాటిపై ఆయన నిర్ణయాలు, అభిప్రాయాలు చెప్పడంతో మరింత మందికి సుపరిచితులయ్యారు ఆనంద్ మహీంద్ర. గొప్ప వాళ్లకు ఎప్పుడూ గొప్ప విషయాలే కంట పడతాయన్నట్లుగా ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌(Twitter)

లో షేర్ చేసిన ఓ వీడియో(Video) ఇప్పుడు వైరల్‌(Viral)గా మారింది.

Amazing news: పిట్ట కొంచెం..కూత ఘనం 8ఏళ్ల పిల్లాడి టాలెంట్‌కి మాజీ సీఎం భార్యే ఫిదా..వీడియో ఇదిగో..

ఖర్చు లేకుండా ట్రెడ్‌మిల్ ..

ఓ యువకుడు ట్రెడ్‌మిల్‌ లేకుండా తన ఐడియా ఉపయోగించి ఇంట్లోనే స్లో వాకింగ్‌, జాగింగ్ చేయడం ఆనంద్ మహీంద్రకు విపరీతంగా నచ్చేసింది. ఆ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేసిన బిజినెస్‌ తైకూన్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధర కలిగిన ట్రెడ్‌మిల్ ఇది అంటూ కామెంట్ పోస్ట్ చేశారు. అంతే కాదు ఈ సంవత్సరం ఇన్నోవేషన్ అవార్డు ట్రోఫీకి ఇతను వెళ్లడం ఖాయమంటూ కితాబిచ్చారు.

వైరల్ అవుతున్న వీడియో..

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు మహేంద్ర గ్రూప్‌ చైర్మన్ ఆనంద్‌ మహీంద్ర. ఆయనకున్న ఫాలోయింగ్‌ని ఎప్పుడూ తగ్గించుకోకుండా ..చాలా వినూత్నంగా, వెరైటీగా ఉంటే వాస్తవాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ట్విట్టర్‌ హ్యాండిల్‌లో అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు.

గొప్ప వ్యక్తే కాదు..ఐడియల్ పర్సన్..

గతంలో కూడా ఓ డొక్కు జీపులో ఫ్యామిలీని తీసుకెళ్తున్న వ్యక్తి వీడియో చూసి ఫిదా అయిన మహీంద్ర అతనికి కొత్త కారు ఇచ్చి ఆ వాహనం తీసుకుంటానని చెప్పారు. చెప్పినట్లుగానే చేశారు.ఆ తర్వాత కదిలే ఏసీ ఫంక్షన్ హాలుకు సంబందించిన ఓ వీడియోని వైరల్ చేశారు బిజినెస్‌మెన్. ఇందులో 200మంది కూర్చొని దర్జాగా పెళ్లి తంతు చూసే విధంగా ఓ కంటైనర్‌ని డిజైన్ చేసిన వ్యక్తిని అభినందించారు మహీంద్ర. ఇలాంటి వీడియోలు షేర్ చేస్తూ ..వెలుగులోకి రాని ఎంతో మంది తెలివి తేటలు, ఐడియాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ తన గొప్ప తనాన్ని మరింత పెంచుకుంటున్నారు.

First published:

Tags: Anand mahindra, National News, Viral Video

ఉత్తమ కథలు